అభివృద్ది చెందుతున్న దేశాలు సైతం తమ సత్తా చూపే కాలం రానుంది. ఆర్థిక ముఖచిత్రం త్వరలో మారిపోనున్నట్లు పలు అధ్యయనాలు చాటిచెబుతుండగా తాజాగా మరో సంస్థ అలాంటి నివేదికనే బయటపెట్టింది. ఆ నివేద
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటే ముందుగా గుర్తొచ్చేది అభివృద్ది చెందిన అమెరికా లాంటి దేశాలే. వచ్చే రెండు మూడు దశాబ్దాల్లో ఈ పరిస్థితి పూర్తిగా తిరగబడనుంది. అభివృద్ది చెందుతున్న దేశాలు సైతం తమ సత్తా చూపే కాలం రానుంది. ఆర్థిక ముఖచిత్రం త్వరలో మారిపోనున్నట్లు పలు అధ్యయనాలు చాటిచెబుతుండగా తాజాగా మరో సంస్థ అలాంటి నివేదికనే బయటపెట్టింది. ఆ నివేదికలో ఏముందో, భారత్ ఏ విధంగా ఎదగనుందో వివరంగా తెలుసుకుందాం.

ఆ 7 దేశాల వృద్ది 3.5%గా ఉండగలదు
రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రం మారిపోనుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలే ఇందుకు కారణం. కొనుగోలు శక్తి సమతుల్యత (పీపీపీ)విషయంలో 2040 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థను భారత్ అధిగమిస్తుందని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. పీడబ్ల్యూసీ(ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్) అంచనా ప్రకారం వచ్చే 34ఏళ్లలో ఈ7 దేశాలైన బ్రెజిల్, చైనా, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, రష్యా, టర్కీల వార్షిక వృద్ధి 3.5శాతంగా ఉంటుందని అదే విధంగా జీ7 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూఎస్‌ల వృద్ధి 1.6శాతానికే పరిమితవుతుందని అంచనా వేసింది.

అమెరికాను దాటేసిన చైనా, మనం కూడా అధిగమిస్తామా?
'పీపీపీ నిబంధనల ప్రకారం ఇప్పటికే అమెరికాను చైనా అధిగమించింది. ప్రస్తుతం భారత్ మూడోస్థానంలో ఉంది. 2040నాటికి అమెరికాను భారత్ దాటేస్తుంది' అని పీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఇదే సమయంలో వియత్నాం, భారత్, బంగ్లాదేశ్‌లు అత్యంత వేగవంతమైన ఆర్థికవృద్ధి కలిగిన దేశాలుగా ఉంటాయని ప్రైస్‌వాటర్ కూపర్స్(పీడబ్ల్యూసీ) భావిస్తోంది.

అమెరికాను దాటేసిన చైనా, మనం కూడా అధిగమిస్తామా?
'పీపీపీ నిబంధనల ప్రకారం ఇప్పటికే అమెరికాను చైనా అధిగమించింది. ప్రస్తుతం భారత్ మూడోస్థానంలో ఉంది. 2040నాటికి అమెరికాను భారత్ దాటేస్తుంది' అని పీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఇదే సమయంలో వియత్నాం, భారత్, బంగ్లాదేశ్‌లు అత్యంత వేగవంతమైన ఆర్థికవృద్ధి కలిగిన దేశాలుగా ఉంటాయని ప్రైస్‌వాటర్ కూపర్స్(పీడబ్ల్యూసీ) భావిస్తోంది.

అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ముందుకు...
'ఆసియా, ఇంకా ఎక్కడైనా సరే అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలను దాటి అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలు ముందుకు వెళ్లనున్నాయి. 2050నాటికి ప్రపంచ జీడీపీ(స్థూల దేశీయోత్పత్తి)లో ఈ7 దేశాల వాటా 50శాతం ఉంటే.. జీ7 దేశాల వాటా 20శాతానికి పడిపోతుంది' అని పీడబ్ల్యూసీ ముఖ్య ఆర్థికవేత్త, నివేదిక సహ రూపకర్త జాన్ హాక్స్‌వర్త్ తెలిపారు. నివేదిక ప్రకారం భారత్‌కు ఆశావహ పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంస్కరణలను కొనసాగిస్తూ, ఎప్పటికప్పుడు వ్యవస్థాపర మార్పులను చేపడితేనే దేశీయ ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

భారత్ మెగాట్రెండ్
పీడబ్ల్యూసీ ఇండియా సలహాదారు దీపాంకర్ శాన్వల్క మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రపంచ ఆర్థికశక్తిగా మారడంతో భారత్ మెగాట్రెండ్ కాగలదని అన్నారు. భారత కంపెనీల సీఈవోల ఆత్మవిశ్వాసం అవకాశాలూ, సరికొత్త వ్యాపారాల కారణంగా భారత్ ట్రెండింగ్ కావడానికి ప్రధాన సాక్ష్యాలని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంపద పరంగా 6వ స్థానంలో ఉండటంతో పాటు, జీఎస్టీ,నోట్ల రద్దు లాంటి నిర్ణయాలు దీర్ఘకాలంలో మనకు లాభించే అంశాలు.

వ్యవస్థాగత సంస్కరణలు అవసరం
స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ప్రభుత్వం వ్యవస్థాగత సంస్కరణలు మరిన్ని చేపట్టాల్సి ఉందని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధానకర్తలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, ఒకవేళ వారు సుస్థిరమైన సుదీర్ఘ ఆర్థికవృద్ధిని సాధిస్తే దానినే తమ నివేదిక చెబుతోందని హాక్స్ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో భారత వృద్ది రేటు నిలకడగా ఉండగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. హెచ్-1బీ బిల్లేంటో... ఐటీ కంపెనీల గుబులేంటో...

సమ్మిళిత వృద్ది సాగాల్సిందే...
ఎన్ని నివేదికలు వెల్లడించినా దేశ జీడీపీ, స్థూల దేశీయోత్పత్తి అంటూ ఏవో గణాంకాల ఆధారంగానే లెక్కలు ఉంటాయి. దేశంలో పేద-ధనిక తారతమ్యం అంతకంతకూ పెరుగుతోంది. అభివృద్ది చెందుతున్న 79 దేశాలను పరిశీలించినప్పుడు సమ్మిళిత అభివృద్ది సూచీ(ఐడీఐ)లో భారత్ 60 వ స్థానంలో ఉంది. ఎందుకంటే పేదవాళ్ల జీవన స్థితిగతుల్లో పెద్దగా మార్పు లేదు. అంతే కాకుండా కార్పొరేట్ల వద్ద సంపద పోగుపడుతూనే ఉంది. సంపద సృష్టి ద్వారా అట్టడుగు వర్గాల వారికి లబ్ది చేకూరడం లేదు. ఈ నేపథ్యంలో సమ్మిళిత అభివృద్ది(ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్) దిశగా భారత్ కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications