Tax Saving FDs: ఈ ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ అదుర్స్
డిపాజిట్ భద్రత హామీతో స్థిరమైన రాబడిని మాత్రమే కాకుండా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు కోరుకునే కోరుకునే పెట్టుబడిదారులు డెట్ ఇన్వెస్ట్‌మెంట్ కేటగిరీ కింద 5 సంవత్సరాల ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్‌లలో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను ఆదా చేయడానికి గరిష్టంగా రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు.
కనీస ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ అయిదేళ్లు. లాక్-ఇన్ పీరియడ్ అయిదేళ్లు అంటే మీరు ముందుగా డబ్బును తీసుకోలేరు. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ ప్లాన్ (ELSS) జనాధరణను అనుసరించి, మూడేళ్ల కాల వ్యవధి, అయిదేళ్ల కాల వ్యవధితో ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా బ్యాంకు లేదా పోస్టాఫీస్‌లో పన్ను ఆదా చేసే పెట్టుబడులు ఆదరణ పొందాయి.
DICGC పథకం కింద రూ.5 లక్షల వరకు రాబడి, మూలధన రక్షణకు హామీ లభిస్తుంది. అయితే ట్యాక్స్ సేవింగ్స్ ఖాతా నుండి వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను విధిస్తారనే విషయం గుర్తించాలి. వివిధ బ్యాంకులు పన్ను ఆదా చేసే ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వేరియబుల్ రేట్లను అందిస్తాయి. కాబట్టి అన్నింటిని పరిశీలించాలి.

SBI ట్యాక్స్ సేవింగ్స్ స్కీం
దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI). ట్యాక్స్ సేవింగ్స్ స్కీంను సీనియర్, నాన్-సీనియర్ సిటిజన్స్ ఉపయోగించుకోవచ్చు. ట్యాక్స్ సేవింగ్స్ స్కీం కింద టర్మ్ డిపాజిట్ కనిష్ట కాల వ్యవధి 5 సంవత్సరాలు. గరిష్ట కాలపరిమితి పదేళ్లు. పన్ను ఆదా పథకం కింద టర్మ్ డిపాజిట్లకు 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. టర్మ్ డిపాజిట్ స్కీంను రూ.1000తో ఓపెన్ చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు జమ చేయవచ్చు. పదేళ్ల వరకు మెచ్యూర్డ్ టర్మ్ డిపాజిట్స్ పైన బ్యాంకు సాధారణ పౌరులకు 5.5 శాతం వడ్డీ రేటు, సీనియర్ సిటిజన్లకు 6.30 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

ICICI ట్యాక్స్ సేవింగ్స్ స్కీం
ఐసీఐసీఐ ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం మంచి వడ్డీ రేటుతో పాటు ట్యాక్స్ సేవింగ్స్ స్కీం. సెక్షన్ 80సీ కింద కనీసం రూ.10,000, గరిష్టంగా రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. అయిదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంది. ముందస్తు ఉపసంహరణ లేదు. ఆటో రెన్యూవల్ సౌకర్యం ఉంది. ప్రస్తుతం బ్యాంకు 5.45 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

HDFC ట్యాక్స్ సేవింగ్స్ స్కీం
HDFC బ్యాంకు ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ అయిదేళ్ల ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం. కనీసం రూ.100 ఇన్వెస్ట్ చేయవచ్చు. రూ.100Xతో గరిష్టంగా రూ.15,000 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ బ్యాంకు 5.60 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 6.35 శాతం వడ్డీని అందిస్తోంది.

యాక్సిస్ ట్యాక్స్ సేవింగ్స్ స్కీం
యాక్సిస్ బ్యాంకులో లాంగ్ టర్మ్‌లో ట్యాక్స్ సేవింగ్స్ స్కీం ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. కనీసం రూ.100, గరిష్టంగా రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. యాక్సిస్ బ్యాంకు ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు మూడు రకాలు ఉన్నాయి. రీ-ఇన్వెస్ట్‌మెంట్, క్వార్టర్లీ ఇంటరెస్ట్ పేఔట్, మంత్లీ ఇంటరెస్ట్ పేఔట్ ఉన్నాయి. సెక్షన్ 80సీ కింద అయిదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. యాక్సిస్ బ్యాంకు ట్యాక్స్ ఫిక్స్డ్ సేవింగ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.75 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్లకు 6.50 శాతంగా ఉంది.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్
పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీంలలో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ (TD)ను అందిస్తోంది. సింగిల్ అడల్ట్ లేదా జాయింట్‌గా (ముగ్గురి వరకు) నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్‌ను లేదా పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్‌ను తెరువవచ్చు. కనీసం రూ.1000 ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆ తర్వాత రూ.100x ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీం కాలపరిమతి ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, అయిదేళ్లు. వడ్డీ రేటు 5.5 శాతం నుండి 6.7 శాతం మధ్య ఉంది.


Click it and Unblock the Notifications