పన్ను చెల్లింపుకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేయడంతో పాటు ఏవైనా సమస్యలు ఉంటే ఇబ్బందులు తొలగించే ప్రక్రియను ఆదాయ పన్ను శాఖ ఎప్పటిప్పుడు పరిష్కరిస్తోంది. తాజాగా పన్ను చెల్లింపుదారులకు మరో శుభవార్త. పన్ను చెల్లింపుల్లో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు మరో కొత్త సౌకర్యాన్ని తీసుకు వచ్చింది ఆదాయ పన్ను శాఖ.
మధ్యవర్తుల జోక్యం లేకుండా పన్ను చెల్లించేలా ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ పథకాన్ని 2020 ఆగస్ట్ 13వ తేదీన ఐటీ శాఖ ప్రారంభించింది. కానీ వాస్తవంలో ఫేస్‌లెస్ ద్వారా ఇన్‌కం ట్యాక్స్ ఫైల్ చేసే సమయంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి.

అందుకే ప్రత్యేక ఈ మెయిల్ ఐడీ
ట్యాక్స్ ఫైల్ చేసే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు తప్పనిసరి పరిస్థితుల్లో కార్యాలయాలకు వస్తున్నారు. దీంతో ఫేస్‌లెస్ పథకం ప్రయోజనాలు పన్ను చెల్లింపుదారులు పొందలేకపోతున్నారు. ఫేస్‌లెస్ ఐటీ ఫైలింగ్‌లో ఇబ్బందుల దృష్ట్యా వాటితో పాటు ఇతర ఫిర్యాదుల కోసం ఐటీ శాఖ మూడు అధికారిక ఈ-మెయిల్స్ ఐడీలను శనివారం విడుదల చేసింది.
ఈ మేరకు ఐటీ డిపార్టుమెంట్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తన సందేశాన్ని విడుదల చేసింది.
పన్ను చెల్లింపుదారుల సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో, పన్ను చెల్లింపుదారుల చార్టర్‌కు అనుగుణంగా, ఆదాయ పన్ను శాఖ కింద ఉన్న పెండింగ్ కేసులకు సంబంధించి ఫిర్యాదులను నమోదు చేయడానికి ప్రత్యేక ఈమెయిల్ ఐడీలను సృష్టించినట్లు తెలిపింది.

మూడు మెయిల్స్ ఇవే
ఐటీ శాఖ విడుదల చేసిన మూడు ప్రత్యేక ఈ-మెయిల్ ఐడీలు ఇవే.
- ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ కోసం [email protected]
- ఫేస్‌లెస్ పెనాల్టీ కోసం [email protected]
- ఫేస్‌లెస్ అప్పీల్స్ కోసం [email protected]

కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు
ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ సిస్టం కింద ట్యాక్స్ పేయర్ లేదా అసెసీ ఐటీ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. లేదా ఆదాయ పన్ను సంబంధిత డిపార్టుమెంట్ అధికారిని కూడా కలవాల్సిన అవసరం లేదు. సెంట్రల్ ఎలక్ట్రానిక్ ఆధారిత సిస్టం రిస్క్ పారామీటర్స్, మిస్‌మ్యాచెస్ ఆధారంగా పరిశీలన కోసం పన్నురిటర్న్స్‌ను ఎంచుకుంటుంది. ఆ తర్వాత ఏ నగరంలో అయినా ఐటీ అధికారుల బృందానికి రాండంగా కేటాయిస్తుంది. అధికారులు దీనిని పరిశీలిస్తారు.కేంద్రం ఈ పథకాన్ని 2019లో తీసుకు వచ్చింది.

రెండు రకాల పన్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఉంది. గడువు పొడిగించినప్పటికీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. ప్రస్తుత మదింపు సంవత్సరం (2021-22)లో పన్ను చెల్లింపుదారులు రెండు రకాల పద్ధతుల్లో ఒకటి ఎంచుకొని, రిటర్న్స్ సమర్పించేందు వీలుంది. చాలామంది పాత పద్ధతి వైపే మొగ్గు చూపుతున్నారు. సెక్షన్ 80సీ, 80డీ, 80ఈ ఇలా పలు సెక్షన్ల కింద మినహాయింపు పోగా, పన్నువర్తించే మొత్తానికి నిర్ణీత స్లాబ్స్ మేరకు పన్ను చెల్లించాలి.
- రూ.2,50,000 లోపు ఆదాయానికి పన్ను లేదు.
- రూ.2,5,000 లక్షల నుండి రూ.5,00,000 వరకు 5 శాతం పన్ను వర్తిస్తుంది.
- రూ.5 లక్షల నుండి రూ.10,00,000 లక్షల వరకు 20 శాతం పన్ను వర్తిస్తుంది.
- రూ.10,00,000 పైన 30 శాతం పన్ను వర్తిస్తుంది.
కొత్త పన్ను విధానానికి వస్తే వ్యక్తులు, HUF కొత్త పన్నుల విధానాన్ని ఎంచుకోవచ్చు. ఈ పద్ధతి ప్రకారం....
- రూ.2,50,000 లోపు ఆదాయానికి పన్ను లేదు.
- రూ.2,5,000 లక్షల నుండి రూ.5,00,000 వరకు 5 శాతం పన్ను వర్తిస్తుంది.
- రూ.5 లక్షల నుండి రూ.7,50,000 లక్షల వరకు 20 శాతం పన్ను వర్తిస్తుంది.
- రూ.7,50,000 నుండి రూ.10,00,000 పైన 15 శాతం పన్ను వర్తిస్తుంది.
- రూ.10,00,000 నుండి రూ.12,50,000 పైన 15 శాతం పన్ను వర్తిస్తుంది.
- రూ.12,50,000 నుండి రూ.15,00,000 పైన 15 శాతం పన్ను వర్తిస్తుంది.
- రూ.15,00,000కు పైన 30 శాతం పన్ను వర్తిస్తుంది.

పన్ను విధానం..
ఏ పన్ను విధానాన్ని ఎంచుకుంటున్నామనే అంశాన్ని ఉద్యోగులు... యాజమాన్యానికి ముందుగానే వెల్లడించాలి. ముందుగా వెల్లడించకపోయినప్పటికీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసుకునే సమయంలో పన్ను విధానాన్ని ఎంచుకునే వెసులుబాటును ఆదాయ పన్ను శాఖ కల్పిస్తుంది. రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో కొత్త విధానం, పాత విధానాల్లో దేనిని ఎంచుకుంటారనేది ప్రశ్న.
సెక్షన్ 80C, సెక్షన్ 80D, ఇంటి అద్దె, హోమ్ లోన్ వడ్డీ వంటివి క్లెయిమ్ చేసుకోవద్దు అని భావిస్తే కొత్త విధానంలోకి వెళ్లడం మంచిది. లేదా అన్ని సెక్షన్ల మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే పాత విధానం ఎంచుకోవాలి. రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో ముందుగా పాత విధానంలో పన్నుగణన పూర్తి చేయాలి.
ఎంత మేరకు రిఫండ్ లేదా పన్ను చెల్లించాల్సి వస్తుందనేది చూసుకోవాలి. ఆ తర్వాత కొత్త పన్ను విధానంలో ఎంత వ్యత్యాసం ఉందో తెలుసుకోవడం ముఖ్యం. దీనిని బట్టి ఏ విధానం ప్రయోజనకరమో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మీకు అనువైన పద్ధతిలో రిటర్నుల సమర్పణను పూర్తి చేయాలి.
More From GoodReturns

పెళ్లయిన దంపతులు వేర్వేరుగా పన్ను దాఖలు చేయడమెందుకు.. పార్లమెంటులో గళమెత్తిన రాఘవ్ చద్దా..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications