For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క‌ల్యాణ్ జువెల‌ర్స్‌: చిన్న ప‌ట్ట‌ణం నుంచి దేశ‌వ్యాప్త విస్త‌ర‌ణ‌

క‌ల్యాణ్ గ్రూప్ త్రిస్సూర్‌లో 1993లో చాలా చిన్నగా ప్రారంభ‌మైంది. నేడు దేశవ్యాప్తంగా 100కు పైగా షోరూంల‌ను క‌లిగి ఉంది. ఈ నేప‌థ్యంలో దీని గురించి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం.

|

బంగారం వ్యాపారంలో క‌ల్యాణ్ జువెల‌ర్స్ చాలా త‌క్కువ కాలంలోనే కోట్ల మంది హృద‌యాల‌ను గెలుచుకుంది. బంగారం రిటైల్ వ్యాపారంలో త‌న‌దైన ముద్ర వేసిన క‌ల్యాణ్ గ్రూప్ త్రిస్సూర్‌లో 1993లో చాలా చిన్నగా ప్రారంభ‌మైంది. నేడు దేశవ్యాప్తంగా 100కు పైగా షోరూంల‌ను క‌లిగి ఉంది. ఈ నేప‌థ్యంలో దీని గురించి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం.

 1. క‌ల్యాణ్ జువెల‌ర్స్‌ ఐపీవో

1. క‌ల్యాణ్ జువెల‌ర్స్‌ ఐపీవో

ఇటీవ‌లి ఎక‌న‌మిక్ టైమ్స్ ఇంట‌ర్వ్యూలో కేర‌ళ‌కు చెందిన క‌ల్యాణ్ గ్రూప్ ఐపీవో ద్వారా నిధుల సేక‌ర‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు గ్రూప్ అధినేత చెప్పారు. 1993లో క‌ల్యాన్ రామ‌న్ ఈ సంస్థ‌ను స్థాపించారు. ప్రస్తుతం అమెరికాకు చెందిన వార్‌బ‌ర్గ్ పింక‌స్ లెక్క గ‌ట్టిన దాని ప్ర‌కారం క‌ల్యాణ్ జువెల‌ర్స్ విలువ దాదాపు 2 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంటుంద‌ని తెలుస్తోంది.

2. ఆట నియ‌మాల‌తో ప్రారంభం

2. ఆట నియ‌మాల‌తో ప్రారంభం

బంగారం కొనుగోలులో అంద‌రూ ఎదుర్కొనే స‌మ‌స్య స్వ‌చ్చ‌తను తెలుసుకోవ‌డం. స‌రిగ్గా టీఎస్ క‌ల్యాణ్ రామ‌న్ అక్క‌డే ప‌ట్టుకుని విజ‌యం సాధించారు. 1993లో మొద‌టిసారి కేర‌ళ‌లో బంగారం స్వ‌చ్చ‌త‌ను ఎలా ప‌రీక్షించాలో వినియోగ‌దారుల‌కు నేర్పారు. అంతే కాకుండా బంగారు, ఆభ‌ర‌ణాల‌కు మొద‌టిసారి ప్రైస్ ట్యాగ్ ఇస్తూ అక్క‌డే ధ‌ర‌లు ఉండేలా చూసుకున్నారు. మొద‌ట్లో పోటీదారులంతా వ్యాపార‌న్నంతా చెడ‌గొడుతున్నార‌ని ఆయ‌న్ను విమ‌ర్శించారు.

3. చిన్న‌ప్ప‌టి నుంచే వ్యాపారంలో...

3. చిన్న‌ప్ప‌టి నుంచే వ్యాపారంలో...

క‌ల్యాణ్ రామ‌న్‌కు 12 ఏళ్ల వ‌య‌సు నుంచే వ్యాపారం గురించి నేర్చుకోవ‌డం మొద‌లుపెట్టాడు. త్రిస్సూర్‌లో తండ్రి పార్రంభించిన వ‌స్త్ర దుకాణంలో చిన్న చిన్న ప‌నులు చేస్తుండేవాడు. కుటుంబానికి చెందిన వ‌స్త్ర వ్యాపారం త‌న చేతుల్లోకి తీసుకుముందు శ్రీ కేర‌ళ వ‌ర్మ కాలేజీలో కామ‌ర్స్ విద్య‌ను అభ్య‌సించాడు. త‌ర్వాత నెమ్మ‌దిగా రూ.75 ల‌క్ష‌ల‌తో బంగారు వ్యాపారం ప్రారంభించాడు.

4. అదృష్టం క‌లిసొచ్చింది

4. అదృష్టం క‌లిసొచ్చింది

బంగారం వ్యాపారంలో అడుగిడిన‌ప్ప‌టి నుంచి ఎదురు తిరిగి చూసుకోలేదు. త‌ర్వాత స్థిరాస్తి కంపెనీ, క‌ల్యాణ్ డెవ‌ల‌ప‌ర్స్‌, త్రిస్సూర్లో అపార్ట్‌మెంట్, విల్లాల‌ను నిర్మించ‌డం వంటి వాటిని చేపట్టారు. దేశ‌వ్యాప్త విస్త‌ర‌ణ‌కు క‌ల్యాణ్ జువెల‌ర్స్ 30 బిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చుపెట్టింది. ప్ర‌స్తుతం భార‌త్‌, పశ్చిమాసియా వ్యాప్తంగా మొత్తం 105 షోరూంలు ఈ సంస్థ‌కు ఉన్నాయి.

5. మొద‌టి ప్రైవేట్ జెట్

5. మొద‌టి ప్రైవేట్ జెట్

కేర‌ళ‌లో ప్రైవేట్ జెట్ క‌లిగిన మొట్ట‌మొద‌టి బిలియ‌నీర్ క‌ల్యాన్ రామ‌న్‌. ఇంకా పామ్ చెట్లు పెంచిన బీచ్‌లు, పండ్ల తోట‌లు క‌లిగి ఉన్నాడు. 300 మిలియ‌న్ రూపాయ‌ల‌కు ఏడు సీట్లు క‌లిగిన ఫీనోమ్ 100 వాహ‌నాన్ని కొన్నాడు. దేశంలో ఇత‌ర న‌గ‌రాల్లో ఉన్న త‌న దుకాణాల‌ను చూసి వ‌చ్చేందుకు ఎక్కువ‌గా దీన్ని ఉప‌యోగిస్తారు.

Read more about: kalyan jewellers gold
English summary

క‌ల్యాణ్ జువెల‌ర్స్‌: చిన్న ప‌ట్ట‌ణం నుంచి దేశ‌వ్యాప్త విస్త‌ర‌ణ‌ | kalyan jewellers from a small town business to country wide expansion

The group derives its origins from textile retailing and wholesaling and has experience of over 100 years in the trade. Kalyan branched out into the field of jewellery retailing in the year 1993 by opening its first store in Thrissur.
Story first published: Monday, August 28, 2017, 14:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X