తగ్గిన బంగారం, వెండి ధరలు: 1900 డాలర్ల దిగువకు...
ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు గతవారం స్వల్పంగా క్షీణించాయి. తాజా ప్రభుత్వ ఆర్థిక ఉద్దీపన ప్రణాళికలో కదలిక కనిపించకపోవడంతో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరించారు. పసిడిపై ఒత్తిడి పెరగలేదు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర డాలర్ బలపడటం, క్షీణతపై కూడా ఆధారపడి ఉంటుంది. గతవారం డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.20 శాతం క్షీణించి 1,905 డాలర్ల వద్ద ముగిసింది. కరోనా నేపథ్యంలో ఇటీవల పసిడి ధరలు తగ్గినప్పటికీ, 2020లో మొత్తానికి భారీగా పెరిగాయి.

1900 డాలర్ల దిగువన
బంగారం ధరలు ఈ వారం ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని బిలియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 1900 డాలర్లకు దిగువనే ఒత్తిడికి గురి కావొచ్చునని భావిస్తున్నారు. అమెరికా ఆర్థిక ప్యాకేజీపై డైలమా నేపథ్యంలో గోల్డ్ ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

బంగారం, వెండి డౌన్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ప్రారంభ సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ డిసెంబర్ 10గ్రాములు రూ.167(0.33 శాతం) తగ్గి రూ.50,672.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,690.00 ధర రూ.50,700.00 గరిష్టాన్ని, రూ.50,660.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఫిబ్రవరి ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా పెరిగి రూ.50,930 పలికింది.
వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.700 (1.12 శాతం) క్షీణించి కిలో రూ.61,750.00 పలికింది. రూ.61,720.00 ప్రారంభమై రూ.61,769.00 గరిష్టాన్ని తాకి, రూ.61,566.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1900 డాలర్ల దిగువకు..
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధర క్షీణించింది. 1900 డాలర్ల దిగువ ట్రేడ్ అయింది. 0.35 శాతం క్షీణించి 1898.45 డాలర్లు పలికింది. 1,892.60 - 1,906.30
డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 1905 డాలర్లు పలికింది.
వెండి ఔన్స్ 1.20 శాతం క్షీణించి 24,380 డాలర్లు పలికింది. 24.247 - 24.740 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 24,672 డాలర్ల వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications