For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్ఐసీ సరికొత్త 'జీవన్ అమర్': అర్హత, పరిమితి, బెనిఫిట్స్.. పాలసీ పూర్తి వివరాలు

|

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ (LIC) కొత్త టర్మ్ పాలసీ జీవన్ అమర్‌ను సోమవారం తీసుకు వచ్చింది. LIC జీవన్ అమర్ పేరుతో తెచ్చిన ఈ టర్మ్ పాలసీ నాన్ లింక్డ్, లాభాపేక్షలేనిదని, పాలసీదారులకు పూర్తిస్థాయి భద్రత లభిస్తుందని ఎల్ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పాలసీ ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉందని పేర్కొంది. ఇది ఏజెన్సీ ఛానళ్ల నుంచి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ విక్రయాలు లేవు.

<strong>రూ.55 చెల్లిస్తే రూ.3,000 పెన్షన్!: ఈ స్కీంకు అర్హులెవరు?</strong>రూ.55 చెల్లిస్తే రూ.3,000 పెన్షన్!: ఈ స్కీంకు అర్హులెవరు?

రెండు రకాల ఆప్షన్స్

రెండు రకాల ఆప్షన్స్

LIC జీవన్ అమర్ పాలసీ రెండు రకాలుగా ఉంది. లెవల్ సమ్ అస్యూర్డ్క, ఇంక్రీసింగ్ సమ్ అస్యూర్డ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. రెండు రకాల్లో లభించనున్న ఈ పాలసీని స్మోక్ చేసేవారు, స్మోక్ చేయని వారు ఏదో ఒకదానిని ఎంచుకోవచ్చు. స్మోకర్స్, నాన్ స్మోకర్స్ కేటగిరీలు ఉన్నాయి.

ఏ వయస్కులు అర్హులు

ఏ వయస్కులు అర్హులు

18 ఏళ్లు నిండిన వారి నుంచి 64 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. మెచ్యూరిటీ కాల పరిమితి 80 ఏళ్లు. పది సంవత్సరాల నుంచి గరిష్టంగా 40 సంవత్సరాల వరకు పాలసీ కాల పరిమితిని ఎంచుకోవచ్చు.

కనిష్టం రూ.25 లక్షలు.. గరిష్టం లేదు

కనిష్టం రూ.25 లక్షలు.. గరిష్టం లేదు

కనిష్ట పాలసీ విలువ రూ.25,00,000. గరిష్ట పరిమితి లేదు. రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య పాలసీకి రూ.1,00,000 చొప్పున, అంతకుమించిన పాలసీని రూ.10 లక్షల చొప్పున పెంచుకోవాల్సి ఉంటుంది. మహిళలకు పురుషుల కంటే తక్కువ ప్రీమియం రేట్లు ఉన్నాయి.

రూ.1 కోటి కలిగిన పాలసీ తీసుకుంటే...

రూ.1 కోటి కలిగిన పాలసీ తీసుకుంటే...

ఉదాహరణకు 30 ఏళ్ల పొగతాగని వ్యక్తి 20 ఏళ్ల వ్యవధికి రూ.1 కోటి సమ్ అస్యూర్డ్ కలిగిన ఈ ఇన్సురెన్స్ పాలసీ తీసుకుంటే రూ.10,800 ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. మహిళలు అయితే రూ. రూ.9,440 చెల్లించాలి. జీఎస్టీ అదనంగా చెల్లించాలి.

ప్రీమియం, డెత్ బెనిఫిట్స్ ప్రయోజనాలు

ప్రీమియం, డెత్ బెనిఫిట్స్ ప్రయోజనాలు

జీవన్ అమర్ పాలసీ తీసుకున్న వారు సింగిల్, రెగ్యులర్, లిమిటెడ్ ప్రీమియం పేమెంట్స్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. అంతేకాదు, డెత్ బెనిఫిట్స్ విషయంలోను ఆప్షన్స్ ఉన్నాయి. ఒకేసారి మొత్తం అమౌంట్ తీసుకుంటారా లేక వాయిదాలలో తీసుకుంటారా అనేది ఎంచుకోవచ్చు. అదనంగా యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్‌ను జోడించుకోవచ్చు.

పన్ను మినహాయింపులు...

పన్ను మినహాయింపులు...

తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకు వచ్చినట్లు ఎల్ఐసీ తెలిపింది. పూర్తి జీవితానికి రక్షణ కల్పించే ఈ ప్లాన్ పాలసీదారులకు సరసమైన ధరల్లోనే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. తక్కువ ధరలో మరణానంతరం కుటుంబానికి రక్షణ కల్పించుకునే ఈ ప్లాన్ పైన అమల్లో ఉన్న పన్ను చట్టాల ప్రకారం పన్ను ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది. ప్రమాద బీమాకు అదనంగా కవరేజీ ఉందని తెలిపింది.

English summary

ఎల్ఐసీ సరికొత్త 'జీవన్ అమర్': అర్హత, పరిమితి, బెనిఫిట్స్.. పాలసీ పూర్తి వివరాలు | LIC launches Jeevan Amar: Know about this policy

Indian State owned Insurance Group and Investment Company brings New Term Insurance Plan, Know everything about Jeevan Amar Plan.
Story first published: Tuesday, August 6, 2019, 9:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X