For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొమ్మిది రోజుల నష్టాలకు బ్రేక్.. ! సెన్సెక్స్ 400 పాయింట్లు లాభం

|

హైద్రబాద్ ...తొమ్మిది రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది ఎట్టకేలకు మార్కెట్లు లాభాల్లో ముగిసి ఇన్వెస్టర్లో కొద్దిగా నమ్మకాన్ని నిలబెట్టాయి. కొద్దిగా ఓవర్ సోల్డ్‌ జోన్‌లో ఉన్న మార్కెట్లు ఈ రోజు తేరుకున్నాయి. నిఫ్టీ మళ్లీ 10700 పాయింట్ల మార్కుపైనే ముగియడం మంచి సంకేతంగా చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రోత్సాహక సంకేతాలతో లాభాలతో మొదలైన మార్కెట్లు ఆఖరి వరకూ అదే పట్టును కొనసాగించాయి. చివరి గంటలో రెట్టించిన ఉత్సాహంతో కొనుగోళ్ల మద్దతు లభించడంలో సెన్సెక్స్ ఏకంగా 400 పాయింట్లు లాభపడింది. మొత్తానికి వరుస నష్టాలతో దిగాలు పడిన ఇన్వెస్టర్లకు ఈ రోజు ఓ రిలీఫ్. చివరకు 131 పాయింట్ల లాభంతో నిఫ్టీ 10735 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 404 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 270 పాయింట్లు లాభపడ్డాయి.

ఇండియాబుల్స్ హోసింగ్, వేదాంతా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ఓఎన్జీసీ స్టాక్స్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. హీరో మోటో, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, హిందుస్తాన్ యునిలివర్ టాప్ ఫైవ్ లూజర్స్‌ జాబితాలో చేరాయి.

Sensex rallies 400 pts to snap 9-day losing run, Nifty tops 10,700

మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ జోరు

మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు కూడా ఈ రోజు లాభాలబాటపట్టాయి. రెండు సూచీలూ ఒక్క శాతానికిపైగానే పెరిగాయి. ఆశ్చర్యకరంగా ఈ రోజు అన్ని రంగాల షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది.
బ్యాంకింగ్, ఐటీ మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్‌ భారీగా లాభపడ్డాయి.

మెటల్ మెరుపులు

మెటల్ రంగ షేర్లు ఈ రోజు మాంచి జోరుమీదున్నాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఈ రోజు అత్యధికంగా లాభపడింది. వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో ముగిసింది. జిందాల్ స్టీల్స్ అధికంగా లాభపడితే.. ఒక్క నాల్కో మాత్రమే వెనక్కి లాగుతోంది. ఈ రోజు ట్రేడింగ్‌లో జిందాల్ శాతం వరకూ పెరిగితే, వేదంతా - టాటా స్టీల్, సెయిల్ నాలుగు శాతం వరకూ పెరిగాయి. నాల్కో మాత్రం 4 శాతం నష్టాలతో ముగిసింది.

ఈ ఏడాదిలో ఇప్పటివరకూ మెటల్ ఇండెక్స్ 12 శాతం వరకూ నష్టపోయింది.

నాస్కామ్‌ అంచనాలు వీక్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐటి రంగ పనితీరు పనితీరు మెరుగ్గానే ఉంటుందని నాస్కామ్ అంచనా వేసింది. కాషియస్ ఆప్టిమిస్టిక్ అంటూ నాస్కామ్ స్టేట్మెంట్ ఇచ్చింది. అధిక శాతం మంది సీఈఓలు 2019 గతేడాది కంటే కాస్త బలహీనంగానే ఉండొచ్చని నాస్కామ్ సర్వేలో భావించారు. అయితే ప్రతీ ఏడాదీ ఇచ్చినట్టు గైడెన్స్ నెంబర్స్ ఇవ్వకుండా కేవలం సీఈఓల సర్వే డిటైల్స్ మాత్రమే ఇచ్చింది.
మిందా ఇండస్ట్రీస్‌ భేష్

ప్రముఖ రీసెర్చ్ సంస్థ మేబ్యాంక్.. మిందా ఇండస్ట్రీస్‌కు రేటింగ్ అప్ గ్రేడ్ చేసింది. గతంలో ఇచ్చిన హోల్డ్ రేటింగ్‌ను BUYకి అప్ గ్రేడ్ చేయడంలో ఈ స్టాక్ పెరిగింది. ట్రేడ్‌లో స్టాక్ 14 శాతం పెరిగి రూ.325 దగ్గర క్లోజైంది. వరుసగా రెండో రోజూ ఈ స్టాక్ వాల్యూమ్స్‌తో సహా పెరిగింది.

అడాగ్ గ్రూప్ షేర్లలో పతనం

అనిల్ ధీరూభాయ్ అంబానీకి ఎరిక్సన్ కేసులో సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టింది. ఎరిక్సన్‌ సంస్థకు బాకీపడిన రూ.440 కోట్లను వెంటనే చెల్లించాలని ఆదేశించింది. నాలుగు వారాలలోగా డబ్బులు
చెల్లించకపోతే మూడు నెలలు జైల్లో పెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది గతంలో రెండు సార్లు హెచ్చరించినప్పటికీ అనిల్ అంబానీ.. బేఖాతరు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.దీంతో అనిల్ అంబానీ గ్రూప్ షేర్లు 5 శాతం వరకూ కోల్పోయాయి. చివర్లో కొద్దిగా కోలుకున్నాయి.

ప్రభుత్వ బ్యాంకులకు ఊరట

ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం మూలధనం రూపంలో ఆర్థిక సాయం అందించబోతోందనే వార్తలు పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్‌కు జోష్ నిచ్చాయి. దీంతో ఇండియన్ బ్యాంక్ 3.5 శాతం లాభపడింది.
ఇదే బాటలో సెంట్రల్ బ్యాంక్, సిండికెట్ బ్యాంక్, జెకె బ్యాంక్, కెనెరా బ్యాంక్ స్టాక్స్ రెండు శాతం వరకూ లాభపడ్డాయి.

English summary

తొమ్మిది రోజుల నష్టాలకు బ్రేక్.. ! సెన్సెక్స్ 400 పాయింట్లు లాభం | Sensex rallies 400 pts to snap 9-day losing run, Nifty tops 10,700

Sensex rallies 400 pts to snap 9-day losing run, Nifty tops 10,700; The markets have continued the same grip until the final, with advantages of encouraging signs from international markets. The Sensex has bagged 400 points for the support of purchases in the last hour.Relief. Finally, with a profit of 131 points, it was close near Nifty 10735. BSE Sensex 404 points, Bank Nifty 270 points profitable.
Story first published: Wednesday, February 20, 2019, 21:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X