న్యూఢిల్లీ: ఆధార్ కార్డు - పాన్ కార్డును లింక్ చేశారా? మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నెల 31వ తేదీలోగా (డిసెంబర్ 31, 2019)లోగా వీటిని అనుసంధానం చేయాలి. ఇప్పటికే పలుమార్లు గడువును పొడిగించినందున మరోసారి అలాంటి అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు లోగా పాన్ - ఆధార్ కచ్చితంగా లింక్ చేసుకోవాలి.

లింక్ చేయకుంటే ఏమవుతుంది?
- పాన్ కార్డు - ఆధార్ కార్డును ఈ నెలాఖరులోగా లింక్ చేయకుంటే పాన్ కార్డు చెల్లుబాటు కాకుండా పోతుంది. పాన్ నెంబర్ ఇన్ఆపరేటివ్ లేదా ఇన్‌వ్యాలిడ్ అవుతుంది.
- ఆధార్ - పాన్ కార్డును అనుసంధానం చేయకుంటే ఆదాయపు పన్ను శాఖ ఫైలింగ్‌లోను ఇబ్బందులు తలెత్తవచ్చు.

ఆ తర్వాత లింక్ చేస్తే ఏమవుతుంది?
పాన్ - ఆధార్ లింక్ చేయకుంటే పాన్ కార్డు ఇన్ఆపరేటివ్ అవుతుందని కేంద్రం పేర్కొంది. కానీ పదానికి సంబంధించి నిర్వచనం ఇవ్వలేదు. అయితే నిపుణుల ప్రకారం... పాన్ - ఆధార్‌ను డిసెంబర్ 31వ తేదీ లోపు లింక్ చేయకుంటే పాన్ ఇన్ఆపరేటివ్ అవుతుంది. అయితే ఆ తర్వాత లింక్ చేశాక అది పని చేస్తుందా లేక మళ్లీ పాన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా తెలియాల్సి ఉంది.

పాన్ కార్డు లేనట్లేనా...
- పాన్ కార్డు, ఆధార్ లింక్ చేయకుంటే వచ్చే ఏడాది ప్రారంభం నుంచి మీకు పాన్ కార్డు లేనట్లుగా భావించే అవకాశాలు ఉంటాయని కూడా అంటున్నారు. లింక్ చేయనప్పుడు పాన్ కార్డు చెల్లుబాటు కాకుండా పోతుందని, అప్పుడు పాన్ లేని కిందకు రావొచ్చునని అంటున్నారు.
- డిసెంబర్ 31వ తేదీలోపా పాన్ - ఆధార్ లింక్ చేయకుంటే పాన్ ద్వారా ఇండివిడ్యువల్స్ ఎవరు కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయలేరని చెబుతున్నారు.
- కొందరికి ఒకటికి మించి కార్డులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వారు ఓ కార్డును లింక్ చేశాక, మిగతా కార్డులు చెల్లుబాటు కాకుండా పోవచ్చు.

హయ్యర్ ట్యాక్స్ రేట్ అవకాశం
పాన్ ఆధార్ లింక్ చేయకుంటే పాన్ కార్డు లేనట్లుగా భావించవచ్చు. దీంతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో, పన్నుల విషయంలో, ఇతర ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంశంలో మీరు పాన్ కార్డును ఉపయోగించలేరు. అప్పుడు అధిక పన్ను రేటుకు అవకాశాలు ఉంటాయి. అయితే ఇటీవల ఆధార్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. కాబట్టి ఆధార్ ద్వారా పాన్ లేకపోయినా ఆధార్ ద్వారా అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకోవచ్చా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో పాన్ లేకపోయినా ఆధార్ ఉంటే.. ఆటోమేటిక్‌గా పాన్ నెంబర్ దాఖలు చేయవచ్చుననే వార్తలు వచ్చాయి.

కొన్ని డౌట్స్..
పాన్ ఆధార్ లింక్ రూల్స్ కేంద్రం నోటిఫై చేయనందున రెండింటి అనుసంధానానికి గడువు మరోసారి పొడిగిస్తారా అనే చర్చ సాగుతోంది. కానీ దీనిపై ఆశలు పెట్టుకోకుండా అటాచ్ చేసుకోవడమే మంచిది. పాన్ బదులు అన్నిచోట్ల ఆధార్ ఉపయోగించవచ్చా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. పాన్ ఇన్ఆపరేటివ్ అయితే రెండో పాన్ ఇష్యూ చేస్తారా లేదా తెలియాల్సి ఉందని అంటున్నారు.

ఎన్నారై..
ఇండియన్ రెసిడెంట్స్ పాన్ కార్డును, ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని గల్ఫ్ న్యూస్ శుక్రవారం రిపోర్ట్ చేసింది. ఈ మేరకు పబ్లిక్ నోటీస్ ఇష్యూ అయినట్లుగా పేర్కొంది. ఎన్నారైలు భారత్ వచ్చినప్పుడు పాన్, ఆధార్ అవసరం ఏర్పడుతుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications