కరోనా మహమ్మారి నేపథ్యంలో పాన్-ఆధార్ కార్డు లింక్‌ను మరోసారి పొడిగించి, ఊరట కల్పించింది ప్రభుత్వం. ఈ గడువును 2021 మార్చి 31వ తేదీకి పెంచుతూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితిల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గతంలో పాన్-ఆధార్ లింకింగ్ కోసం జూన్ 30, 2020 తేదీని డెడ్‌లైన్‌గా విధించింది. ఇప్పుడు 9 నెలలు పొడిగించి, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

ఆధార్ - పాన్ లింకింగ్
- https://www.incometaxindiaefiling.gov.in/home
ద్వారా లింక్ చేసుకోవచ్చు. ఆధార్ లింకింగ్ ఓపెన్ చేసి, అక్కడ అడిగిన వివరాలు ఇవ్వాలి. ఆధార్ నెంబర్, కాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్‌తో లింక్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది.
- ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లాలి.
- యూజర్ ఐడీ, పాస్ వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా లాగిన్ కావాలి.
- పాన్-ఆధార్ లింక్ కోసం ఓ పాపప్ విండో వస్తుంది. లేదా మెనూబార్‌లోని ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెల్లి, లింక్ ఆధార్ పైన క్లిక్ చేయాలి.
- పాన్ కార్డులో ఉన్న పేరు, పుట్టిన తేదీ, జండర్ తదితర వివరాలు ఉంటాయి.
- పాన్-ఆధార్ డిటైల్స్ వెరిఫై చేసుకోవాలి. మిస్-మ్యాచ్ అయితే కరెక్ట్ చేసుకోవాలి.
- డిటైల్స్ సరిపోలితే లింక్ నౌ పైన క్లిక్ చేయాలి.
- మీ ఆధార్-పాన్ లింక్ అయినట్లు పాపప్ మెసేజ్ వస్తుంది.

ఎస్సెమ్మెస్ ద్వారా
- ఎస్సెమ్మెస్ ద్వారా కూడా లింక్ చేసుకోవచ్చు. 567678 లేదా 56161 కు ఎస్సెమ్మెస్ చేయడం ద్వారా లింక్ చేసుకోవచ్చు. UIDPAN ఎస్సెమ్మెస్ చేసి లింక్ చేసుకోండి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఇది చేయాలి. మీరు పంపినట్లుగా మెసేజ్ వస్తుంది. కొన్ని రోజులకు లింక్ అయినట్లు కన్‌ఫర్మ్ చేస్తారు.
- ఈ-ఫైలింగ్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలోను లింక్ చేసుకోవచ్చు. పాన్ - ఆధార్ లింక్‌కు ఆదాయపన్ను శాఖ అవకాశం కల్పిస్తోంది. పాన్ కార్డు కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్లు లేదా మార్పులు చేసుకునే వాళ్లు ఆధార్ నెంబర్ ఇస్తే సరిపోతుంది.

స్టేటస్ తెలుసుకోవచ్చు
మీ పాన్ కార్డు - ఆధార్ లింక్ అయిందా తెలుసుకోవడం సులభమే. మీ దగ్గర పాన్ కార్డు, ఆధార్ నెంబర్ ఉంటే చాలు. https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.html లోకి వెళ్లి మీ పాన్ కార్డు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ లింక్ స్టేటస్ తెలిసిపోతుంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications