For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో రూ.399 రీచార్జీతో రూ.2599 విలువైన ప్ర‌యోజ‌నాలు

స‌రికొత్త‌గా రూ.399 రీచార్జీ చేసుకుంటే ఆరింత‌ల ప్ర‌యోజ‌నాన్ని ప్ర‌క‌టించింది. దీంతో ఒక‌సారి రూ.399 రీచార్జీ చేసుకున్న వారికి రూ.2599 మేర న‌గ‌దు ప్ర‌యోజ‌నాలు అందుతాయి. ఈ వార్త అన్ని చోట్ల చ‌దివే ఉంటారు

|

టెలికాం రంగాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు వేగంగా, దూకుడుగా జియో ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అందులో భాగంగానే జియో ప్రైమ్ స‌భ్య‌త్వం ఆరంభం నుంచి క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోకుండా ఏదో ర‌క‌మైన ఆఫ‌ర్‌ను వ‌దులుతూ ప్ర‌త్య‌ర్థి టెలికాం కంపెనీల‌కు గుబులు పుట్టిస్తోంది. ఇప్పుడు స‌రికొత్త‌గా రూ.399 రీచార్జీ చేసుకుంటే ఆరింత‌ల ప్ర‌యోజ‌నాన్ని ప్ర‌క‌టించింది. దీంతో ఒక‌సారి రూ.399 రీచార్జీ చేసుకున్న వారికి రూ.2599 మేర న‌గ‌దు ప్ర‌యోజ‌నాలు అందుతాయి. ఈ వార్త అన్ని చోట్ల చ‌దివే ఉంటారు. కానీ ఇక్క‌డ ఆ రీచార్జీ ఎలా చేసుకోవాలి, దాని ప్ర‌యోజ‌నాలు ఎలా పొందాలో తెలుసుకుందాం.

1. జియో స‌రికొత్త ఆరింత‌ల ప్ర‌యోజ‌నాల ఆఫ‌ర్‌

1. జియో స‌రికొత్త ఆరింత‌ల ప్ర‌యోజ‌నాల ఆఫ‌ర్‌

ఈ స‌రికొత్త ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ నవంబ‌రు 10 నుంచి న‌వంబ‌రు 25 మ‌ధ్య అందుబాటులో ఉంటుంది.

ఇది కేవ‌లం జియో ప్రైమ్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే

జియో నేరుగా న‌గ‌దు రూపంలో క్యాష్ బ్యాక్ ఇవ్వ‌కుండా మ‌ళ్లీ వోచ‌ర్ల‌ను వాడుకునేలా చూస్తోంది.

2. జియో రిటైల‌ర్ల వ‌ద్ద‌

2. జియో రిటైల‌ర్ల వ‌ద్ద‌

జియో రిటైల‌ర్ దుకాణంలో రూ.399 రీచార్జీ చేయించుకోవాలి. దీంతో రూ.400 విలువ చేసే క్యాష్ బ్యాక్ వోచ‌ర్లు వ‌స్తాయి.

లేదా కొంతమందికి రూ. 50 విలువ చేసే నాలుగు వోచ‌ర్లు సైతం ఇస్తారు.

ఈ వోచ‌ర్ల‌ను న‌వంబ‌రు 15త‌ర్వాత‌, కేవ‌లం మైజియో యాప్ ద్వారా మాత్ర‌మే వాడుకోవాలి.

3. త‌క్ష‌ణ క్యాష్ బ్యాక్

3. త‌క్ష‌ణ క్యాష్ బ్యాక్

రూ.300 వ‌ర‌కూ త‌క్ష‌ణ క్యాష్ బ్యాక్ పొందే స‌దుపాయం సైతం ఉంది.

ప్ర‌యివేటు వాలెట్ల‌యిన అమెజాన్ పే, యాక్సిస్ పే, ఫ్రీచార్జీ, మొబిక్విక్, పేటీఎమ్, ఫోన్‌పే వంటి వాటిలో చేసుకునే రీచార్జీల‌కు అప్పుడే రూ.300 క్యాష్ బ్యాక్ వ‌స్తుంది.

4. మొబిక్విక్ విషయంలో

4. మొబిక్విక్ విషయంలో

రెగ్యుల‌ర్ మొబిక్విక్ యూజ‌ర్కు రూ.149 క్యాష్ బ్యాక్ వ‌స్తుంది. అదే కొత్త యూజ‌ర్ విష‌యంలో అయితే రూ.300 క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది.

అమెజాన్ పే ద్వారా కొత్త యూజ‌ర్ల‌కు మొద‌టి రీచార్జీకి రూ.99 క్యాష్ బ్యాక్ వ‌స్తుంది.

ఇదివ‌ర‌కే అమెజాన్ పే వాడుతున్న వారికైతే రూ.20 క్యాష్ బ్యాక్ వ‌స్తుంది.

5. రిల‌య‌న్స్ ఈ-కామర్స్ పోర్ట‌ళ్ల‌లో కొనుగోళ్ల‌కు వోచ‌ర్లు

5. రిల‌య‌న్స్ ఈ-కామర్స్ పోర్ట‌ళ్ల‌లో కొనుగోళ్ల‌కు వోచ‌ర్లు

ఈ పై రీచార్జీల ద్వారా క్యాష్ బ్యాక్ వచ్చిన న‌గ‌దు కాకుండా అద‌నంగా వోచ‌ర్లు వ‌స్తాయి.

ఇంకా ఏజియో, యాత్రా.కామ్, రిల‌య‌న్స్ ట్రెండ్స్.కామ్ వెబ్సైట్ల‌లో కొనుగోళ్లు జ‌రిపేందుకు వోచ‌ర్ల‌ను వాడుకోవ‌చ్చు.

కాబ‌ట్టి జియో వాడ‌కందార్లు రిల‌య‌న్స్ సంబంధిత ఆన్‌లైన్ పోర్ట‌ళ్లు ఉప‌యోగించి మ‌రింత డ‌బ్బు పెట్టి ఏదైనా కొని వీటిని వాడుకోవల‌సి ఉంటుంది.

దీనికి సిద్ద‌మైతే రిల‌య‌న్స్ జియో రూ.399 రీచార్జీ చేయించుకోండి మ‌రి...

Trending Articles in Telugu Goodreturns

పీఎఫ్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన 10 విష‌యాలు పీఎఫ్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన 10 విష‌యాలు

టాప్ 10 టెలికాం కంపెనీలుటాప్ 10 టెలికాం కంపెనీలు

పాన్‌కార్డు-6 ముఖ్య విష‌యాలుపాన్‌కార్డు-6 ముఖ్య విష‌యాలు

6. ఏజియో వోచ‌ర్లు

6. ఏజియో వోచ‌ర్లు

రిల‌య‌న్స్ గ్రూప్కు సంబంధించిన ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ ఏజియో వెబ్సైట్ ద్వారా యూజ‌ర్లు క‌నీసం రూ.1500 కొనుగోళ్లు జరిపిన‌ట్లైతే రూ.399 ఆఫ‌ర్ వ‌స్తుంది.

అదే యాత్రా.కామ్ ద్వారా చేసే దేశీయ ప్ర‌యాణ టిక్కెట్ల బుకింగ్‌కు రూ.1000 ఆఫ‌ర్ వ‌స్తుంది.

ఇక రిల‌యన్స్ ట్రెండ్స్.కామ్ నందు చేసే రూ.1999 కొనుగోలుపై రూ.500 ఆఫ‌ర్కు అవ‌కాశ‌ముంది.

Read more about: jio reliance jio
English summary

జియో రూ.399 రీచార్జీతో రూ.2599 విలువైన ప్ర‌యోజ‌నాలు | Reliance jio triple dhamaka for recharge plans of 399 and above

Reliance jio triple dhamaka With Rs.399 recharge you will get rs2599 benefits
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X