For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండవచ్చు? బంగారం ధర భారీగా పెరుగుతుందా?

|

స్టాక్ మార్కెట్లు గత రెండు వారాలుగా నష్టాలను నమోదు చేస్తున్నాయి. అంతకుముందు వారం వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్, గతవారం 2500 పాయింట్లకు పైగా పతనమైంది. ఆల్ టైమ్ గరిష్టంతో సెన్సెక్స్ ప్రస్తుతం 5000 పాయింట్లకు పైగా తక్కువగా ఉంది. యూరోపియన్ దేశాల్లో కరోనా కేసులు పెరగడం, ద్రవ్యోల్భణ ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను అంతకుముందు దెబ్బతీయగా, సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీంతో ప్రపంచ, భారత మార్కెట్లు దారుణంగా కుప్పకూలాయి. ఈ వారం మార్కెట్ పైన కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌తో పాటు వివిధ అంశాలు ప్రభావం చూపనున్నాయి.

మార్కెట్ పైన వీటి ప్రభావం

మార్కెట్ పైన వీటి ప్రభావం

ఈ వారం మార్కెట్ పైన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దీంతో పాటు జూలై-సెప్టెంబర్ జీడీపీ గణాంకాలు, ఒపెక్ సమావేశ నిర్ణయాలు, FII, అమెరికా పీఎంఐ వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. ఈ వారం మార్కెట్ ఎలా ఉన్నా ఐటీ, ఫార్మా రంగ షేర్లు సానుకూలంగా ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

మెటల్, ఎఫ్ఎంసీజీరంగ షేర్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. వాహనాల విక్రయాలకు సంబంధించి నెలవారీ సేల్స్ ప్రకటించనునున్న నేపథ్యంలో ఈ రంగంపై నవంబర్ సేల్స్ ప్రభావం ఉంటుంది. అయితే సెమీకండక్టర్స్ కొరత ప్రభావం సేల్స్ పైన ఉంటుంది. ఉక్కు ఉత్పత్తుల ధరల కోత అంచనాలతో మెటల్, మైనింగ్ కంపెనీల షేర్లు ఒత్తిడికి గురి కావొచ్చు. కరోనా ఇలాగే విజృంభిస్తే డిమాండ్ తగ్గుతుందనే ఆందోళన నేపథ్యంలో చమురు కంపెనీల షేర్లు ప్రతికూలంగా కొనసాగవచ్చు.

కరోనా భయాలతో ముడి పదార్థాల వ్యయాలు పెరుగుతుండటం వల్ల మార్జిన్స్ పైన ప్రభావం ఉండవచ్చు. ఇటీవల ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, తాజాగా జియో టారిఫ్ పెంచిన నేపథ్యంలో టెలికం రంగ షేర్లు సానుకూలంగా కదలాడే అవకాశముంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫార్మా స్టాక్స్ మళ్లీ పుంజుకోవచ్చు.ఇక కీలక క్రిప్టో బిల్లు బిట్ కాయిన్, ఎథేరియం సహా ఈ డిజిటల్ కాయిన్స్ పైన ప్రభావం చూపుతాయి.

మద్దతు, నిరోధకం

మద్దతు, నిరోధకం

కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో సూచీలు ఈ వారం కాస్త బలహీనంగా ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు అంచనా. కరెక్షన్ ఈ వారం కూడా కొనసాగవచ్చునని చెబుతున్నారు.

ఈ వారం నిఫ్టీ 16,500 స్థాయికి వస్తే మరింత పడిపోయే అవకాశముంది. ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉందని భావిస్తే 17200 పైకి చేరుకుంటే మరింత పరుగు పెట్టే అవకాశముంది. 17400 వద్ద నిరోధకం. సెన్సెక్స్ ఈ వారం 56,500 దిగువకు పడిపోతే మరింత క్షీణించే అవకాశముందని, 58,000 పైకి చేరుకుంటే ముందుకు చేరుకోవచ్చునని అంటున్నారు.

బంగారం తగ్గుతుందా, పెరుగుతుందా

బంగారం తగ్గుతుందా, పెరుగుతుందా

గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్ ఈవారం రూ.47,900 కంటే పైకి చేరుకుంటే మరింత ముందుకు చేరుకోవచ్చునని, అయితే రూ.47,350 వద్ద మద్దతు కనిపిస్తోందని అంటున్నారు. ఇంతకంటే దిగువకు వస్తే మాత్రం రూ.46,900 వరకు పడిపోయే అవకాశాలు లేకపోలేదని, అలా కాకుండా 48,000 క్రాస్ చేసి ఆ తర్వాత 48,900ని అధిగమిస్తే రూ.50,000 సమీపానికి పరుగు పెట్టవచ్చునని అంటున్నారు. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ రూ.65,000 పైకి చేరుకుంటే రూ.66,000కు చేరుకోవచ్చు.

English summary

ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండవచ్చు? బంగారం ధర భారీగా పెరుగుతుందా? | Stock and Gold market forecast for November 29th week

By now we have established that inflationary pressure (globally) is more sticky than initially forecasted by many central banks including the Federal Reserve.
Story first published: Monday, November 29, 2021, 8:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X