For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోల్డ్ ఈజ్ మనీ ఆఫ్ కింగ్స్: ఈ బ్యాంకుల్లో గోల్డ్ లోన్ వడ్డీ రేటు చాలా తక్కువ

|

ఎవరికైనా అత్యవసరంగా డబ్బులు కావాలంటే పర్సనల్ లోన్ లేదా గోల్డ్ లోన్‌ను ఎంచుకుంటారు. పర్సనల్ లోన్ అసురక్షిత (అన్-సెక్యూర్డ్) లోన్ కాబట్టి వడ్డీ రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. అదే బంగారంపై రుణం తీసుకుంటే సురక్షిత పెట్టుబడి (సెక్యూర్డ్ లోన్) కాబట్టి బ్యాంకులు కాస్త తక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. ఆర్థిక అత్యవసరాల్లో పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బంగారం చేతిలో ఉన్న వారు ఈ రుణం తీసుకుంటారు. బంగారాన్ని తనఖా పెట్టుకొని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తాయి. బంగారం లేదా బంగారం జ్యువెల్లరీ తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవచ్చు.

గోల్డ్ ఈజ్ మనీ ఆఫ్ ది కింగ్స్

గోల్డ్ ఈజ్ మనీ ఆఫ్ ది కింగ్స్

గోల్డ్ ఈజ్ మనీ ఆఫ్ ది కింగ్స్ అని 2002లో తన మనీ అండ్ వెల్త్ ఇన్ ది న్యూ మిల్లీనియంలో పేర్కొన్నారు ప్రముఖ ఆర్థిక నిపుణులు, రచయిత నార్మ్ ఫ్రాంజ్. ప్రస్తుతం డబ్బు అన్నింటిని శాసిస్తోంది. భారతీయులకు అత్యంత ప్రియమైన వాటిలో బంగారం మొదటి స్థానంలో ఉంటుంది. బంగారం వ్యాల్యూ చాలా ఎక్కువ. కాబట్టి దీనిని ఆభరణం రూపంలో ధరించడంతో పాటు పెట్టుబడి సాధనంగా కూడా వినియోగిస్తున్నారు. ఈ బంగారం ఆర్థిక అత్యవసరంలో ఉపయోగపడుతుంది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో చాలామంది తమ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు కూడా తక్కువ వడ్డీ రేటు అందించే బ్యాంకుల వైపు చూస్తారు. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీ రేటును అందించే కొన్ని బ్యాంకులు చూద్దాం.

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేటు

వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేటు

- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 7 శాతంగా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.500 నుండి రూ.2000. జీఎస్టీ అదనం.

- పబ్లిక్ రంగ సెక్టార్ బ్యాంకు ఎస్బీఐ గోల్డ్ లోన్ వడ్డీ రేటు 7 శాతం నుండి 7.50 శాతంగా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతం ప్లస్ జీఎస్టీ అదనం.

- పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ గోల్డ్ లోన్ వడ్డీ రేటు 7 శాతం నుండి 7.50 శాతంగా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.500 నుండి రూ.10,000 గరిష్టం.

- యూనియన్ బ్యాంకు వడ్డీ రేటు 7.25 శాతం నుండి 8.25 శాతంగా ఉంది.

- కెనరా బ్యాంకు వడ్డీ రేటు 7.35 శాతం నుండి ప్రారంభం. ప్రాసెసింగ్ ఫీజు రూ.500 నుండి రూ.5000 వరకు ఉంది.

- ఇండియన్ బ్యాంకు వడ్డీ రేటు 7.50 శాతం నుండి 8 శాతంగా ఉంది. ప్రాసెసింగ్ ఫీజు 0.56 శాతం.

అవసరమయ్యే డాక్యుమెంట్స్

అవసరమయ్యే డాక్యుమెంట్స్

పాన్, ఆధార్ వంటివి ఐడెంటిటీ ప్రూఫ్ కోసం అవసరం. ఆధార్, పాస్ పోర్ట్, వోటర్ ఐడీ వంటివి అడ్రస్ ప్రూఫ్ కోసం అవసరం. ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. వివిధ బ్యాంకులు ఇతర డాక్యుమెంట్స్ అడగవచ్చు.

వివిధ బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తాయి.

గరిష్ట, కనిష్ట పరిమితి

గరిష్ట, కనిష్ట పరిమితి

గరిష్ట, కనిష్ట పరిమితి రుణం ఇచ్చే బ్యాంకు పైన ఆధారపడి ఉంటుంది. ఎస్బీఐ రూ.20,000 నుండి రూ.20,00,000 వరకు ఇస్తుంది. ముథూట్ ఫైనాన్స్ కనీసం రూ.1500 ఇస్తుంది. ఇందులో గరిష్ట పరిమితి లేదు.

కాలపరిమితి ఆయా బ్యాంకు లేదా ఎన్బీఎఫ్‌సీని బట్టి ఉంది.

సాధారణంగా గోల్డ్ లోన్స్ ముందస్తు చెల్లింపు ఛార్జీలు కలిగి ఉంటాయి.

గోల్డ్ లోన్ మొత్తాన్ని చెల్లించకుంటే బ్యాంకులు వాటిని విక్రయించి, వసూలు చేసుకుంటాయి.

English summary

గోల్డ్ ఈజ్ మనీ ఆఫ్ కింగ్స్: ఈ బ్యాంకుల్లో గోల్డ్ లోన్ వడ్డీ రేటు చాలా తక్కువ | Cheapest gold loan: Check top 6 lenders with lowest interest rates

Indians have an insatiable need for gold, thinking it to be a friend in need who will come to their help during a financial crisis. A gold loan might be useful during difficult times like the present pandemic situation.
Story first published: Tuesday, January 25, 2022, 17:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X