For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Prices Today: అందుకే బంగారం పరుగు, ఏ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు?

|

బంగారం ధరలు తగ్గడం లేదు. నిన్నటి సెషన్‌లో స్థిరంగా ఉన్నప్పటికీ నేడు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. దీపావళి-ధనతెరాస్ తర్వాత పసిడి ధరలు భారీగా పెరిగాయి. రూ.47,000 స్థాయిలో ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.49,400ను సమీపించింది. ప్రస్తుతం బంగారం ధర ఐదు నెలల గరిష్టం వద్ద ఉంది. వెండి రూ.67,000కు సమీపంలో ఉంది. అంతర్జాతీయంగా ద్రవ్యోల్భణ ఆందోళనల నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. పసిడి ధరలు ఈ వారం కూడా ముందుకు కదలుతాయని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా.

అందుకే బంగారానికి రెక్కలు

అందుకే బంగారానికి రెక్కలు

అంతర్జాతీయంగా ఈ ఏడాది ద్రవ్యోల్భణం మరింత పెరుగుతుందని ఆందోళనలు ఉన్నాయి. దీంతో నిన్న దాదాపు స్థిరంగా ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ నేడు మళ్లీ పెరుగుతోంది. గతవారం పసిడి ఫ్యూచర్స్ జూన్ గరిష్టానికి చేరుకున్నాయని, అయితే ఇటీవల వివిధ అంశాల ప్రభావంతో ఈ వారం ప్రారంభంలో స్థిరంగా కొనసాగిందని, బంగారం డిమాండ్ పెరుగుతుండటంతో ధరలు కూడా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. దీనికి ద్రవ్యోల్భణ ఆందోళనలు, ఈక్విటీలో ఊగిసలాటలు కలిసి వస్తున్నాయని అంటున్నారు.

మద్దతు ధర

మద్దతు ధర

ఎంసీఎక్స్‌లో గోల్డ్ మద్దతు ధర రూ.49,100-రూ.48,900, నిరోధకస్థాయి రూ.49,550-49,750, వెండి మద్దతు ధర రూ.66,150-65,760, నిరోధకస్థాయి రూ.67,250-67,750.

బంగారాన్ని రూ.49,100 సమీపంలో వద్ద రూ.48,800 స్టాప్ లాస్, రూ.49,700 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. వెండిని రూ.66,200 వద్ద రూ.65,500 స్టాప్ లాస్‌తో, రూ.67,200 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

బంగారం ధరలు

బంగారం ధరలు

నేడు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్ రూ.97.00 (0.20%) పెరిగి రూ.49395.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.87.00 (0.18%) లాభపడి రూ.49581.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.353.00 (0.53%) ఎగిసి రూ.66916.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.299.00 (0.44%) ఎగిసి రూ.67794.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1870 డాలర్లకు చేరుకుంది. నేటి సెషన్‌లో దాదాపు మూడు డాలర్లు లాభపడి 1,869.45 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.137 డాలర్లు ఎగిసి 25.242 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

నిన్న ముగింపు ధరలు..

నిన్న ముగింపు ధరలు..

బంగారం ధరలు క్రితం సెషన్‌లో స్థిరంగా ముగిశాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.12.00 (-0.02%) క్షీణించి రూ.49302.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1.00 (-0.00%) తగ్గి రూ.49507.00 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.500కు పైగా తగ్గింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.534.00 (-0.80%) తగ్గి రూ.66610.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.519.00 (-0.76%) క్షీణించి రూ.67455.00 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 1,866.60 డాలర్లు, సిల్వర్ ఫ్యూచర్స్ 25.105 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.

English summary

Gold Prices Today: అందుకే బంగారం పరుగు, ఏ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు? | Gold rate today: bullion rates may move sideways to up this week

Gold prices held steady at their five-month peaks on Tuesday after a strong up move in the previous session. Concerns over broadening inflationary risks kept bullion's safe-haven appeal intact in the face of a stronger US dollar and elevated bond yields.
Story first published: Tuesday, November 16, 2021, 11:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X