For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అడ్వాంటేజెస్, డిస్-అడ్వాంటెజెస్

|

మ్యూచువల్ ఫండ్స్ ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్న వారికి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్(ETFs) కనిపిస్తుంది.1993లో ప్రవేశపెట్టినప్పటి నుండి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. సంస్థలు, వ్యక్తులు ఎవరైనా ఈ సాధనం ప్రయోజనాన్ని చూడగలరు. అందుబాటులోని అనేక పెట్టుబడి మార్గాల్లో ETF ఒకటి. మన దేశంలోను గత కొంతకాలంగా వీటికి ఆదరణ పెరుగుతోంది. 2019 సెప్టెంబర్ 30వ తేదీ నాటికి ETF నిర్వహణలోని ఆస్తుల మొత్తం వ్యాల్యూ రూ.1.47 లక్షల కోట్లు. ఈ రెండేళ్ళ కాలంలో అంటే సెప్టెంబర్ 30, 2021 నాటికి రెండింతల కంటే ఎక్కువగా పెరిగి రూ.3.62 కోట్లకు చేరుకోవడం గమనార్హం. సంపన్నులు, రిటైల్ ఇన్వెస్టర్లు ETFs వైపు మొగ్గు చూపుతున్నారు. ETFsకు ఆదరణ పెరుగుతుండటంతో మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించేలా ETFsను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ETFsలలో పెట్టుబడులతో రిస్క్ తక్కువ, రిటర్న్స్ ఎక్కువ. అయితే కొన్ని డిస్-అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. దీని కంటే ముందు ETF అంటే ఏంటో తెలుసుకుందాం.

ఈటీఎఫ్ అంటే

ఈటీఎఫ్ అంటే

ETFs అంటే ఓ రకంగా స్టాక్స్‌లా వర్క్ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ లక్షణాలతో స్టాక్ మార్కెట్లో అవసరమైనప్పుడు ట్రేడ్ చేయగల కొన్ని సెక్యూరిటీల మిశ్రమం ఇది. ఇన్వెస్టర్ల నుండి డబ్బును సమీకరించి, ఆ మొత్తంతో షేర్లు, డెట్ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తారు. వాటిని కలిపి ఒక ETF యూనిట్‌గా పరిగణిస్తారు. అవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతాయి. స్టాక్ మార్కెట్ తరహా వ్యాల్యూ పెరుగుతుంది. ETFs షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వలె పని చేస్తాయి. స్టాక్ మార్కెట్లో కొన్ని ETF బ్లాక్స్ కలిసి షేర్లలా వ్యవహరిస్తాయి. ETF ఫండ్స్ దాదాపు అన్ని స్టాక్ ఎక్స్చేంజీలలో నమోదై ఉంటాయి. ట్రేడింగ్ సమయంలో వీటి క్రయవిక్రయాలు ఉంటాయి. ఒక ETF యూనిట్ వ్యాల్యూ దానిలోని షేర్లు, సెక్యూరిటీల విలువను బట్టి మారుతుంది. యూనిట్‌లో ఒకక దాని ధర పెరిగినా ETF వ్యాల్యూ పెరుగుతుంది. ETF కంపెనీ ఆదాయం, లాభాల ఆధారంగా ఇన్వెస్టర్లకు డివిడెండ్ కూడా ఉండవచ్చు.

ఈటీఎఫ్ రకాలు

ఈటీఎఫ్ రకాలు

ఈటీఎఫ్‌లలో ఈక్విటీ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్, డెట్ ఈటీఎఫ్, కరెన్సీ ఈటీఎఫ్ ఉంటాయి. యూనిట్‌లో కేవలం కంపెనీల ఈక్విటీ షేర్లు ఉంటే దానిని ఈక్విటీ ఈటీఎఫ్ అంటారు. అలాగే కమోడిటీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కూడా. కంపెనీలు ఫిజికల్ గోల్డ్‌ను భద్రపరిచినా, మనకు పేపర్ పైన వ్యాల్యూ ఉంటుంది. స్థిర ఆదాయం ఇచ్చే డెట్, గవర్నమెంట్ బాండ్స్ వంటి సెక్యూరిటీల్లోను ఇన్వెస్ట్ చేస్తారు. ఇదే డెట్ ఈటీఎఫ్. కరెన్సీ మారకపు వ్యాల్యూలో వచ్చే మార్పుల ఆధారంగా ఇన్వెస్ట్ చేస్తే కరెన్సీ ఈటీఎఫ్.

అలాగే, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఉంటాయి. మిక్స్డ్ ఈటీఎప్, నిఫ్టీ 50 ఈటీఎప్, నిఫ్టీ నెక్స్ట్ 50 ఈటీఎఫ్.. ఇలా ఉంటాయి. అవసరాన్ని బట్టి ఈటీఎఫ్స్‌ను అందుబాటులోకి తెస్తారు.

ముఖ్య అంశాలు

ముఖ్య అంశాలు

- ఈటీఎఫ్‌లలో తక్కువ రిస్క్. వైవిధ్యతను ఎక్కువగా ఉంటుంది. తక్కువ ధర, స్టాక్స్, ఇతర సెక్యూరిటీస్ బాస్కెట్‌ను కలిగి ఉంటాయి.

- వ్యక్తిగత పెట్టుబడిదారులకు విభిన్న పోర్ట్‌పోలియోల కోసం ఆదర్శవంతమైన ఎంపిక.

- ETF తక్కువ వ్యయ నిష్పత్తిని కలిగి ఉంటాయి. డివిడెండ్‌ను వెంటనే ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి.

- ఇక్కడ మరో అంశం, ETFను బట్టి పన్ను ఉంటుంది.

- మ్యూచువల్ ఫండ్ వంటి వాటితో పోల్చినప్పుడు ETFs ప్రయోజనకరం.

- ETFsను మార్జిన్ పైన కొనుగోలు చేసి, షార్ట్‌గా విక్రయించవచ్చు.

- ఇతర ఫండ్స్‌తో పోలిస్తే ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువ.

- డివిడెండ్‌ను వెంటనే తిరిగి పెట్టుబడిగా పెట్టవచ్చు.

- మ్యూచువల్ ఫండ్స్ కంటే ETFs మరింత ట్యాక్స్ ఎఫిసియెంట్.

డిస్-అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇన్వెస్టర్లు కేవలం లార్జ్ స్టాక్స్‌కు మాత్రమే ఎక్కువగా పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు పది నుండి పదిహేను సంవత్సరాల కాల వ్యవధిని కలిగి ఉంటారు. కాబట్టి వారు ఇంట్రాడే ప్రయోజనం పొందలేరు. చాలామంది ఇతర ఫండ్స్‌తో ఈటీఎఫ్స్‌ను పోల్చుతారు. నిర్దిష్ట స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసినట్లుగా పోల్చితే ఖర్చులు ఎక్కువ. డివిడెండ్ యీల్డ్స్ తక్కువ.

English summary

ETF investment: Advantages and Disadvantages of ETFs

ETFs are considered to be low-risk investments because they are low-cost and hold a basket of stocks or other securities, increasing diversification.
Story first published: Tuesday, November 9, 2021, 15:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X