అమెరికా అభివృద్ధిలో భారతీయ కంపెనీల పాత్ర ఎంతో ఉందని సీఐఐ తాజా సర్వేలో వెల్లడింది. పెట్టుబడులు, పెద్దమొత్తంలో ఉపాధి కల్పన రూపంలో భారతీయ సంస్థలు అమెరికా ఎకానమీ వృద్ధికి గణనీయంగా తోడ్పడుతున్నాయి. భారత మూలాలు కలిగిన 155 కంపెనీలు అమెరికాలో 22 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.68 లక్షల కోట్లు) పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయడంతో పాటు 1.25 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాయి. 'ఇండియన్ రూట్స్, అమెరికన్ సాయిల్ 2020' పేరుతో భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఓ సర్వే నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం..

ఉద్యోగాల్లో టాప్ 5 నగరాలు ఇవే
అమెరికాలోని 50 రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రాలవారీగా భారతీయ కంపెనీల పెట్టుబడులు, కల్పించిన ఉద్యోగాల వివరాలను ఇందులో వెల్లడించింది. ఇండియన్ కంపెనీలు ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించిన జాబితాలో టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, న్యూయార్క్, ఫ్లోరిడా టాప్ 5లో ఉన్నాయి. ఉద్యోగాల వారీగా... టెక్సాస్ (17,578 ఉద్యోగాలు), కాలిఫోర్నియా(8,271 ఉద్యోగాలు), న్యూజెర్సీ (8,057 ఉద్యోగాలు), న్యూయార్క్ (6,175 ఉద్యోగాలు), ఫ్లోరిడా (5,454 ఉద్యోగాలు) ఉన్నాయి.

పెట్టుబడుల్లో టాప్ 5 నగరాలు ఇవే
పెట్టుబడులపరంగా కూడా టెక్సాస్, న్యూజెర్సీ, న్యూయార్క్, న్యూయార్క్, ఫ్లోరిడా, మసాచుసెట్స్ ఉన్నాయి. భారతీయ కంపెనీలు ఎక్కువ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన ఈ ఐదు నగరాల్లో పెట్టుబడులు ఇలా... టెక్సాస్ (USD9.5 బిలియన్లు), న్యూజెర్సీ (USD2.4 బిలియన్లు), న్యూయార్క్ (USD1.8 బిలియన్లు), ఫ్లోరిడా (USD915 మిలియన్లు), మసాచుసెట్స్ (USD873 మిలియన్లు).

మరిన్ని పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాలు
'155 ఇండియన్ కంపెనీలు 50 అమెరికా రాష్ట్రాల్లో దాదాపు 1.25,000 మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఈ కంపెనీల పెట్టుబడులు 22 బిలియన్ డాలర్లు' అని సీఐఐ నివేదిక తెలిపింది. 20 అమెరికా రాష్ట్రాల్ల ఇండియన్ కంపెనీలు ఒక్కో రాష్ట్రంలో 100 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. మరో 77 శాతం కంపెనీలు పెట్టుబడులు మరిన్ని పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాయి. 87 శాతం కంపెనీలు రానున్న ఐదేళ్లలో స్థానికంగా మరింతమంది ఉద్యోగులను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

సామాజిక సేవ కోసం కూడా...
కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (CSR), రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎక్స్పెండిచర్ కోసం కూడా ఈ కంపెనీలు వరుసగా 175 మిలియన్ డాలర్లు, 900 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాయి. ఔషధ, లైఫ్ సైన్సెస్, టెలీ కమ్యూనికేషన్స్, ఏరో స్పేస్, రక్షణ, ఆర్థిక సేవలు, తయారీ, పర్యాటక, ఆతిథ్య, డిజైన్, ఇంజినీరింగ్, ఆటోమోటివ్, ఆహార, వ్యవసాయ, ఇంధనం, గనులు, మెటీరియల్స్ రంగాలకు చెందిన సంస్థలు ఈ సర్వేలో అభిప్రాయాలు చెప్పాయి.

పెట్టుబడుల కేంద్రంగా అమెరికా
పలు ఇండియన్ కంపెనీలకు అమెరికా పెట్టుబడి కేంద్రంగా కనిపిస్తోందని సీఐఐ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. భారతీయ కంపెనీలకు మరింత అనువైన వాతావరణం, అనుకూల విధానాలు యూఎస్ గవర్నమెంట్ కల్పించాల్సి ఉందని, కరోనాతో దెబ్బతిన్న అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఇప్పుడు ముఖ్యమన్నారు. భారత కంపెనీలు ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక పునరుద్ధరణకు ఉపయోగపడతాయన్నారు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications