For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC Share Today: నేడు లాభపడినా స్వల్పమే, కొనుగోలు చేయవచ్చా?

|

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) స్టాక్ నేడు స్వల్ప లాభాల్లో కొనసాగుతోంది. నిన్న స్టాక్ మార్కెట్‌లో ఎల్ఐసీ లిస్టింగ్ నిరాశపరిచింది. కోట్లాదిమంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ భారీ ఆశలతో దరఖాస్తు చేసుకున్న ఇన్వెస్టర్లకు నిరాశ తప్పలేదు. లిస్టింగ్ గెయిన్స్ కోసం బిడ్స్ దాఖలు వారికి షాకిచ్చింది. ఈ షేర్ ధర రూ.949తో పోలిస్తే 8.11 శాతం క్షీణించి రూ.872 వద్ద లిస్ట్ అయింది. చివరకు రూ.875 వద్ద ముగిసింది. నేడు లాభాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ, అది కూడా స్వల్పమే.

క్రితం సెషన్‌లో ఎల్ఐసీ రూ.875 వద్ద ముగిసింది. నేడు రూ.885.55 వద్ద ప్రారంభమై, రూ.891 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ.876 వద్ద కనిష్టాన్ని తాకింది. ఇప్పటికీ లిస్టింగ్ రూ.949తో పోలిస్తే ఎల్ఐసీ స్టాక్ చాలా దూరంలో ఉంది. పాలసీదారులు, రిటైల్ ఇన్వెస్టర్లకు కాస్త డిస్కౌంట్ వచ్చింది కాబట్టి స్వల్ప నష్టాలతో సరిపెట్టుకున్నారు. నిన్న నష్టాల్లో లిస్ట్ అయిన స్టాక్, నేడు మధ్యాహ్నం గం.12.40 సమయానికి 0.46 శాతం లాభపడి రూ.879.30 వద్ద ట్రేడ్ అయింది.

LIC Share Today: Should new investors buy LIC stcock on dip?

ఎల్ఐసీ లిస్టింగ్‌లో నిరాశపరిచినప్పటికీ, లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్స్‌ను అట్టిపెట్టుకోవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటలో ఉన్న ప్రస్తుత సమయంలో ఎల్ఐసీ ఐపీవో వచ్చిందని, అందుకే ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. షార్ట్ టర్మ్ అంశాన్ని పక్కన పెడితే లాంగ్ టర్మ్ కోసం అట్టిపెట్టుకోవచ్చునని చెబుతున్నారు. ప్రస్తుత డిప్ సమయంలోను లాంగ్ టర్మ్ కోసం కొనుగోలు చేయవచ్చునని చెబుతున్నారు.

English summary

LIC Share Today: నేడు లాభపడినా స్వల్పమే, కొనుగోలు చేయవచ్చా? | LIC Share Today: Should new investors buy LIC stcock on dip?

Disappointing thousands of investors, the share of LIC made a lackluster debut on the stock market.
Story first published: Wednesday, May 18, 2022, 12:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X