కొత్త పెట్టుబడులపై కార్పోరేట్ ట్యాక్స్ రేట్‌కు సంబంధించి ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై ప్రకటన చేశారు. తయారీ రంగంలో కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలకు 15% కార్పోరేట్ పన్ను అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. దీనికి సంబంధించిన గడువు తేదీని పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి తెలిపారు.

పెట్టుబడులకు ఊతమిచ్చేలా కీలక నిర్ణయం
దేశ ఆర్థిక వృద్ధి కనిష్టాలకు పడిపోవడంతో పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ పన్నును భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కంపెనీలకు కార్పోరేట్ పన్నును 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించింది. అలాగే 2019 అక్టోబర్ 1వ తేదీ నుండి 2023 మార్చి 31వ తేదీ మధ్య తయారీ రంగంలో ఏర్పాటయ్యే కంపెనీలకు కార్పోరేట్ ట్యాక్స్‌ను 25 శాతం నుండి 15 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు గత సెప్టెంబర్‌లో కార్పోరేట్ పన్నును 10 శాతం తగ్గించింది.

28 ఏళ్లలో తొలిసారి.. గడువు పెంపు పరిశీలిస్తాం
కార్పోరేట్ పన్నును ఇంత భారీగా తగ్గించడం గత 28 ఏళ్లలో ఇదే తొలిసారి. కొత్త పెట్టుబడులపై పరిశ్రమ 15 శాతం కార్పోరేట్ పన్ను ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నామని, మేం ఏం చేయగలమన్నది చూస్తామని, అందుకే మార్చి 31, 2023 గడువు తేదీని పొడిగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు సోమవారం జరిగిన ఫిక్కీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎంఎస్ఎంఈలు మాత్రమే కాదు..
మన వ్యాపార సంస్థలకు సహకారం అందించేందుకు, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ఉద్దేశ్యంతో అన్ని రకాల చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. కరోనా ఎమర్జెన్సీ లోన్ సౌలభ్యాన్ని ఎంఎస్ఎంఈలు మాత్రమే కాకుండా అన్ని కంపెనీలు వినియోగించుకోవచ్చునని చెప్పారు. వ్యవస్థలో లిక్విడిటీ సమస్య అందుబాటులో ఉందని, ఇందుకు సంబంధించి సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. బకాయిలు పెండింగ్‌లో ఉంటే తీర్చేయాలని అన్ని ప్రభుత్వ విభాగాలకు సూచించామన్నారు. జీఎస్టీ తగ్గింపు నిర్ణయం కౌన్సిల్‌దే అని చెప్పారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

ఇకపై మీ వడ్డీపై TDS కోత! కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఇవే!

New rules: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్! మీ శాలరీ, టాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు!

Form 16: ఫామ్-16 స్థానంలో ఫామ్-130.. మీ శాలరీ, టాక్స్ వివరాల్లో రాబోతున్న పెద్ద మార్పులివే!

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications