Sensex @50,000: కాంగ్రెస్ గెలుపుతో ఢమాల్! ఇదీ సెన్సెక్స్ చరిత్ర!!
ముంబై: కరోనా వైరస్ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరం ఆరంభంలో దారుణ పతనాన్ని చూసిన మార్కెట్, అన్-లాక్ తర్వాత కార్యకలాపాలు పుంజుకోవడంతో సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ఇటీవలి కాలంలో ఎప్పటికప్పుడు సెన్సెక్స్ కొత్త రికార్డులు సాధిస్తోంది. మార్కెట్ జంప్‌కు అంతులేకుండా పోయిందని, కరెక్షన్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజాగా సెన్సెక్స్ నేడు (గురువారం, 21) 50,000 మార్కును క్రాస్ చేసింది. అయితే చివరలో అమ్మకాల ఒత్తిడి కారణంగా దానిని నిలబెట్టుకోలేకపోయింది. బడ్జెట్‌కు ముందు సెన్సెక్స్ వేగంగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో స్టాక్స్ గురించి...
భారీగా ఎగిసి, అంతలోనే పతనం: 50,000 పాయింట్లను నిలుపుకోని సెన్సెక్స్

కాంగ్రెస్ గెలుపుతో మార్కెట్ డమాల్
- 1978-79లో బేస్ ప్రైస్ 100 వద్ద సూచీ ప్రారంభమైంది. ఈ పదాన్ని స్టాక్ మార్కెట్ అనలిస్ట్ దీపక్ మోహానీ రూపొందించారు.
- మార్కెట్ క్యాపిటలైజేషన్ మెథడాలజీ ఆధారంగా సెన్సెక్స్ లెక్కిస్తారు.
- 2003 సెప్టెంబర్ నుండి ఫ్రీ-ఫ్లోట్ క్యాపిటలైజేషన్ మెథడ్ ఆధారంగా లెక్కిస్తున్నారు.
- అంతకుముందు, భారత మొదటి స్టాక్ ఎక్స్చేంజీగా 1956లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) గుర్తించబడింది.
- 1977లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఐపీవోకు వచ్చింది. అప్పటి వరకు భారీగా లాభాలు ఆర్జించిన వాటిలో రిలయన్స్ ముందు ఉంది.
- 1992 ఏప్రిల్ నెలలో హర్షద్ మెహతా స్కాం కారణంగా బీఎస్ఈ 12.77 శాతం పతనమైంది.
- 1993లో ఇన్ఫోసిస్ మార్కెట్లోకి అడుగిడింది.
- 1994లో ఎన్ఎస్ఈ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి.
- 1995లో బీఎస్ఈ బోల్డ్ (ఆన్ లైన్ ట్రేడింగ్)ను ప్రారంభించింది.
- లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో 2004 మే 17న సెన్సెక్స్ 15.52 శాతం పడిపోయింది.

బ్లాక్ మండే
- జనవరి 21, 2008లో బీఎస్ఈ 1408 పాయింట్లు పడిపోయి 17,605 పాయింట్ల వద్ద నిలిచింది. దానిని బ్లాక్ మండేగా అభివర్ణించారు.
- 2016 నవంబర్ 8న నోట్ల రద్దును ప్రకటించడంతో నవంబర్ 9న సెన్సెక్స్ 1689 పాయింట్లు పడిపోయింది.
- కరోనా నేపథ్యంలో ఫిబ్రవరి 28, 2020న సెన్సెక్స్ 1448 పాయింట్లు పతనమైంది.
- మార్చి 23, 2020న సెన్సెక్స్ ఏకంగా 3935 పాయింట్లు లేదా 13.15 శాతం పడిపోయింది.
- జనవరి 21, 2021న సెన్సెక్స్ 50000 మార్కును దాటింది. అయితే దానిని నిలబెట్టుకోలేకపోయింది.

సెన్సెక్స్ మైలురాయి
- జనవరి 1, 1986లో సెన్సెక్స్ లాంచ్ చేశారు. బేస్ ధర రూ.100
- జూలై 25, 1990న సెన్సెక్స్ 1001 పాయింట్లను తాకింది.
- లోకసభలో బీజేపీ ప్రభుత్వం నిలబడటంతో అక్టోబర్ 11, 1999న సెన్సెక్స్ 5000 పాయింట్లను తాకింది.
- ఫిబ్రవరి 7, 2006న సెన్సెక్స్ 10,000 మార్కును తాకింది.
- డిసెంబర్ 11, 2007న 20,000 క్రాస్ చేసింది.
- నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడటంతో మే 16, 2014న సెన్సెక్స్ 25,000 పాయింట్లకు చేరుకుంది.
- మార్చి 4, 2015న సెన్సెక్స్ 3000 పాయింట్లు దాటింది.
- జనవరి 17, 2018న సెన్సెక్స్ 35000 పాయింట్ల వద్దకు చేరుకుంది.
- మోడీ మరోసారి ప్రధాని కావడంతో మే 23, 2019న సెన్సెక్స్ 40000 పాయింట్లు దాటింది.
- డిసెంబర్ 4, 2020న సెన్సెక్స్ 45,000పాయింట్లు దాటింది.
- జనవరి 21, 2020న సెన్సెక్స్ 50,000 దాటింది.

కరోనా ముందు.. తర్వాత
సెన్సెక్స్ 45,000 నుండి 50,000 మార్కుకు 35 సెషన్లలో చేరింది. అంటే నెల రోజులకు పైన అంతే. 42,000-43,000కు 1 సెషన్‌లో, 43,000-44,000కు 6 సెషన్లలో, 44,000-45,000కు 11 సెషన్లలో, 45,000-46,000కు 3 సెషన్లలో, 46,000-47,000కు 7 సెషన్లలో, 47,000-48,000కు 11 సెషన్లలో, 48,000-49,000కు 5 సెషన్లలో, 49000-50000కు 9 సెషన్లలో చేరింది.
- 2020 జనవరి 1 41,306 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్, కరోనా కారణంగా మార్చి 23న 25,981 పాయింట్లకు పతనమైంది. ఇప్పుడు 50,000ను దాటింది.
- సెన్సెక్స్ కరోనా ముందు కంటే కరోనా తర్వాతనే భారీగా లాభపింది. కరోనాకు ముందు ఏడాదిలో 13 శాతం లాభపడితే, కరోనా తర్వాత ఇప్పటి వరకు 24 శాతం ఎగిసింది.
- 2019 మార్చి, 2019 ఏప్రిల్, 2019 సెప్టెంబర్ నెలలో మినహాయించి మిగతా నెలల్లో FII ఇన్‌ఫ్లో ఉంది. గత రెండు మూడు నెలల కాలంలో రికార్డు స్థాయికి చేరుకుంది.
- కరోనా సమయంలో నాస్‌డాక్ 86 శాతం, సెన్సెక్స్ 80 శాతం, ఎస్ అడ్ పీ 66 శాతం, డౌజోన్స్ 63 శాతం, నిక్కీ 38 శాతం, షాంఘై కాంపోజిట్ 25 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 100 20 శాతం, హ్యాంగ్ షెంగ్ 18 శాతం లాభపడ్డాయి.