For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.385 నుండి రూ.13కు పడిపోయిన ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చా?

|

మీరు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్నారా? మార్కెట్లు ప్రస్తుతం గరిష్ట రికార్డుస్థాయికి సమీపంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టే సమయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యస్ బ్యాంకును పరిగణలోకి తీసుకోవచ్చు. సరిగ్గా రెండేళ్ల క్రితం జూలై 2019లో ఈ స్టాక్ రూ.385 వద్ద ట్రేడ్ అయింది. ఈ బ్యాంకు వ్యవహారాల కారణంగా ఇప్పుడు ఈ స్టాక్ రూ.13కు పడిపోయింది.

రానా కపూర్ వంటి బ్యాంకు వ్యవస్థాపక సభ్యులు బ్యాంకు నుండి నిష్క్రమించారు. 2019లో నగదు ఉపసంహరణపై తాత్కాలిక నిషేధం విధించారు. ఈ అంశాలు ఈ స్టాక్స్ పైన ప్రభావం చూపాయి. భారీగా పడిపోయిన నేపథ్యంలో యస్ బ్యాంకు స్టాక్ కొనుగోలును పరిశీలించవచ్చు. అయితే స్టాక్ కొనుగోలు రిస్క్‌తో కూడుకున్న అంశం. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా కదులుతాయి. కాబట్టి నిపుణుల సలహాలు, రిస్క్ తీసుకునే శక్తి చూసుకోవాలి.

యస్ బ్యాంకు మరింత పడిపోయే ఛాన్స్

యస్ బ్యాంకు మరింత పడిపోయే ఛాన్స్

యస్ బ్యాంకు స్టాక్‌పైన 25శాతం ప్రతికూల నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఈ స్టాక్ రూ.10 దిగువకు కూడా పడిపోవచ్చునని రేటింగ్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. అంటే దాదాపు 25 శాతం పతనం. ప్రస్తుతం రూ.13 వద్ద ఉంది. నిన్న రూ.13.05 వద్ద ముగిసిన స్టాక్ నేడు, రూ.12.95 వద్ద కదలాడుతోంది. మార్కెట్లు ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్టం వద్ద ఉన్నాయి.

అలాగే యస్ బ్యాంకు స్టాక్ మరింత క్షీణించవచ్చునని భావిస్తున్నారు. ఈ సమయంలో రిస్క్ తీసుకునే ధైర్యం కలిగిన ఇన్వెస్టర్లు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఎంకే గ్లోబల్ ప్రకారం FY21 నాలుగో త్రైమాసికంలో యస్ బ్యాంకు భారీగా నష్టపోయింది. FY22 తొలి త్రైమాసికంలో మాత్రం 2.1 బిలియన్ డాలర్ల లాభాలను నమోదు చేయడం గమనార్హం. అధిక ఇతర ఆదాయాలు, తక్కువ ప్రొవిజన్స్ కారణంగా ఇది సాధ్యమైంది.

వృద్ధి రేటు

వృద్ధి రేటు

బ్రోకరేజ్ సంస్థ ప్రకారం ఏడాది ప్రాతిపదికన క్రెడిట్ గ్రోత్ 0.5 శాతం తగ్గి రూ.1.7 ట్రిలియన్లుగా నమోదయింది. ప్రధానంగా కార్పోరేట్ ప్రభావం పడింది. రిటైల్ వృద్ధి రేటు ఏడాది ప్రాతిపదికన 31 శాతం పెరిగింది. FY22లో యస్ బ్యాంకు 20 శాతం వృద్దిని అంచనా వేస్తోంది.త అయితే అసెట్ వ్యాల్యూ పోర్ట్‌పోలియో ఆందోళన కలిగిస్తోంది. కరెంట్, సేవింగ్స్ అకౌంట్స్ 27 శాతంగా ఉన్నాయి. డిపాజిట్ గ్రోత్ 39 శాతం పెరిగింది.

ఆ తర్వాతే పెట్టుబడి

ఆ తర్వాతే పెట్టుబడి

ఎంకే గ్లోబల్ ప్రకారం తాజా స్లిప్పేజెస్ రూ.22 బిలియన్ల వద్ద ఉన్నాయి. ఇందులో ప్రధానంగా కార్పోరేట్ రూ.12.5 బిలియన్లు, రిటైల్ 7.6 బిలియన్లుగా ఉంది. స్టాక్స్‌లో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్న అంశం. ఈ వ్యాసం ఆధారంగా పెట్టుబడులు పెట్టకూడదు. నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు, స్టాక్‌ను పూర్తిగా పరిశీలించి ఇన్వెస్ట్ చేయాలి.

English summary

రూ.385 నుండి రూ.13కు పడిపోయిన ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చా? | Yes bank credit growth remains weak, Should you buy?

If you have to identify one stock that has destroyed investor wealth in the last 2-3 years, it has to be stock of Yes Bank. From a stock price of Rs 385, exactly two years ago in July 2019, we are down to a stock price of Rs 13. The founding members like Rana Kapoor have exited the bank and there was a moratorium placed on withdrawals in 2019. In any case, let's tell you whether the stock is worth buying at the current levels.
Story first published: Wednesday, July 28, 2021, 12:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X