ఒక వ్యక్తి లేదా సంస్థ ఆదాయంపై విధించిన పన్ను, వారి ఆదాయ లేదా లాభాలను బట్టి మారుతుంది. చట్ట ప్రకారం వ్యక్తులు లేదా సంస్థలు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను ప్రకారం మినహాయించడం లేదా వ్యక్తి పెట్టిన పెట్టుబడి స్టాండర్డ్ డిడక్షన్. స్టాండర్డ్ డిడక్షన్ అనేది స్థిర మినహాయింపు సంస్థతో ఉన్న స్థానంతో సంబంధం లేకుండా వేతనం నుండి తీయడం జరుగుతుంది.
స్థిర డబ్బు వార్షిక వేతనం నుండి తీసివేయబడుతుంది. తద్వారా పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. అప్పుడు చెల్లించే పన్ను మొత్తం తగ్గుతుంది. శాలరైడ్ లేదా పెన్షన్‌దారు స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు.

స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు
రాబోయే బడ్జెట్‌లో వేతనం పొందే పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లకు అందుబాటులో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 30 శాతం నుండి 35 శాతం పెంచనున్నట్లు ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది. అయితే పరిమిత ఆర్థిక హెడ్ రూమ్ ఇచ్చిన ఆదాయపు పన్ను స్లాబ్స్ మారకుండా ఉండవచ్చునని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.50,000గా ఉంది. అయితే దీనిని పెంచాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.
వ్యక్తిగత పన్నులపై పరిశ్రమ నుండి పలు సూచనలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఒక సాధారణ డిమాండ్ స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచడం. ముఖ్యంగా కరోనా కారణంగా వైద్య ఖర్చులు పెరిగాయని, పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకోవాలని ఆర్థికమంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఈ పెంపు 30 శాతం నుండి 35 శాతం పెంచాలనే ప్రతిపాదన ఉంది.

2019లో రూ.50,000కు పెంపు
2018లో స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000గా ఉంది. గతంలో దీని పరిమితిని 2019లో రూ.50,000కు పెంచారు. ఇప్పుడు మరోసారి దీనిని పెంచాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే తాజా పన్ను వసూళ్ల పరిస్థితిని బట్టి ప్రతిపాదన తుది ఆమోదానికి లోబడి ఉంటుందని చెబుతున్నారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు అందుబాటులో లేదు.

స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి
ప్రతి సంవత్సరం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పునఃపరిశీలించడాన్ని ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో చేయాలని బిగ్ ఫోర్ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ భాగస్వామి సుధాకర్ సేతురామ అన్నారు. పెరిగిన ద్రవ్యోల్భణం, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఖర్చులు పెరిగాయని, ఇందుకు అనుగుణంగా కనీసం 25 శాతం వరకు పెంచాలన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications