ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ (EPF) ట్యాక్స్ ఫ్రీ పెట్టుబడి ఆప్షన్. రూ.1.5 లక్షల వరకు చేసే పెట్టుబడిపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే, పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌పై వచ్చే వడ్డీపై ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. మెచ్యూరిటీ పూర్తయ్యాక విత్ డ్రా చేస్తే పన్ను ఉండదు. ఉద్యోగులు ఎవరైనా రెగ్యులర్ పేయింగ్ జాబ్ నుంచి రిటైర్ అయ్యాకే పీఎఫ్ బ్యాలెన్స్ అమౌంట్‌ను తీసుకునేందుకు అర్హులు. ప్రత్యేక సందర్భాలలో మాత్రమే పీఎఫ్ అమౌంట్ తీసుకోవచ్చు.
మెచ్యూరిటీ కంటే పీఎఫ్ అమౌంట్ తీసుకోవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఉపాధి లేకపోవడం, పెళ్లి, చదువు, అనారోగ్యం, లోన్ రీపేమెంట్, భూమి కొనుగోలు, ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు వంటి వాటి కోసం పీఎఫ్ డబ్బుల్ని ముందుగా తీసుకోవచ్చు. మెచ్యూరిటీకి అయిదేళ్ల ముందు పీఎఫ్ అకౌంట్‌ను విత్ డ్రా చేసుకుంటే ఆదాయపు పన్ను చెల్లించవలసి ఉంటుంది. ట్యాక్స్ స్లాబ్ ప్రాతిపదికన విత్ డ్రా చేసిన సొమ్ముపై పన్ను ఉంటుంది.

ఆన్ లైన్ ద్వారా పీఎఫ్ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఈపీఎఫ్ఓ ఆన్ లైన్ పోర్టల్, www.epfindia.gov.inకు వెళ్లి క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఎంప్లాయర్.. పీఎఫ్ ఉపసంహరణ అభ్యర్థనను ఈపీఎఫ్ఓ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ఆమోదించాలి. కాగా, 2018-19 సంవత్సరానికి గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పైన వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications