భారత్‌కు తిరిగివచ్చే NRIలకు భారీ Exit Tax షాక్.. తప్పించుకోవాలంటే ముందుగానే చేయాల్సినవి ఇవే..

విదేశాలలో దశాబ్దాల తరబడి శ్రమించి, తమ వృత్తిపరమైన కెరీర్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన భారతీయ నిపుణులు తిరిగి స్వదేశానికి వచ్చే సమయంలో తీవ్ర ఆర్థిక ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారు. సాధారణ పరిభాషలో దీనిని ఎగ్జిట్ టాక్స్" (Exit Tax) అని పిలుస్తున్నప్పటికీ.. ఇది కేవలం ఒక వ్యక్తి దేశం విడిచి వెళ్లే సమయంలో ప్రభుత్వం విధించే ప్రత్యక్ష పన్ను మాత్రమే కాదు. తాము పనిచేసిన దేశాలలోని సామాజిక భద్రత (Social Security), పెన్షన్ వ్యవస్థలు, పన్ను మినహాయింపులకు సంబంధించి నిర్దేశిత అర్హత కాల పరిమితిని పూర్తి చేయకముందే భారత్‌కు తిరిగొచ్చేయడం వల్ల.. వారు సంపాదించుకున్న బిలియన్ల డాలర్ల కష్టార్జితాన్ని శాశ్వతంగా కోల్పోవలసి వస్తోంది.

న్యూఢిల్లీకి చెందిన ప్రముఖ ఆర్థిక పరిశోధనా సంస్థ నికోర్ అసోసియేత్స వ్యవస్థాపకురాలు మిథాలీ నికోర్ కథనం ప్రకారం.. ఇది ఒక రకమైన వాయిదా వేయబడిన జీతం (Deferred Salary). అమెరికా వంటి అగ్రదేశాలతో భారత ప్రభుత్వానికి ఇప్పటివరకు సరైన టోటలైజేషన్ ఒప్పందం (Totalization Agreement) లేకపోవడం వల్లనే ఈ భారీ నష్టం జరుగుతోంది. కేవలం అమెరికాలోనే పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులు తగిన ఒప్పందం లేని కారణంతో ఏటా సుమారు $3.0 నుండి $3.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 25 వేల కోట్లకు పైగా) సామాజిక భద్రతా నిధులను పొందలేక కోల్పోతున్నారు.

Indians returning to India NRI returning home exit tax departure tax NRI tax planning returning Indians tax rules moving back to India overseas Indians tax NRI financial planning foreign assets tax tax planning before moving return to India planning NRI investments US exit tax Canada departure tax tax residency India Indians returning to India NRI return to India Exit Tax exit tax India NRI tax planning returning Indians tax NRI NRI ta

ప్రధాన దేశాల్లో సంక్లిష్ట పన్ను, సామాజిక భద్రతా నిబంధనలు:

యునైటెడ్ స్టేట్స్ (US): అమెరికాలో పనిచేసే ప్రతి భారతీయ ఉద్యోగి తమ ప్రతి జీతం చెక్కు నుండి 7.65 శాతం మొత్తాన్ని సోషల్ సెక్యూరిటీ వ్యవస్థకు కాంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తారు. అయితే, ఈ నిధుల నుండి ఎంతోకొంత ప్రతిఫలాన్ని పొందేందుకు కనీసం 10 సంవత్సరాల (40 త్రైమాసికాల) సుదీర్ఘ సేవా కాల పరిమితి తప్పనిసరి. పదేళ్ల కంటే ఒక్క రోజు తక్కువగా అమెరికాలో పనిచేసి భారత్‌కు వచ్చినా, ఆ విరాళాల నుండి రూపాయి కూడా తిరిగి రాదు. దీనికి తోడు నాన్-రెసిడెంట్ భారతీయులకు ఎస్టేట్ పన్ను మినహాయింపు పరిమితి కేవలం $60,000 మాత్రమే. ఇది అమెరికన్ పౌరులకు లభించే పరిమితి కంటే ఏకంగా 250 రెట్లు తక్కువ కావడం గమనార్హం.

జర్మనీ (Germany): జర్మనీ పన్ను నిబంధనల ప్రకారం.. ఒక ఉద్యోగి 60 నెలలు (5 సంవత్సరాలు) దాటకముందే దేశం విడిచి వెళితే, వారు చెల్లించిన సొంత పింఛను విరాళాలను మాత్రమే వాపసు ఇస్తారు. అదే సమయంలో యజమాని (Employer) చెల్లించే 9.3 శాతం వాటాను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేస్తుంది. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఉంటే అసలు సొంత విరాళాలు కూడా వాపసు లభించవు.

యునైటెడ్ కింగ్‌డమ్ (UK): బ్రిటన్‌లో పనిచేసే భారతీయ నిపుణులు నాన్-రెసిడెంట్‌గా మారిన మరుసటి క్షణమే వారి వ్యక్తిగత పన్ను అలవెన్సులను ఉపసంహరిస్తారు. గత 20 సంవత్సరాలలో కనీసం 10 సంవత్సరాలు యూకేలో నివసించిన వారి ప్రపంచవ్యాప్త ఆస్తులపై వారు దేశం విడిచిన తర్వాత కూడా దాదాపు ఒక దశాబ్దం పాటు 'వారసత్వ పన్ను' (Inheritance Tax) నిబంధనలు వర్తిస్తాయి.

Also Read

ఆర్థిక నష్టాలను నివారించుకోవడానికి నిపుణులు ఇస్తున్న కీలక సూచనలు:

విదేశాల నుండి భారతదేశానికి తిరిగొచ్చే ప్రణాళికను చివరి నిమిషంలో కాకుండా.. నాలుగైదు సంవత్సరాల ముందే సిద్ధం చేసుకోవాలని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు.

1. రికార్డులు భద్రపరచడం: అమెరికాలో ఐదేళ్ల పన్ను సర్టిఫికేషన్ లేదా FBAR నివేదికలను సక్రమంగా సమర్పించకపోతే ఉద్యోగులను 'కవర్డ్ ఎక్స్‌పాట్రియేట్స్‌'గా పరిగణించి భారీ జరిమానాలు విధిస్తారు. కాబట్టి విదేశాల్లో ఉన్నప్పుడే పనిదినాల రికార్డులు, వెస్టింగ్ హిస్టరీ, పన్ను రిటర్నుల దస్త్రాలను పక్కాగా సేకరించాలి.

2. అధికారిక నివాస హోదా ముగింపు: స్వదేశానికి వచ్చే సంవత్సరంలోనే అమెరికాలో ఫారమ్ I-407, యూకేలో P85 లేదా SA109 దాఖలు చేసి నివాస హోదాను ముగించాలి. భారతదేశ పన్ను సంవత్సరానికి (ఏప్రిల్-మార్చి) అనుగుణంగా జనవరి నుండి మార్చి మధ్య భారత్‌లో అడుగుపెడితే, 'RNOR' (Resident but Not Ordinarily Resident) హోదాను పొంది విదేశీ ఆదాయంపై మూడేళ్ల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

3. ఖాతాల పునర్వ్యవస్థీకరణ: భారత్‌కు రాగానే NRE, NRO ఖాతాలను సాధారణ సేవింగ్స్ ఖాతాలుగా మార్చాలి. విదేశీ ఆస్తులు మరియు నిధులను $250,000 రెమిటెన్స్ పరిమితికి వెలుపల చట్టబద్ధంగా ఉంచడానికి 'RFC' (Resident Foreign Currency) ఖాతాను తెరవాలి. విదేశీ రిటైర్మెంట్ ఫండ్స్‌పై భారతీయ పన్నును వాయిదా వేయడానికి ఐటి చట్టంలోని సెక్షన్ 158 ను సద్వినియోగం చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+