For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాఫిట్ బుకింగ్ చేయాలా, బంగారం ధరలు ఎలా ఉండవచ్చు?

|

గతవారం స్టాక్ మార్కెట్లు స్వల్పలాభాల్లో ముగిశాయి. చివరి సెషన్‌లో సూచీలు నష్టపోయినప్పటికీ సెన్సెక్స్ 59,000 పాయింట్లను నిలబెట్టుకుంది. ఈ వారం స్టాక్ మార్కెట్‌తో పాటు బిలియన్ మార్కెట్ పైన వివిధ అంశాలు ప్రభావం చూపనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రికవరీ వేగంగా ఉండటం, కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ వేగవంతం, ఫెడ్ నిర్ణయాలు సహా పలు అంశాలు స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్ పైన ప్రభావం చూపనున్నాయి. ఫెడ్ రిజర్వ్ నిర్ణయాల నేపథ్యంలో ఈ వారం ప్రాఫిట్ బుకింగ్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ రిజర్వ్ తీసుకోబోయే నిర్ణయం సహా అంతర్జాతీయ ట్రెండ్స్ ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయి. ప్రస్తుతం మార్కెట్లు గరిష్టం వద్ద ఉన్నాయి. దీంతో కరెక్షన్ ఉండవచ్చునని, ట్రెండ్ మాత్రం కాస్త సానుకూలంగానే ఉందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో షార్ట్ పొజిషన్ కంటే రెగ్యులర్ ఇంటర్వెల్‌లో లాభాల స్వీకరణ మంచిదని చెబుతున్నారు. గత శుక్రవారం మార్కెట్లు నష్టాల్లో ముగిసిన అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

ప్రాఫిట్ బుకింగ్‌కు అవకాశం

ప్రాఫిట్ బుకింగ్‌కు అవకాశం

సూచీలు గతవారం ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. చివరలో నష్టపోయినప్పటికీ గరిష్టం వద్దే ఉన్నాయి. దీంతో ప్రాఫిట్ బుకింగ్‌కు అవకాశం ఉందని చెబుతున్నారు. చివరి సెషన్‌లో ప్రాఫిట్ బుకింగ్ కారణంగానే కాస్త వెనక్కి తగ్గాయి. నేడు కూడా కొనసాగుతుందని అంచనా. నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో ఉంటే 17,700 నుండి 17,800 వద్ద నిరోధస్థాయి ఉండవచ్చు. ఒకవేళ ఏదైనా డౌన్ ట్రెండ్‌ను కనబరిస్తే 17,450 నుండి 17,250 వద్ద మద్దతు స్థాయి ఉంటుంది. నిఫ్టీ గతవారం 17,269 పాయింట్ల నుండి 17,793 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు 216 పాయింట్ల లాభంతో 17,585 వద్ద ముగిసింది. ఈ వారంలో 17,275 పాయింట్ల కంటే దిగువకు వస్తే స్వల్పకాలంలో మరింత కిందకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. నిఫ్టీ బ్రేకౌట్ స్థాయి 17,875, బ్రేక్ డౌన్ 17,275, నిరోధకస్థాయి 17,800. మద్దతుస్థాయి 17,350. నిఫ్టీ 17,850 పాయింట్లను అధిగమిస్తే 18,000 దిశగా సాగవచ్చునని చెబుతున్నారు. సెన్సెక్స్ ఇమ్మీడియేట్ సపోర్ట్ 58,215, 57,760. నిరోధకస్థాయి 59,700, 60,300.

ఈ రంగాలు అదరగొట్టేనా

ఈ రంగాలు అదరగొట్టేనా

ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే అమెరికా ఫెడ్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం నుండి ఇన్వెస్టర్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. వడ్డీ రేటు, బాండ్స్ కొనుగోలులో కోతలపై ఏదైనా ప్రతికూల వార్తలు వస్తే మాత్రం లాభాల స్వీకరణ జరగవచ్చునని చెబుతున్నారు. ఔషధ కంపెనీల షేర్లు కాస్త స్తబ్దుగా ఉండవచ్చునని, చమురు స్టాక్స్ స్థిరీకరణ దిశగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇటీవల టెలికం రంగానికి భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో ఈ స్టాక్స్ మరింత ముందుకు సాగవచ్చు. బ్యాడ్ బ్యాంకు పైన ప్రభుత్వం కదలికలు బ్యాంకింగ్ స్టాక్స్‌కు ప్రయోజనం కలిగించే అంశమే. ఆటో రంగానికి ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ స్కీంతో పరుగు కొనసాగవచ్చు. ఆర్థిక రికవరీ కూడా ఎఫ్ఎంసీజీ రంగానికి ఊతమిచ్చే అంశమే.

బంగారం ధరలు..

బంగారం ధరలు..

గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్ ఈవారం రూ.45,430 కంటే దిగువన వస్తే రూ.45,152 వద్ద, రూ.44,870 వరకు కరెక్షన్‌కు గురి కావొచ్చునని భావిస్తున్నారు. అందుకే తక్కువ రిస్క్‌తో ట్రేడ్ చేసే వాళ్లు రూ.45,150 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని రూ.45,430కి పైన లాంగ్ పొజిషన్లకు మొగ్గు చూపొచ్చు. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్ ఈవారం రూ.61,880కు పైన కదలాడితే రూ.62,480, రూ.64,960కి చేరుకోవచ్చునని అంచనా.

English summary

ప్రాఫిట్ బుకింగ్ చేయాలా, బంగారం ధరలు ఎలా ఉండవచ్చు? | Gold and market forecast this week: Profit booking, Fed meet outcome to impact

Profit booking, Fed meet outcome to impact indian stock market and gold market this week
Story first published: Monday, September 20, 2021, 9:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X