For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెలన్నరలో రూ.4,000 తగ్గిన బంగారం, ఎందుకిలా? రూ.45,000కు పడిపోతుందా?

|

దేశీయ ఫ్యూచర్, రిటైల్ మార్కెట్లో బంగారం ధరలు గతవారం భారీగా క్షీణించాయి. క్రితం వారం చివరి సెషన్‌లో ధరలు పెరిగినప్పటికీ, ఎనిమిది నెలల కనిష్టానికి పతనమయ్యాయి. బంగారం కొనుగోలు చేసేందుకు ఇది సరైన సమయంగా బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. మున్ముందు మరింత క్షీణించినప్పటికీ, భారీగా ఉండకపోవచ్చునని, కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. ఇటీవల ధరలు తగ్గుతుండటంతో మరింత తగ్గవచ్చునని కొంతమంది వేచి చూస్తున్నారు. ఐతే పెట్టుబడుల కోసం సరైన సమయమని చెబుతున్నారు.

భారత్‌లో బిట్‌కాయిన్ ATM: బెంగళూరు కోర్టులో వారిద్దరికి ఊరటభారత్‌లో బిట్‌కాయిన్ ATM: బెంగళూరు కోర్టులో వారిద్దరికి ఊరట

1991 తర్వాత వరస్ట్

1991 తర్వాత వరస్ట్

ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే పసిడి ధరలు రూ.10వేల వరకు తక్కువగా ఉంది. 2021 కొత్త ఏడాదిలోనే అంటే ఈ నెలన్నర కాలంలో రూ.4,000 వరకు పతనమైంది. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్ ఏడాది ప్రారంభంలో రూ.50,000 పైన ఉంది. ఇప్పుడు రూ.46,400 వద్ద ఉంది. 1991 తర్వాత ఓ ఏడాది ప్రారంభంలో ఇంత తక్కువ సమయంలో ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారి అని నివేదికలు చెబుతున్నాయి.

రూ.45,000 స్థాయికి వచ్చే అవకాశం!

రూ.45,000 స్థాయికి వచ్చే అవకాశం!

గతవారంలో మొత్తంగా తగ్గిన ధరలు, రెండుసెషన్లుగా పెరుగుతున్నప్పటికీ, అది స్వల్పంగా మాత్రమే. ఇప్పటికీ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.10వేల వరకు తక్కువగా ఉంది. పసిడి ధరలు కొద్ది నెలల్లో పరిస్థితులను బట్టి రూ.45,000 స్థాయికి పోయినా ఆశ్చర్యం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గతవారం ఇప్పటికే ఓ సమయంలో రూ.46,000 దిగువకు వచ్చింది.

బంగారం ధర తగ్గడానికి కారణాలెన్నో

బంగారం ధర తగ్గడానికి కారణాలెన్నో

బంగారం ధరలు తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందులో కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో పాటు మరిన్ని పసిడిపై ఒత్తిడిని తగ్గించాయి. బెంచ్‌మార్క్ అమెరికా ట్రెజరీ యీల్డ్స్ దాదాపు ఏడాది గరిష్టానికి చేరుకున్నాయి. అధిక దిగుబడులు ఆర్థిక దృక్పథం మెరుగ్గా ఉందని సంకేతాలివ్వడంతో పాటు పెరిగిన ద్రవ్యోల్భణం, వడ్డీ రేటు పెంపు అంచనాలను సూచిస్తుంది.

ఈటీఎఫ్ ఔట్ ఫ్లో నేపథ్యంలో బంగారంపై ఇన్వెస్టర్ల అనాసక్తి కనిపిస్తోంది. బంగారం ర్యాలీకి ఈటీఎఫ్ కొనుగోళ్లు సంకేతం. అదే సమయంలో ఇటీవలి కాలంలో బిట్ కాయిన్ డిజిటల్ గోల్డ్‌గా మారింది. బిట్ కాయిన్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు అటువైపు కూడా చూస్తున్నారు.

English summary

నెలన్నరలో రూ.4,000 తగ్గిన బంగారం, ఎందుకిలా? రూ.45,000కు పడిపోతుందా? | Gold prices down ₹4,000 this year, may tank below Rs 45,000!

Gold prices in India fell ₹1,100 or 2.3% this week, extending this year's fall. On Friday, gold futures on MCX settled flat ₹46190 per 10 gram, taking its year-to-date decline to about ₹4,000 per 10 gram. When compared with last year's high of ₹56,200, gold is down about ₹10,000 per 10 gram. According to Bloomberg, as of Thursday, gold’s start to this year was the worst since 1991.
Story first published: Monday, February 22, 2021, 13:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X