For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరుగుతున్న పసిడి ధరలు...పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్న సెంట్రల్ బ్యాంకులు

|

చివరిసారిగా గతేడాది సెప్టెంబరులో తగ్గిన బంగారం ధరలు ఈ ఏడాది ఒక్కసారిగా 11శాతం మేరా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు ఈ పసిడిని పెద్ద మొత్తంలో విపరీతంగా కొనుగోలు చేస్తున్నాయి. 1971లో ఇలా చివరిసారిగా ప్రపంచదేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు కొనుగోలు చేశాయి. 2018 నాటికి సెంట్రల్ బ్యాంకుల ఖజానాలో 651.5 టన్నుల బంగారం ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017 కంటే 74శాతం అధికంగా పసిడి ఆయా బ్యాంకుల ఖజానాలో ఉన్నట్లు ప్రపంచ బంగారు సమాఖ్యా (వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డబ్ల్యూజీసీ) నివేదికలో తెలిపింది.

 అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్న ప్రపంచ దేశాలు

అధిక మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తున్న ప్రపంచ దేశాలు

ఇక అధిక మొత్తంలో బంగారును కొనుగోలు చేసిన దేశాల్లో రష్యా, టర్కీ, కజకిస్తాన్, పోలాండ్ దేశాలు ముందువరసలో ఉన్నట్లు డబ్ల్యూజీసీ నివేదిక వెల్లడించింది. ఇక అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్దంతో ప్రపంచ మార్కెట్లపై ప్రభావం ఎలా పడుతుందనే వాదన మొదలైంది. ఎందుకంటే బంగారంకు ఉన్న విలువతో దేశాల ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుందనే అంచనా ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకుల వద్ద ఎంత బంగారం ఉంటే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అంత బాగుంటుందనే అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు. ఇక అలాంటి దేశాలపై అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ఎలాంటి ప్రభావం చూపబోదని వారు చెబుతున్నారు. అమెరికా డాలరుకు, ఆదేశ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా బంగారం ధరలు ఉంటాయని చెబుతున్నారు.

 ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే బంగారు కొనుగోలు

ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే బంగారు కొనుగోలు

ప్రస్తుతం ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారు కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. భవిష్యత్తులో వాణిజ్యం ఎలాంటి మలుపుతీసుకుంటుందో ఊహించలేమని చెబుతున్న బ్యాంకు యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్తలో భాగంగా అధిక మొత్తంలో బంగారును కొనుగోలు చేసి స్టోర్ చేసుకుంటున్నాయి. అంతేకాదు బ్రెగ్జిట్ కూడా ఎలాంటి మలుపు తీసుకుంటోదో అనే ఆలోచన కూడా ఇందుకు ఒక కారణంగా నిలుస్తోంది. వాణిజ్య యుద్ధాలు చేయిదాటి పోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పడితే డాలర్ విలువ అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంది. దీంతో బంగారం దాచి పెట్టుకుంటే ఎప్పటికైనా ఆర్థిక వ్యవస్థను కాపాడుతుందనే బలమైన నమ్మకం బ్యాంకుల్లో ఏర్పడటంతో యాజమాన్యాలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయని రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ హెడ్ విక్రమ్ ధవన్ చెబుతున్నారు.

డాలరుపై ఆశలు వదులుకున్న ప్రపంచదేశాలు

డాలరుపై ఆశలు వదులుకున్న ప్రపంచదేశాలు

ప్రస్తుతం చాలా దేశాలు డాలరకు దూరంగా వెళుతున్నాయని చెప్పారు క్వాంటమ్ అస్సెట్ మేనేజ్‌మెంట్ కో ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ ఫండ్ మేనేజర్ చిరాగ్ మెహతా. డాలర్లతో ట్రేడింగ్ జరపడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని భావిస్తున్న నేపథ్యలో డాలర్లను ఆయా దేశాలు పక్కకు పెట్టేశాయని ఆయన చెప్పారు. బంగారంను అధిక మొత్తంలో ముందుగానే కొనుగోలు చేసి ఉండి ఉంటే టర్కీలో కానీ, బ్రెజిల్‌లో కానీ రష్యాలో కానీ, భారత్‌లో కానీ స్థానిక కరెన్సీలోనే మంచి లాభాలు వచ్చి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు బంగారంను కొనుగోలు చేయడం నిజంగా బంగారమైన ఆలోచనే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

భారత్‌లో బంగారు విక్రయంతో లాభాలు

భారత్‌లో బంగారు విక్రయంతో లాభాలు

ఉదాహరణకు అర్జెంటీనాలో గతేడాది బంగారం ధరలు స్థానిక కరెన్సీలో రెట్టింపు అయ్యాయి. భారత్‌లో క్రమంగా పడిపోతున్న రూపాయి విలువతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో బంగారు విక్రయించడంతో 7.48 శాతం రిటర్న్స్ వచ్చాయి. ప్రస్తుతం బంగారం ధరలు కాస్త న్యూట్రల్‌గా ఉన్నప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు వస్తే ఆ పసిడే ఆపన్న హస్తంగా నిలుస్తుందంటున్నారు ఆర్థిక విశ్లేషకులు.

English summary

Gold is shining once again as central bankers go on a buying spree

Gold has lately been in the spotlight. And how! Its price has risen 11% from the lows of end-September. Central banks across the globe have been buying larger quantities of the precious metal, a phenomenon not been seen since 1971. They added 651.5 tonnes to their treasure chests in 2018, a 74% increase over the previous year, according to a World Gold Council (WGC) report.
Story first published: Thursday, February 7, 2019, 11:25 [IST]
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more