For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేవలం 2 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్,నిఫ్టీ

By Chanakya
|

స్టాక్ మార్కెట్లలోనాలుగు రోజుల వరుస ర్యాలీకి ఎట్టకేలకు బ్రేక్ పడింది. సూచీలు ఫ్లాట్‌గా క్లోజయ్యాయి. బ్యాంక్ నిఫ్టి కొద్దోగొప్పోప్రయత్నించినప్పటికీపెద్దగా లాభాలు మాత్రంరాలేదు. ఆద్యంతం 50 - 60పాయింట్ల టైట్ రేంజ్‌లో కదలాడిన నిఫ్టీ లాభనష్టాల మధ్య దోబూచులాడింది. చివరకు కేవలం రెండంటేరెండు పాయింట్ల లాభంతో ఫ్లాట్‌గా ముగిసింది. ఆటో,ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్‌లో కొద్దిగా అమ్మకాల ఒత్తిడి నమోదైంది.చివరకు 3 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 37755 దగ్గర క్లోజైంది. నిఫ్టీ 2పాయింట్లు పెరిగి 11,343 దగ్గర ముగిసింది.

ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్, సన్ ఫార్మా, కోల్ ఇండియా షేర్లు టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. పవర్ గ్రిడ్, హెచ్ సి ఎల్ టెక్, హీరోమోటో కార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్ షేర్లు టాప్ 5 గెయినర్స్‌గానిలిచాయి.

ఫౌండేషన్‌కు ఇప్పుడు రూ.1.45 లక్షల కోట్ల దానం !ఫౌండేషన్‌కు ఇప్పుడు రూ.1.45 లక్షల కోట్ల దానం !

ఈక్లెర్క్స్‌కు బైబ్యాక్ ఎఫెక్ట్

ఈ క్లెర్క్స్ షేర్ ఇంట్రాడేలో 6.5 శాతం వరకూ పెరిగాయి . కంపెనీ రూ.262 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేస్తోందనే వార్తల నేపధ్యంలో స్టాక్పెరిగింది. ట్రేడింగ్ః వాల్యూమ్ రెట్టింపైంది. చివరకు స్టాక్ 3.6 శాతం పెరిగి రూ.1150 దగ్గర క్లోజైంది.

Sensex, Nifty End almost unchanged after Rallying For four Day

ఎస్సెల్ గ్రూప్ జోరు

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో వాటా కొనుగోలుకు సోనీ ఆసక్తి చూపడం, డీల్ ఖరారవుతోందనే అంచనాలతో ఎస్సెల్ గ్రూప్ షేర్లలో జోరు నమోదైంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ అర శాతం పెరిగి రూ.450 దగ్గర క్లోజైంది. ఎస్సెస్ ప్రోప్యాక్ 7 శాతం పెరిగి రూ.117 దగ్గర ముగిసింది, డిష్ టీవీ కూడా రెండు శాతం వరకూ లాభపడగా.. జీ లెర్న్ మాత్రం స్వల్ప నష్టాల్లో క్లోజైంది.

రిలయన్స్ రికార్డ్ రన్

రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ వరుసగా నాలుగో రోజు కూడా రికార్డ్ ర్యాలీని కొనసాగించింది.ః ఇంట్రాడేలో స్టాక్ రూ.1362 ఆల్ టైం హై మార్కునుతాకింది. అయితే చివర్లో స్టాక్ కొద్దిగా అమ్మకాల ఒత్తిడికి లోనై అర శాతం తగ్గింది. రూ.1341 దగ్గర స్టాక్ క్లోజైంది.

Sensex, Nifty End almost unchanged after Rallying For four Day

రియాల్టీ రన్

రియల్ ఎస్టేట్ స్టాక్స్‌లో ఈ రోజు కొద్దిగా ర్యాలీ నమోదైంది. ఫినిక్స్ మిల్స్ 7.5 శాతం, ఐబి రియల్ ఎస్టేట్ 7 శాతం,డిఎల్ఎఫ్ 5 శాతం లాభపడింది.సన్ టెక్, ప్రెస్టీజ్స్టాక్స్ రెండు శాతం వరకూ పెరిగాయి.

English summary

కేవలం 2 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్,నిఫ్టీ | Sensex, Nifty End almost unchanged after Rallying For four Day

Sensex, Nifty End almost unchanged after Rallying For four Day,Sensex, Nifty settle flat as investors take profit
Story first published: Thursday, March 14, 2019, 19:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X