For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్థిరంగా బంగారం ధరలు, రూ.500 పెరిగిన వెండి: ఈ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు!

|

ముంబై: దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మంగళవారం (అక్టోబర్ 27) స్వల్పంగా పెరిగాయి. పసిడి రూ.51వేల మార్క్ వద్ద తచ్చాడుతోంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5,000 పైగా తక్కువ పలుకుతోంది. కరోనా నేపథ్యంలో మార్చి నుండి ఆగస్ట్ వరకు పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఈ కాలంలో రూ.15వేలకు పైగా పెరిగింది.

ఆగస్ట్ రెండో వారం నుండి తిరిగి క్షీణించాయి. ఇప్పుడు రూ.49వేల పై నుండి రూ.52 దిగువన పలుకుతోంది. పండుగ సమయంలో ఆల్ టైమ్ గరిష్టం నుండి రూ.5వేలు తక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. నెల రోజులకు పైగా పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి.

ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, కేంద్రం ఆ కీలక నిర్ణయంతోను తగ్గేది అంతంతే?ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, కేంద్రం ఆ కీలక నిర్ణయంతోను తగ్గేది అంతంతే?

బంగారం హెచ్చుతగ్గులు

బంగారం హెచ్చుతగ్గులు

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో మధ్యాహ్నం గం.1 సమయానికి 10 గ్రాముల డిసెంబర్ ఫ్యూచర్స్ 0.01 శాతం పెరిగి రూ.50,934 పలికింది. రూ.51,065 వద్ద ప్రారంభం కాగా, రూ.51,114 వద్ద నేటి గరిష్టాన్ని, రూ.50,901 వద్ద కనిష్టాన్ని తాకింది. రూ.50,900 వద్ద ట్రేడ్ అయింది.

ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. 0.03 శాతం క్షీణించి రూ.51,050 పలికింది. రూ.51,210 ప్రారంభం కాగా, గరిష్ట ధర అదే. కనిష్టం రూ.51,050.

వెండి ధర పెరుగుదల

వెండి ధర పెరుగుదల

బంగారం ధరల్లో పెద్దగా మార్పులేదు. కానీ వెండి ధర పెరిగింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.510 (0.82 శాతం) పెరిగి రూ.62,416 పలికింది. రూ.62,341 వద్ద ప్రారంభమైన ధర, రూ.62,580 వద్ద గరిష్టాన్ని, రూ.62,312 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి మార్చి ఫ్యూచర్స్ రూ.395 (0.62 శాతం) పెరిగి కిలో రూ.64,150 పలికింది. రూ.64,137 వద్ద ప్రారంభం కాగా, రూ.64,250 వద్ద గరిష్టాన్ని, రూ.64,040 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లోను....

అంతర్జాతీయ మార్కెట్లోను....

అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధర స్వల్పంగా పెరిగింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.02 శాతం పెరిగి 1,906.15 డాలర్లు పలికింది. 1,903.45 - 1,912.95 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1905.70 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఈ ఏడాది పసిడి ధర 24 శాతానికి పేగా ఎగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.71 శాతం లాభపడి ఔన్స్ 24,593 డాలర్లు పలికింది. 24.367 - 24.733 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.420 డాలర్లు పలికింది. ఈ ఏడాది వెండి ధర 36 శాతం పెరిగింది.

రూ.50,600 వద్ద కొనుగోలు చేయవచ్చు

రూ.50,600 వద్ద కొనుగోలు చేయవచ్చు

ఎంసీఎక్స్‌లో పసిడి మద్దతు ధర రూ.50,780-50,600. నిరోధకస్థాయి రూ.51,050-51,200. వెండి మద్దతు ధర రూ.61,300-60,800. నిరోధకస్థాయి రూ.62,500-63,300గా ఉండవచ్చు. పసిడి ధరలు రూ.50,600 వద్ద, వెండ రూ.61,300 వద్ద ఉంటే స్వల్ప కాలానికి గాను బంగారాన్ని కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

English summary

స్థిరంగా బంగారం ధరలు, రూ.500 పెరిగిన వెండి: ఈ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు! | Gold prices higher but down Rs 5,000 from record highs

Gold and silver prices edged higher in Indian markets today amid advance in global rates of the precious metals. On MCX, December gold futures rose 0.28% to ₹51,073 per 10 gram while silver futures gained 1% to ₹62496 per kg.
Story first published: Tuesday, October 27, 2020, 13:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X