For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లాభాలతో మార్కెట్లు: విదేశీ బ్యాంకుగా యాక్సిస్

|

Sensex
ముంబై/న్యూఢిల్లీ : శనివారం వరకు నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల బాట పట్టాయి. సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 301 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 80 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. అయితే గత వారంలో నాలుగు రోజులు మాత్రమే స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ జరిగింది. ఈ ట్రేడింగ్‌లో టాప్ 10 బ్లూచిప్ కంపెనీల్లో 9 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 47,562 కోట్ల రూపాయలు తగ్గిపోయింది.

టిసిఎస్, సిఐఎల్ అధికంగా మార్కెట్ క్యాప్‌ను కోల్పోయాయి. ఆర్ఐఎల్, ఐటిసి, ఒఎన్‌జిసి, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యుఎల్ మార్కెట్ క్యాప్‌ను అధికంగా కోల్పోయిన కంపెనీల్లో ఉన్నాయి. టిసిఎస్ మార్కెట్ క్యాప్ 13,133 కోట్ల రూపాయలు తగ్గి 3,96,789 కోట్ల రూపాయలకు చేరింది. గత వారంతో కలిపి వరుసగా రెండో వారంలో కూడా సెన్సెక్స్ నష్టాలనే మూటగట్టుకుంది. దాని ఫలితంగా బ్లూచిప్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఆవిరైపోయింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఫలితాల సందడి ముగుస్తున్నందున మార్కెట్ వర్గాల దృష్టి అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి కదలిక, విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి వైపునకు మళ్లుతోంది. ఈ మూడే మార్కెట్ కదలికలను ప్రభావితం చేస్తాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దేశీయ సూచీలు కదలాడొచ్చు. విదేశీ సంస్థాగత మదుపర్ల(ఎఫ్ఐఐ) నిధుల ప్రవాహం, డాలర్‌తో రూపాయి మారకపు విలువ తదితర అంశాలపై కూడా మార్కెట్‌ను ప్రభావితం చేయొచ్చు.

విదేశీ బ్యాంకుగా అవతరించనున్న యాక్సిస్

దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్ విదేశీ యాజమాన్యంలోని బ్యాంకుగా మారనుంది. బ్యాంకులో విదేశీ పెట్టుబడుల పరిమితిని ప్రస్తుతం ఉన్న 49 శాతం నుంచి 62 శాతానికి పెంచాలని ఆ బ్యాంకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ప్రతిపాదనను విదేశీ పెట్టుబడుల ప్రగతి బోర్డు (ఎఫ్‌ఐపిబి) కూడా ఆమోదించింది. అయితే 6,200 కోట్ల రూపాయల మూలధన నిధులు అందే ఈ ప్రతిపాదనకు ఇక ఆర్థిక వ్యవహారాల మంత్రి వర్గ సంఘం (సిసిఈఏ) ఆమోదం తెలపడమే మిగిలి ఉంది.

English summary

లాభాలతో మార్కెట్లు: విదేశీ బ్యాంకుగా యాక్సిస్ | Sensex surges 301 points on Asian cues; banks rise

The BSE benchmark Sensex rose over 301 points in early trade on Monday on sustained buying by funds amid a firm trend in other Asian bourses.
Story first published: Monday, November 18, 2013, 11:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X