ట్యాక్స్ ఆప్టిమైజేషన్ ఎప్పుడు కూడా మీ ఆర్థిక ప్రణాళికలో భాగంగా ఉండాలి. మీ ఆర్థిక లక్ష్యాలను పరిగణలోకి తీసుకొని, తెలివిగా పెట్టుబడులు పెట్టాలి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వడ్డీ రేట్లు భారీగా క్షీణించాయి. ఇలాంటి సమయంలోను పలు ఫైనాన్స్ బ్యాంకులు, చిన్న ప్రయివేటు బ్యాంకులు, పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన 6.75 శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్‌పై మినహాయింపు ఉంటుంది. ట్యాక్స్ సేవింగ్స్ డిపాజిట్స్ పైన మంచి వడ్డీ రేటును అందించే బ్యాంకులు...

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ పైన వడ్డీ రేటు 6.75 శాతం వరకు అందిస్తోంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో సూర్యోదయ వడ్డీ రేట్లు గరిష్టంగా ఉన్నాయి. రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అయిదేళ్లలో ఇది రూ.2.10 లక్షలు అవుతుంది.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ పైన వడ్డీ రేటు 6.40 శాతం వరకు అందిస్తోంది. ఈ బ్యాంకులో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అయిదేళ్లలో ఇది రూ.2.06 లక్షలు అవుతుంది.

RBL బ్యాంకు
RBL బ్యాంకు ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ పైన వడ్డీ రేటు 6.30 శాతం వరకు అందిస్తోంది. ఈ బ్యాంకులో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అయిదేళ్లలో ఇది రూ.2.05 లక్షలు అవుతుంది.

ఈ బ్యాంకుల్లో
డచెస్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు, యస్ బ్యాంకు ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన 6.25 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఈ బ్యాంకులలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అయిదేళ్లలో రూ.2.05 లక్షల వరకు అవుతుంది.

ఇండస్ఇండ్ బ్యాంకు
ఇండస్ఇండ్ బ్యాంకు ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ పైన వడ్డీ రేటు 6.00 శాతం వరకు అందిస్తోంది. ఈ బ్యాంకులో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అయిదేళ్లలో ఇది రూ.2.02 లక్షలు అవుతుంది.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయి. డిపాజిట్ ఇన్సురెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ (DICGC) కింద రూ.5 లక్షల వరకు గ్యారెంటీ ఉంది.


Click it and Unblock the Notifications