For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 రోజుల్లో రూ.400కు పైగా పెరిగిన బంగారం ధర: రూ.67,000 దిశగా... కొనుగోలు చేయవచ్చా?

|

కరోనా నేపథ్యంలో మార్చి నుండి వేగంగా పెరిగిన పసిడి ధరలు ఆగస్ట్ రెండో వారం నుండి క్షీణించి, రెండు నెలలుగా దాదాపు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి రూ.49వేల పైన నుండి రూ.53వేల దిగువన తచ్చాడుతోంది. అక్షయ తృతీయ, ధనత్రయోదశి వంటి పర్వదినాల్లో పసిడి కొనుగోలును చాలామంది శుభంగా భావిస్తారు. ఈ ధనత్రయోదశి, దీపావళి సమయంలో కూడా బంగారం సేల్స్ పెరుగుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో ఇప్పటికే తగ్గిన ధరలు వ్యాక్సీన్ ప్రకటన వచ్చాక మరింతగా తగ్గుతుందని భావించే వారు ఉన్నారు. అయితే సమీప కాలంలో తగ్గినప్పటికీ, పసిడి ధర 10 గ్రాములు రూ.67వేలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

దీర్ఘకాలంలో రూ.65,000 నుండి రూ.67,000

దీర్ఘకాలంలో రూ.65,000 నుండి రూ.67,000

సమీప కాలంలో అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో పసిడి 1,880 - 1840, డాలర్ల మధ్యకు పడిపోవచ్చునని, ర్యాలీ 1940 - 1975 డాలర్ల పరిధిలో ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ మార్కెట్లో రూ.49,500 - రూ.48,500 మధ్యకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని, ఈ స్థాయిలో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. ప్రస్తుతం రూ.52,000 - 53,000 మధ్య కనిపిస్తోంది. దీర్ఘకాలంలో మాత్రం పసిడి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 2500 డాలర్లు, దేశీయ మార్కెట్లో రూ.65,000 నుండి రూ.67,000 మధ్య ఉండవచ్చునన చెబుతున్నారు.

రెండు రోజుల్లో రూ.400కు పైగా పెరిగిన పసిడి

రెండు రోజుల్లో రూ.400కు పైగా పెరిగిన పసిడి

నేడు (నవంబర్ 13) పసిడి ధరలు దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ప్రారంభ సెషన్లో 50.00 (0.10%) పెరిగి రూ.50,650.00 వద్ద ట్రేడ్ అయింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.74.00 (0.15%) పెరిగి రూ.50,747.00 వద్ద ట్రేడ్ అయింది. పసిడి రెండు రోజుల్లో రూ.430కి పైగా పెరిగింది.

సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం తగ్గింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.139.00 (-0.22%) క్షీణించి రూ.62,600.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.107.00 (-0.17%) తగ్గి రూ.64350.00 వద్ద ట్రేడ్ అయింది.

నిన్న డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.381.00 (0.76%) పెరిగి రూ.రూ.50,550.00 వద్ద ముగిసింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.413.00 (0.82%) పెరిగి రూ.50650.00 వద్ద క్లోజ్ అయింది.

సిల్వర్ ఫ్యూచర్స్ డిసెంబర్ రూ.రూ.176.00 (0.28%) పెరిగి రూ.62717.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.194.00 (0.30%) పెరిగి రూ.64426.00 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో పసిడి ధరలు పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ డిసెంబర్ 0.14 శాతం పెరిగి ఔన్స్ 1,875.95 డాలర్లు, సిల్వర్ ఫ్యూచర్స్ 0.07 శాతం క్షీణించి 24.290 డాలర్లు పలికింది.

క్రితం సెషన్లో బంగారం 1,873.30 డాలర్ల వద్ద క్లోజ్ కాగా, 1,872.30 - 1,880.85 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.

వెండి 24.227 - 24.442 డాలర్ల మధ్య ట్రేడ్ అయి, 24.306 డాలర్ల వద్ద ముగిసింది.

English summary

2 రోజుల్లో రూ.400కు పైగా పెరిగిన బంగారం ధర: రూ.67,000 దిశగా... కొనుగోలు చేయవచ్చా? | Gold Prices Today: Analysts see price hitting Rs 67,000

With accommodative global central bank policies and stimulus, analysts expect gold prices to do well going ahead.
Story first published: Friday, November 13, 2020, 10:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X