కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.3 లక్షల కోట్ల ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం(ECLGS) కింద 42 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (MSME) కంపెనీలకు బ్యాంకులు రూ.1.63 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు ఆదివారం ఆర్థిక శాఖ తెలిపింది. ఈ రంగానికి ఉద్దేశించిన రూ.3 లక్షల కోట్ల రుణ పథకం కింద వీటిని అందించినట్లు తెలిపింది. సెప్టెంబర్ 10వ తేదీ నాటికి మంజూరు చేసిన రుణాల్లో రూ.1.18 లక్షల కోట్లు 25 లక్షల కంపెనీలకు జారీ అయినట్లు వెల్లడించింది. కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకంలో భాగంగా రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో ఎంఎస్ఎంఈలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది.

లక్షల కోట్ల రుణాలు
సెప్టెంబర్ 10వ తేదీ నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులు(PSB), 23 ప్రయివేటు రంగ బ్యాంకులు అక్షరాల 42,01,576 కంపెనీలకు రూ.1,63,226.49 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. ఇందులో 25,01,999 కంపెనీలకు రూ.1,18,138.64 కోట్లు జారీ అయ్యాయి. ఆర్థికమంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఇతర పథకాల గురించి వెల్లడిస్తూ, ఎంఎస్ఎంఈలు, వ్యక్తిగత స్కీంలకు సంబంధించి కొత్తగా రుణాలు ఇచ్చేందుకు NBFCs, HFCs, MFIsలకు బ్యాంకులు అండగా ఉంటున్నట్లు తెలిపింది. రుణదాతలు ప్రస్తుతం అదనంగా రూ.4,367 కోట్లకు ఆమోదంపై చర్చల్లో ఉన్నట్లు తెలిపింది.

ఆదాయపు పన్ను రీఫండ్స్
ఆదాయపు పన్ను రీఫండ్స్ గురించి ఆర్థిక శాఖ స్పందిస్తూ... ఏప్రిల్ 1, 2020 - సెప్టెంబర్ 8, 2020 మధ్య 27.55 ట్యాక్స్ పేయర్స్‌కు రూ.1,01,308 కోట్లు జారీ చేసినట్లు తెలిపింది. ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్స్ 25,83,507 ట్యాక్స్ పేయర్స్‌కు రూ.30,768 కోట్లు, రూ.70,540 కోట్ల కార్పోరేట్ ట్యాక్స్‌ను 1,71,155 కేసుల్లో అందించినట్లు తెలిపింది. రూ.50 కోట్ల వరకు ఉన్న అన్ని కార్పోరేట్ రీఫండ్స్‌ను అందించినట్లు తెలిపింది. మరిన్ని ఇతర రీఫండ్స్ ప్రాసెస్‌లో ఉన్నట్లు తెలిపింది.

రూ.10,590 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం
ఒత్తిడిలో కూరుకుపోయిన NBFCs, HFCs, MFIsలకు రూ.30,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ పథకానికి సంబంధించి రూ.10,590 కోట్లతో కూడిన 37 ప్రతిపాదనలు ఆమోదించినట్లు తెలిపింది. నాబార్డ్ పథకం ద్వారా రైతులకు రూ.30,000 కోట్ల అదనపు అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ ఫండింగ్ కింద ఆగస్ట్ 28వ తేదీ నాటికి రూ.25,000 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపింది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications