For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కేట్...

By Chanakya
|

స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో ముగిసింది. మూడు వారాల తర్వాత వరుసగా రెండో రోజు కూడా మెరుగైనా లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ 10800 పాయింట్ల సెంటిమెంట్ మార్క్‌ను క్రాస్ చేసినప్పటికీ నిలబెట్టు కోలేకపోయింది. బ్యాంకులు, మెటల్స్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుకు తోడు మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా ఉత్సాహంగా ట్రేడ్ అయ్యాయి. చివరకు నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 10,790 పాయింట్ల దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 150 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 97 పాయింట్ల లాభపడ్జాయి.

ఇండియాబుల్స్ హౌసింగ్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, వేదాంతా, డాక్టర్ రెడ్డీస్ టాప్ ఫైవ్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇన్ఫ్రాటెల్, బిపిసిఎల్, యెస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి స్టాక్స్ టాప్ 5 లూజర్స్‌గా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ న్యూస్‌తో ఫ్లాట్‌గా మొదలైన ప్రదాన సూచీ నిఫ్టీ ఒక దశలో నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో 10721 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగొచ్చింది. అయితే 11 గంటల సమయం నుంచి కొనుగోళ్ల మద్దతు మార్కెట్లకు లభించింది. అప్పటి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూడని మార్కెట్లు అదే ఊపుతో 10809 పాయింట్ల వరకూ వెళ్లింది. చివర్లో కొద్దిగా లాభాల స్వీకరణ రావడంతో 20 పాయింట్లు కోల్పోయింది. ఫార్మా, మెటల్, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగ స్టాక్స్‌లో జోరు నమోదైంది. అయితే ఐటి స్టాక్స్ మాత్రం ఈ రోజు కాస్త దిగాలు పడ్డాయి. ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ మార్కెట్లను పైకి లాగితే, ఇన్ఫోసిస్ వంటి స్టాక్స్ నిఫ్టీని డౌన్ సైడ్ డ్రాగ్ చేశాయి.

మెటల్స్ స్టాక్స్ లాభాలు
వరుస పతనాలతో ఇంతకాలం ఇబ్బంది పడ్డ మెటల్ స్టాక్స్‌ వరుసగా మూడో రోజు కూడా లాభపడ్డాయి. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ మెటల్ ప్యాక్‌ను లీడ్ చేశాయి. ఇది 4.5 శాతం వరకూ లాభపడింది. జిందాల్ స్టీల్, వేదాంతా, వెల్‌స్పన్, సెయిల్ రెండు శాతానికిపైగా పెరిగాయి. నాల్కో మాత్రం వరుసగా పతనమవుతూనే ఉంది.

Sensex, nifty clocked best two day rally after three weeks

అంబానీ ఆఖరి అస్త్రం
ఎరిక్సన్ క్లాస్‌లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీ ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. రిలయన్స్ క్యాపిటల్‌లో భాగస్వామి అయిన నిప్పన్ ఇన్సూరెన్స్‌ను ఆహ్వానించిన సంస్థ, అవసరమనుకుంటే 42.88 శాతం వాటాను కొనుక్కోవచ్చని ఆఫర్ ఇచ్చింది. ప్రస్తుతం రిలయన్స్ నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్‌లో నిప్పన్‌కు 42.88 శాతం వాటా ఉంది. వాటాల అమ్మకం ద్వారా నిధులను సమీకరించి ఎరిక్సన్‌కు బకాయిపడిన రూ. 440 కోట్లను వెంటనే చెల్లించేయాలని అనిల్ అంబానీ చూస్తున్నారు.
ఈ వార్తల నేపధ్యంలో అడాగ్ గ్రూపులో ఉన్న స్టాక్స్ అన్నీ పెరిగాయి. రిలయన్స్ క్యాపిటల్ 11 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 9 శాతం, రిలయన్స్ పవర్ 5 శాతం పెరిగాయి. నిప్పన్ మాత్రం 20 శాతం అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయి రూ.185 దగ్గర క్లోజ్ అయింది.

టెక్ మహీంద్రా బై బ్యాక్
ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా స్టార్ లైఫ్ టైం హై స్థాయికి వెళ్లింది. షేర్ బైబ్యాక్‌ను సంస్థ ప్రతిపాదించడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రూ.950 చొప్పున స్టాక్స్ బైబ్యాక్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్లో టెక్ మహీంద్రా స్టాక్ రూ. 820 దగ్గర ట్రేడవుతోంది. సుమారు రూ.1956 కోట్లతో 2.1 శాతం షేర్లను తిరిగి సంస్థ కొనుగోలు చేయనుంది.
ఈ వార్తల నేపధ్యంలో టెక్ మహీంద్రా స్టాక్ 1.07 శాతం పెరిగి రూ.820 దగ్గర ముగిసింది.

ప్రభుత్వ బ్యాంకులకు మూలధన కిక్
ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం మూలధన ఆర్థిక సాయం చేయడంతో సదరు బ్యాంక్ స్టాక్స్ ఎగిరి గంతేశాయి. సెంట్రల్ బ్యాంక్ స్టాక్ 7 శాతం లాభపడింది. సిండికెట్ బ్యాంక్ 3.7 శాతం, ఐడిబిఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3 శాతం పెరిగాయి.

హౌసింగ్ స్టాక్స్ హాట్ మూవ్
గృహ రుణాల వ్యాపారంలో ఉన్న స్టాక్స్ అన్నీ ఈ రోజు ఎగిరి గంతేశాయి. ప్రధానంగా క్యాన్‌ఫిన్ హోమ్స్ 7 శాతం పెరిగితే, ఐబి హౌసింగ్, పీఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ 5.5 శాతం, దివాన్ హౌసింగ్ 5.2 శాతం పెరిగాయి. ఇదే బాటలో రెప్కో, జీఐసీ, గృహ్ ఫైనాన్స్ 3 శాతం వరకూ పెరిగాయి. రిలయన్స్ హోం ఫైనాన్స్ 10 శాతం పెరిగింది

English summary

వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కేట్... | Sensex, nifty clocked best two day rally after three weeks

Sensex, nifty clocked best two day rally after three weeks. Nifty again tested 10800 points to take big move. Inspite of some selling nifty managed to close above sentiment mark.
Story first published: Thursday, February 21, 2019, 19:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X