For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెన్సెక్స్, నిఫ్టీ జోరు.. ఆరో రోజూ భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

|

సోమవారం నాటి స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది..ఆరు నెలల గరిష్ట లాభలతో సెన్సెక్స్ ముగియగా నిప్టి మాత్రం ఆరో రోజు కూడ పటిష్టమైన లాభాలతో ముటగట్టుకుంది .నేటి ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ప్రారంభించిన సూచీలు మధ్యలో అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. చివరకు మళ్లీ కోలుకుని లాభాలను నిలబెట్టుకున్నాయి. దీంతో దేశీయ మార్కెట్ల లాభాల జోరు కొనసాగింది. విదేశీ పెట్టుబడులు పెరగడంతో పాటు దేశీయ కరెన్సీ రూపాయి బలపడటం మార్కెట్‌కు కలిసొచ్చింది.

ఉదయం. ట్రేడింగ్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ కూడా 11,500 మార్క్‌ పైన ట్రేడ్‌ అయ్యింది. అయితే ఆ తర్వాత ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో కాస్త ఒత్తిడికి గురైన సూచీలు ఆరంభ లాభాల్లో చాలా వరకు కోల్పోయాయి. ఒక దశలో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే చివరి గంటల్లో లోహ, బ్యాంకింగ్‌, ఎనర్జీ రంగాల షేర్లలో జరిగిన కొనుగోళ్లు సూచీలను నిలబెట్టాయి. మొత్తం నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 71 పాయింట్లు లాభపడి 38,095 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 11,462 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 55 పైసలు బలపడి 68.53గా కొనసాగుతోంది.

Sensex ends at 6-month high, Nifty inches higher for sixth day

లాభాల్లో కొనసాగిన షేర్లు,
ఎన్‌ఎస్‌ఈలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడగా..

నష్టాల్లో కొనసాగిన షేర్లు
మారుతి సుజుకీ, హీరోమోటార్స్‌, విప్రో, ఎయిర్‌టెల్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు నష్టపోయాయి.

English summary

సెన్సెక్స్, నిఫ్టీ జోరు.. ఆరో రోజూ భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి | Sensex ends at 6-month high, Nifty inches higher for sixth day

In a day marked by volatile trading, market indices closed higher for the sixth straight day today. Sensex ended 70 points up at 38,095.07 while Nifty ended up 35 points at 11,462.20. Nifty reclaimed the 11,500 mark during the day and Sensex closed the day at a 6-month high.
Story first published: Monday, March 18, 2019, 18:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X