తల్లిదండ్రులు తమ కుమార్తెకు వివాహం చేయాలనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పథకాలు ఉన్న విషయం తెలిసిందే. కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు తెలిసిందే. అసోం ప్రభుత్వం కూడా తమ కూతురుకు పెళ్లి చేసే తల్లిదండ్రులకు 'బంగారం' వంటి స్కీంను తీసుకు వచ్చింది. ఆడపిల్లల పెళ్లికి ఇబ్బందులుపడే తల్లిదండ్రులకు కొంతలో కొంత భారాన్ని తగ్గిస్తుంది. అరుంధతి గోల్డ్ స్కీం పేరుతో ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చింది. కూతురు పెళ్లి చేసే వారికి 10 గ్రాముల బంగారం నాణేన్ని అందిస్తున్నారు.

అర్హులు ఎవరంటే?
రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారికి అసోం ప్రభుత్వం 1 తులం బంగారాన్ని వధువులకు అందిస్తోంది. ఈ పథకం మొదటి ఇద్దరు సంతానానికి అందిస్తారు. అరుంధతి గోల్డ్ స్కీం కింద పెళ్లి చేసుకునే అమ్మాయిలు దరఖాస్తు చేసుకుంటే పది గ్రాముల బంగారాన్ని ఇస్తారు. పేద తల్లిదండ్రులకు వివాహ ఖర్చులు పెనుభారం. వారికి ఇది కొంతలో కొంత ఊరటను అందిస్తుంది. కూతుళ్లకు ఆర్థిక భద్రతను కూడా ఇస్తుంది. ప్రత్యేక వివాహ చట్టం, 1954 ప్రకారం వివాహ దరఖాస్తు కోసం నమోదు చేసుకున్న రోజున దరఖాస్తు చేసుకోవచ్చు.

అరుంధతి గోల్డ్ స్కీంకు షరతులు
అరుంధతి గోల్డ్ స్కీం కింద అరుంధతి స్వర్ణ యోజన స్కీం ప్రయోజనం పొందవచ్చు. అయితే పెళ్లి చేసుకునే కుమార్తె వయస్సు కనీసం 18 ఉండాలి. వరుడికి 21 సంవత్సరాలు ఉండాలి. వివాహ నమోదు కూడా తప్పనిసరి. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది. ఓ అమ్మాయి మొదటి పెళ్లికి మాత్రమే ఇది వర్తిస్తుంది. వధువు, వరుడు ఇద్దరు హెచ్ఎస్‌ఎల్‌సీ లేదా తత్సమానం పూర్తి చేయాలి.

వారికి కనీస విద్యార్హత అవసరం లేదు
అయితే ఆదివాసీ వర్గాలతో సహా టీ-ట్రైబ్‌కు ఈ చదువుల నుండి మినహాయింపు ఉంది. అసోంలోని టీ గార్డెన్స్‌లో హైస్కూల్ సౌకర్యం లేనందున రాబోయే అయిదేళ్లకు ఆదివాసీ వర్గాలతో సహా టీ-ట్రైబ్స్‌కు కనీస విద్యార్హత అవసరం లేదు.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications