For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాల‌సీతో ఆధార్ అనుసంధానం ఇలా...

ఎల్ఐసీ పాల‌సీల‌ను ఆధార్ సంఖ్య‌తో అనుసంధానించ‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టిదాకా ఎస్ఎంఎస్ సాయంతో ఆధార్ అనుసంధానించడాన్ని ఎల్ఐసీ ప్రారంభించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆన్‌లైన్ మార్గంలో చేయ‌డ‌మే మేలు. ఎల్ఐసీ పాల‌సీకి ఆధార్

|

ఇప్పుడు చాలా చోట్ల ఆధార్ అనుసంధానం మాట వినిపిస్తోంది. రేష‌న్ కార్డు, పాన్ కార్డు, స్కాలర్ షిప్‌లు, గ్యాస్ స‌బ్సిడీ ఇలా ఒక‌టేమిటి వీలైన ప్ర‌తి చోటా ఆధార్ అనుసంధానాన్ని ప్ర‌భుత్వం చేయిస్తోంది. దీంతో ప్ర‌జ‌ల‌కు ఆధార్ పేరు ఉంటేనే గుబులు పుట్టేస్తోంది. ఈ మ‌ధ్య ఐఆర్‌డీఏఐ ఒక కొత్త ప్ర‌తిపాద‌న‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎల్ఐసీ పాల‌సీల‌ను ఆధార్ సంఖ్య‌తో అనుసంధానించ‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టిదాకా ఎస్ఎంఎస్ సాయంతో ఆధార్ అనుసంధానించడాన్ని ఎల్ఐసీ ప్రారంభించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆన్‌లైన్ మార్గంలో చేయ‌డ‌మే మేలు. ఎల్ఐసీ పాల‌సీకి ఆధార్ సంఖ్య‌ను ఎలా అనుసంధానించాలో తెలుసుకుందాం.

 ఎల్ఐసీ పాల‌సీ, ఆధార్ అనుసంధానం

1) మీ పాల‌సీల‌ను ఇంకా ఆధార్ కార్డు, పాన్ కార్డుల‌ను ద‌గ్గ‌ర ఉంచుకోండి
2) ఎల్ఐసీ వెబ్‌సైట్లో లాగిన్ అవండి.హోం పేజీలో ఎల్ఐసీ పాల‌సీని ఆధార్, పాన్ అనుసంధానించే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.
3) ఆ లింక్ పై క్లిక్ చేయండి. అప్పుడు ఎలా చేయాల‌నే స‌మాచారం వ‌స్తుంది. నిబంధ‌న‌లు చ‌ద‌వండి
4) యూఐడీఏఐ వ‌ద్ద న‌మోదైన మొబైల్ నంబ‌రు ఎంట‌ర్ చేయాలి. ఎందుకంటే ఆ నంబ‌ర్‌కే ఓటీపీ వ‌స్తుంది.
5) ఆధార్ రుజువులో మొబైల్ నంబ‌రు ఉండి ఉండ‌క‌పోతే, ద‌గ్గ‌ర్లోని ఎల్ఐసీ కార్యాల‌యానికి వెళ్లాల్సిందే.
6) చెక్ లిస్ట్ చ‌దివిన తర్వాత ప్రొసీడ్ బ‌టన్ క్లిక్ చేయాలి.
7) ఫారంలో వివ‌రాల‌ను నింపిన త‌ర్వాత లింకేజీ రిజిస్ట్రేష‌న్ సంబంధిత స‌మాచారం మీకు అందుతుంది.
8) యూఐడీఏఐ ఈ వెరిఫికేష‌న్‌ను పూర్తి చేసిన త‌ర్వాత‌, మీకు ఎల్ఐసీ నుంచి సంక్షిప్త సందేశం లేదా మెయిల్ వ‌స్తుంది.

Read more about: lic ఎల్ఐసీ
English summary

పాల‌సీతో ఆధార్ అనుసంధానం ఇలా... | LIC has provided an online facility for linking the policies with UID

As per a government directive, you have to link your Aadhaar and PAN to your LIC (Life Insurance Corporation) policies, says India's biggest life insurer on its website. LIC has come up with a facility which enables policyholders to link Aadhaar with their policies online
Story first published: Saturday, December 2, 2017, 14:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X