For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డబ్బు దాచుకోవాలనుకుంటే.. ఈ బ్యాంకుల్లో ఐతే అదిరిపోయే వడ్డీ రేట్లు

|

సేవింగ్స్ అకౌంట్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. లిక్విడిటీ, వడ్డీ రేటు ఆర్జన, నిధుల భద్రత, సేవింగ్స్ అకౌంట్ మరియు ఫిక్స్డ్ డిపాజిట్ మధ్య ఆటో స్వీప్ సౌకర్యం కారణంగా అదనపు ఆదాయం వంటి వివిధ ప్రయోజనాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గాయి. అయితే పలు ప్రయివేటు బ్యాంకులు అధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. బ్యాంక్ బజార్ సంకలన డేటా ప్రకారం సేవింగ్స్ ఖాతాల పైన ఉత్తమ వడ్డీ రేటు అందించే టాప్ 5 బ్యాంకులు ఇవే. HDFC, ICICI వంటి దిగ్గజ ప్రయివేటు బ్యాంకులతో పోలిస్తే, కస్టమర్లను ఆకర్షించేందుకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి.

దీర్ఘకాలిక ట్రాక్ రికార్డ్, మంచి సేవా ప్రమాణాలు, విస్తృత బ్రాంచీ నెట్ వర్క్, నగరాల్లోని ఏటీఎం సేవలు కలిగిన బ్యాంకును ఎంచుకోవడం మంచిది. సేవింగ్స్ అకౌంట్ పైన వచ్చే వడ్డీ రేటు బోనస్ అనుకోవచ్చు. సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే తక్కువ వడ్డీ రేటును కలిగి ఉంటాయి. కానీ ఈ ఖాతాతో వివిధ ప్రయోజనాలు ఉన్నాయి. రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సురెన్స్ కవరేజీ ఉంటుంది. అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న బ్యాంకులు..

DCB బ్యాంకు

DCB బ్యాంకు

డీసీబీ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ పైన 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ప్రయివేటు బ్యాంకులలో బెస్ట్ ఇంటరెస్ట్ రేటు అందించే బ్యాంకు ఇది. నెలవారీ బ్యాలెన్స్ రిక్వర్మెంట్ రూ.2500 నుండి రూ.5000.

- రూ.1 లక్ష వరకు బ్యాలెన్స్ ఉంటే వడ్డీ రేటు 2.75%,

- రూ.1 లక్ష నుండి రూ.25 లక్షల బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 5.00%,

- రూ.25 లక్షల నుండి రూ.50 లక్షల బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 6.00%,

- రూ.50 లక్షల నుండి రూ.2 కోట్ల బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 6.50%,

- రూ.2 కోట్ల నుండి రూ.50 కోట్ల వరకు బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 5.50%,

- రూ.50 కోట్ల నుండి అంతకుమించి బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 5.00%.

RBL బ్యాంకు

RBL బ్యాంకు

ఆర్బీఎల్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ పైన 6 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ రూ.2500 నుండి రూ.5000.

- రూ.1 లక్ష వరకు బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 4.25%,

- రూ.1 లక్ష నుండి రూ.10 లక్షల బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 5.75%,

- రూ.10 లక్ష నుండి రూ.3 కోట్ల వరకు బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 6.00%,

- రూ.3 కోట్ల నుండి నుండి రూ.5 కోట్ల వరకు బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 6.00%.

బంధన్ బ్యాంకు

బంధన్ బ్యాంకు

బంధన్ బ్యాంకు సేవింగ్స్ ఖాతా పైన ఆరు శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రిక్వర్మెంట్ రూ.5000.

- రూ.1 లక్ష వరకు బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 3.00%,

- రూ.1 లక్ష నుండి రూ.10 లక్షల బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 5.00%,

- రూ.10 లక్ష నుండి రూ.2 కోట్ల వరకు బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 6.00%,

- రూ.3 కోట్ల నుండి నుండి రూ.10 కోట్ల వరకు బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 5.00%.

యస్ బ్యాంకు

యస్ బ్యాంకు

సేవింగ్స్ ఖాతాలపై యస్ బ్యాంకు వడ్డీ రేటు 5.25 శాతంగా ఉంది. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రూ.10,000 నుండి రూ.25,000.

- రూ.1 లక్ష వరకు బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 4.00%,

- రూ.1 లక్ష నుండి రూ.10 లక్షల బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 4.50%,

- రూ.10 లక్ష నుండి రూ.100 కోట్ల వరకు బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 5.25%.

ఇండస్ఇండ్ బ్యాంకు

ఇండస్ఇండ్ బ్యాంకు

సేవింగ్స్ అకౌంట్ పైన ఇండస్ఇండ్ బ్యాంకు వడ్డీ రేటు 5 శాతంగా ఉంది. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ రూ.1500 నుండి రూ.10,000.

IDFC ఫస్ట్ బ్యాంకు

IDFC ఫస్ట్ బ్యాంకు

IDFC ఫస్ట్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్స్ పైన వడ్డీ రేటును గరిష్టంగా 5 శాతం అందిస్తోంది.

- రూ.1 లక్ష వరకు బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 4.00%,

- రూ.1 లక్ష నుండి రూ.10 లక్షల బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 4.50%,

- రూ.10 లక్ష నుండి రూ.2 కోట్ల వరకు బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 5.00%,

- రూ.2 కోట్ల నుండి నుండి రూ.10 కోట్ల వరకు బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 4.00%.

- రూ.10 కోట్ల నుండి నుండి రూ.100 కోట్ల వరకు బ్యాలెన్స్ పైన వడ్డీ రేటు 3.50%.

- రూ.100 కోట్ల పైన వడ్డీ రేటు - 3.00%.

English summary

డబ్బు దాచుకోవాలనుకుంటే.. ఈ బ్యాంకుల్లో ఐతే అదిరిపోయే వడ్డీ రేట్లు | 6 Private Sector Banks With Highest Interest Rates On Savings Accounts

When it comes to a risk-free investment decision combined with an initial phase of personal finance, opening a savings account is all that works for you as an interest-bearing place to park your money. Savings accounts are highly recommended for short-term investment goals owing to the liquidity option that allows you to make deposits and withdrawals at any time.
Story first published: Tuesday, November 23, 2021, 14:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X