For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2021లో బంగారం ధరలు రూ.65,000, వెండి రూ.90,000కు చేరుతుందా?

|

ముంబై: బంగారం ధరలు శుక్రవారం (జనవరి 1, 2021) స్వల్ప పెరుగుదలతో ముగిశాయి. గత ఏడాది చివరి రోజు (డిసెంబర్ 31) స్వల్పంగా పెరిగిన ధరలు నిన్న కూడా పెరుగుదలను నమోదు చేశాయి. గత దశాబ్ద కాలంలో గోల్డ్ రిటర్న్స్ అత్యధికంగా వచ్చింది 2020లోనే కావడం గమనార్హం. గత ఏడాది 27.94 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో 2020లో పసిడి 25 శాతం లాభపడింది. గత ఏడాది దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి రూ.50,000 పైన, అంతర్జాతీయ మార్కెట్లో 1900 డాలర్ల సమీపంలో క్లోజ్ అయింది.

2021లో సరళ్ జీవన్ బీమా: ప్రీమియం కాస్త ఎక్కువే కానీ..2021లో సరళ్ జీవన్ బీమా: ప్రీమియం కాస్త ఎక్కువే కానీ..

బంగారం రూ.65,000, వెండి రూ.90,000

బంగారం రూ.65,000, వెండి రూ.90,000

బంగారం ధరలు 2020లో భారీ రిటర్న్స్ ఇచ్చాయి. కొత్త సంవత్సరం 2021లో అంతగా ఇవ్వకోయినప్పటికీ సానుకూలంగానే ఉంటుందని, ఇంకా చెప్పాలంటే గత పదేళ్ల కాలంలో 2020 అత్యధిక రిటర్న్స్ ఇవ్వగా, 2021 రెండో స్థానంలో నిలిచే అవకాశాలు కొట్టి పారేయలేమని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నరు. గత ఏడాది ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.56200 క్రాస్ చేయగా, సిల్వర్ కిలో రూ.80,000 దరిదాపుల్లోకి వచ్చింది. ఈ ఏడాది పసిడి రూ.65,000ను తాకవచ్చునను భావిస్తున్నారు. ఇక వెండి కిలో రూ.90,000కు చేరుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు.

అందుకే వెండి ధరలు పెరగొచ్చు

అందుకే వెండి ధరలు పెరగొచ్చు

సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి టెక్నాలజీలో వెండి ఆధారితం పెరుగుతోందని, కాబట్టి ఈ ధరలు మరింతగా పెరవగవచ్చునని అంటున్నారు. కరోనా కేసులు, వ్యాక్సినేషన్ కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూడవచ్చునని అంటున్నారు.

జనవరి 1న బంగారం ధరల ముగింపు

జనవరి 1న బంగారం ధరల ముగింపు

ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.84.00 (0.17%) పెరిగి రూ.50,235.00 వద్ద క్లోజ్ అయింది. రూ.50,180.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,280.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,128.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో దాదాపు రూ.6000 వరకు తక్కువగా ఉంది.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.-136.00 (-0.17%) పెరిగి రూ.50,319.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,250.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,319.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,222.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

ఇక, కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి అతిస్వల్పంగా 15.00 (0.02%) పెరిగి రూ.68120.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,254.00 వద్ద ప్రారంభమై, రూ.68,275.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,860.00 వద్ద కనిష్టాన్ని తాకింది. గతవారం మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67518.00 వద్ద క్లోజ్ అయింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా క్షీణించింది. రూ.18.00 (-0.03%) క్షీణించి రూ.69050.00 వద్ద ట్రేడ్ అయింది.

రూ.69,163.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,163.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,868.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

కొత్త ఏడాది 2021లో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ 1900 డాలర్లు క్రాస్ చేసింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.10 (-0.01%) డాలర్లు పెరిగి 1,901.60 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్లో 1,901.60 - 1,901.60 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 25.03% శాతం పెరిగింది.

సిల్వర్ ఫ్యూచర్స్ కూడా క్షీణించింది. ఔన్స్ ధర -0.002 (-0.01%) డాలర్లు పెరిగి 26.525 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్లో 26.525 - 26.525

డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 48 శాతం పెరిగింది.

English summary

2021లో బంగారం ధరలు రూ.65,000, వెండి రూ.90,000కు చేరుతుందా? | Analysts see gold at Rs 65,000 and silver at Rs 90,000 in 2021

Gold and silver edged higher on the first day of the New Year though gains were moderate. On MCX, gold futures were up 0.09% to ₹50,198 per 10 gram while silver edged 0.14% higher to ₹68,200.
Story first published: Saturday, January 2, 2021, 11:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X