For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్ఐసీ జీవ‌న్ ఉత్క‌ర్ష్ ప్లాన్ ఎలా ఉంది?

జీవ‌న్ ఉత్క‌ర్ష్ పేరుతో వ‌చ్చిన ఈ ప్లాన్ నాన్ లింక్‌డ్ జీవిత బీమా పాల‌సీ. దీనికి సంబంధించి ముఖ్య విషయాల‌ను తెలుసుకుందాం.

|

ఎల్ఐసీ కొత్త‌గా సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్‌ను విడుద‌ల చేసింది. జీవ‌న్ ఉత్క‌ర్ష్ పేరుతో వ‌చ్చిన ఈ ప్లాన్ నాన్ లింక్‌డ్ జీవిత బీమా పాల‌సీ. దీనికి సంబంధించి ముఖ్య విషయాల‌ను తెలుసుకుందాం.

 పాల‌సీ ముఖ్య ల‌క్ష‌ణాలు

పాల‌సీ ముఖ్య ల‌క్ష‌ణాలు

క‌నీస అర్హ‌త వ‌య‌సు: 6

గ‌రిష్ట అర్హ‌త వ‌య‌సు: 47

క‌నీస బీమా హామీ మొత్తం: రూ.75 వేలు

గ‌రిష్ట బీమా హామీ మొత్తం: ప‌రిమితి లేదు

పాల‌సీ కాల‌ప‌రిమితి: 12 సంవ‌త్స‌రాలు

ప్రీమియం చెల్లింపు : ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి.

* ప్లాన్ ప్రారంభ‌మైన మూడు నెల‌ల కాలం నుంచి రుణ సదుపాయం పొంద‌వ‌చ్చు.

రిస్క్ క‌వ‌రేజీ

రిస్క్ క‌వ‌రేజీ

పాల‌సీదారు వ‌య‌సు 8 లేదా అంత‌కంటే ఎక్కువ ఉంటే పాల‌సీ క‌వ‌రేజీ త‌క్ష‌ణ‌మే వ‌ర్తిస్తుంది.

ఒక‌వేళ పాల‌సీదారు వ‌య‌సు 8 కంటే త‌క్కువుంటే వ‌య‌సు 8 ఏళ్లు అయిన‌ప్ప‌టి నుంచే క‌వ‌రేజీ మొద‌ల‌వుతుంది. క‌నుక మొద‌టే 6 ఏళ్ల‌ప్పుడే పాల‌సీ కొనుక్కుంటే మ‌రో రెండేళ్లు పాల‌సీ క‌వ‌రేజీ ప్రారంభానికి వేచి చూడాల్సిందే.

పాల‌సీ ప్రయోజ‌నాలు

పాల‌సీ ప్రయోజ‌నాలు

రిస్క్ క‌వ‌రేజీ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి పాల‌సీ బీమా హామీ మొత్తాన్ని పాల‌సీదారు మ‌ర‌ణించిన‌ప్పుడు ల‌బ్దిదారుల‌కు చెల్లిస్తారు.

రిస్క్ క‌వ‌రేజీ లేదా బీమా హామీ మొత్తం ప్రీమియం విలువ‌కు 10 రెట్లు ఉంటుంది.

పాల‌సీ తీసుకున్న 5 ఏళ్ల త‌ర్వాత మ‌ర‌ణం సంభ‌విస్తే

క‌నీస బీమా హామీ మొత్తం+ పాల‌సీ కొన‌సాగింపు ప్ర‌యోజ‌నాల‌ను నామినీకి చెల్లిస్తారు.

ఇలాంటి సంద‌ర్భంలో బీమా హామీ మొత్తం ఈ విధంగా లెక్కిస్తారు.

a) వార్షిక ప్రీమియంకు 10 రెట్లు

b) క‌నీస బీమా హామీ మొత్తం

c) ప్రీమియంలో 125%

పాల‌సీదారు మ‌ర‌ణిస్తే వీటిలో ఏది త‌క్కువైతే అది క‌నీసం చెల్లింపు జ‌రిగేందుకు హామీ.

పాల‌సీని స్వాధీన‌ప‌ర‌చ‌వ‌చ్చా?

పాల‌సీని స్వాధీన‌ప‌ర‌చ‌వ‌చ్చా?

ఒక‌వేళ పాల‌సీతో సంతృప్తి చెంద‌క‌పోతే పాల‌సీదారు ఎప్పుడైనా పాల‌సీని స్వాధీన‌ప‌ర‌చవ‌చ్చు. అలాంట‌ప్పుడు ఈ ష‌ర‌తులు గుర్తుంచుకోవాలి.

1) ఏడాది లోపు పాల‌సీని స్వాధీన‌ప‌రిస్తే క‌నీసం ప్రీమియంలో కనీసం 70% చెల్లింపు జ‌రుగుతుంది.

2) పాల‌సీని ఏడాది త‌ర్వాత స్వాధీన‌ప‌రిచేందుకు సిద్ద‌ప‌డితే క‌నీసం ప్రీమియంలో 90%

3) ఒక‌వేళ పాల‌సీ ప్రారంభ‌మైన 5 ఏళ్ల త‌ర్వాత పాల‌సీని వెన‌క్కు ఇచ్చేందుకు(స్వాధీన‌ప‌రిచేందుకు) సిద్ద‌ప‌డితే ప్రీమియంలో 90%+పాల‌సీ కొన‌సాగింపు ప్ర‌యోజ‌నాలు(ఏవైనా ఉంటే)

ఇత‌ర అంశాలు

ఇత‌ర అంశాలు

ఈ పాల‌సీలో ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణాలు, అంగ‌వైక‌ల్య రైడ‌ర్ల‌ను సైతం మ‌న అవ‌స‌రాన్ని బ‌ట్టి అద‌నంగా తీసుకునే వీలుంది.

చెల్లించిన ప్రీమియానికి ఆదాయ ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి.

ఈ ప్లాన్ తీసుకున్న మొద‌టి ఐదేళ్ల‌లో రిస్క్ క‌వ‌రేజీ ఉండ‌దు.

మొద‌టిసారి పాల‌సీ తీసుకునే వారికి ఇది సూచ‌నీయం కాదు.

ఇదివ‌ర‌కే ఒక ట‌ర్మ్ పాల‌సీ ఉన్న‌వారు అద‌నంగా డ‌బ్బు ఉంద‌ని తీసుకోవాల‌నుకుంటే అన్ని బేరీజు వేసుకోవాల‌ని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు సూచిస్తున్నారు.

telugu.goodreturns.in

Read more about: lic insurance policy endowment plan
English summary

ఎల్ఐసీ జీవ‌న్ ఉత్క‌ర్ష్ ప్లాన్ ఎలా ఉంది? | How is LIC jeevan utkarsh plan and what are the features in it

LIC has introduced a new single premium non-linked with- profits insurance cum savings plan i.e. closed ended which means that the scheme is available for a maximum of 270 days from the date of its launch i.e September 6, 2017.
Story first published: Saturday, September 9, 2017, 15:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X