For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప‌న్ను మిన‌హాయింపు ల‌భించే 10 ఉత్త‌మ మార్గాలు

2017 ప‌న్ను సంవ‌త్స‌రం ముగింపుకు వ‌స్తోంది. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపుల‌కు పెట్టుబ‌డి పెట్టి ఉండాలి. ఇప్పుడు ప‌న్ను త‌గ్గించుకునేందుకు త‌క్ష‌ణ‌మే చేయ‌గ‌లిగేందేమీ లేదు. క‌నీసం వ‌చ్చే ఏ

|

2017-18 ప‌న్ను సంవ‌త్స‌రం ముగింపుకు వ‌స్తోంది. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపుల‌కు పెట్టుబ‌డి పెట్టి ఉండాలి. ఇప్పుడు ప‌న్ను త‌గ్గించుకునేందుకు త‌క్ష‌ణ‌మే చేయ‌గ‌లిగేందేమీ లేదు. క‌నీసం వ‌చ్చే ఏడాది కోస‌మైనా ప‌న్ను ప్రణాళిక‌ను ఇప్ప‌టి నుంచే వేసుకోవాలి. అప్పుడే మీరు క‌నిష్ట ప‌న్నుతో లేదా అస‌లు ప‌న్ను లేకుండా రిట‌ర్నుల‌ను ఫైల్ చేయ‌వ‌చ్చు. ఇలా వేత‌న ఉద్యోగుల‌కు ప‌న్ను ఆదా చేసుకునేందుకు దేశంలో ఉన్న ప‌లు మార్గాల గురించి ఇక్క‌డ తెలుసుకోండి.

1. పిల్ల‌ల చ‌దువు ఫీజులు:

1. పిల్ల‌ల చ‌దువు ఫీజులు:

త‌ల్లిదండ్రులు ఎప్పుడూ పిల్ల‌ల‌కు మంచి చదువును ఇవ్వాల‌ని కోరుకుంటారు. ఇప్పుడు చ‌దువులు ఖ‌రీదైపోయాయి. ఈ క్ర‌మంలో పిల్ల‌ల పాఠ‌శాల, క‌ళాశాల ఫీజులు ల‌క్ష‌ల్లో చెల్లిస్తున్నారు. అయితే ట్యూష‌న్ ఫీజుకు సంబంధించి ఆదాయ‌పు ప‌న్ను శాఖ కొన్ని మిన‌హాయింపుల‌కు అవ‌కాశం క‌ల్పించింది. సెక్ష‌న్ 80సీ కింద మీరు ప‌న్ను మిన‌హాయంపుల‌ను క్లెయిం చేసుకోవ‌చ్చు.

2. ఇంటి అద్దెపై ప‌న్ను మిన‌హాయింపు

2. ఇంటి అద్దెపై ప‌న్ను మిన‌హాయింపు

ఇప్పుడు చాలా మంది ప‌ట్ట‌ణాల్లో అద్దె ఇళ్ల‌లోనే ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి వారంద‌రికీ కంపెనీ వ‌స‌తి క‌ల్పించ‌క‌పోతే చెల్లిస్తున్న అద్దెకు కొంత వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు పొందే వెసులుబాటు ఉంది.

మీ మొత్తం ఆదాయంలో వీటిల్లో ఏది త‌క్కువైతే దానికి మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

1. యాజ‌మాన్యం ఇస్తున్న హెచ్ఆర్‌ఏ

2. బేసిక్ శాల‌రీలో 50%+డీఏ(ఉద్యోగి ఢిల్లీ, ముంబ‌యి, కోల్‌క‌త‌, చెన్నై న‌గ‌రాల్లో ఉంటే) లేక‌పోతే బేసిక్ శాల‌రీలో 40%+డీఏ

3. మీరు చెల్లించిన ఇంటి అద్దె- 10% బేసిక్ శాల‌రీ+ డీఏ

3. గృహ రుణ చెల్లింపు ద్వారా

3. గృహ రుణ చెల్లింపు ద్వారా

ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఉండేవారు చాలా మంది సొంత ఇంటి కోసం బ్యాంకులో అప్పు తీసుకుంటారు. ఇందుకు గాను మీరు చెల్లించే ఈఎంఐల ద్వారా ప‌న్ను త‌గ్గించుకోవ‌చ్చు. మీరు చెల్లించే అస‌లు, వ‌డ్డీకి సంబంధించి వాయిదాల్లో కొంత వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. వ‌డ్డీకి సెక్ష‌న్ 24 కింద‌, చెల్లించే అస‌లుకు 80సీ కింద ప‌న్ను మిన‌హాయంపు పొంద‌వ‌చ్చు. మీరు కొత్త‌గా ఇంటిని కొంటున్న‌ట్ల‌యితే లేదా మొద‌టిసారి కొన్న గృహ రుణం చెల్లిస్తున్న‌ట్ల‌యితే ఎక్కువ మొత్తంలో ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు.

 4. విద్యా రుణ ఈఎంఐలు

4. విద్యా రుణ ఈఎంఐలు

ప్ర‌స్తుతం చ‌దువుల ఫీజులు ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరుగుతుండ‌టంతో చాలా మంది ఉన్న‌త చ‌దువుల కోసం బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు. ట్యూష‌న్ ఫీజుల‌కు ప‌న్ను మిన‌హాయింపుల‌న్న‌ట్లే విద్యా రుణానికి చెల్లించే ఈఎంఐల‌కు సైతం ప‌న్ను మినహాయింపు ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

మీ విద్యావ‌స‌రాల కోసం విద్యార్థిగా ఉన్న‌ప్పుడు అందుకునే ఉప‌కార‌వేత‌నం(స్కాల‌ర్‌షిప్‌) లేదా గ్రాంట్ల‌పై ఎటువంటి ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌న‌క్క‌ర్లేదు.

 5. పెన్ష‌న్ ఫండ్లు

5. పెన్ష‌న్ ఫండ్లు

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత డ‌బ్బు స‌మ‌కూర్చుకునే దానికోసం ఈ ఫండ్ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు.

ఇవి డిఫ‌ర్డ్ యాన్యుటీ, ఇమ్మిడీయ‌ట్ యాన్యుటీ అని రెండు ర‌కాలుగా ఉంటాయి.

డిఫర్డ్ యాన్యుటీల్లో ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌ర‌కూ ప్ర‌తి సంవ‌త్స‌రం పెట్టుబ‌డి పెడుతూ ఉంటారు. ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును చేరుకున్న త‌ర్వాత మొత్తంలో నుంచి 60% తీసుకోవ‌చ్చు. మిగిలిన దాన్ని యాన్యుటీ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది.

అదే ఇమ్మిడీయ‌ట్ యాన్యుటీల్లో అయితే ఒకేసారి మొత్తం పెట్టుబ‌డిని పెట్ట‌వ‌చ్చు. దాని త‌ర్వాత నెల‌వారీ పింఛ‌ను రూపంలో ఖాతాలోకి డ‌బ్బును పొంద‌వ‌చ్చు.

6. విహార యాత్ర‌ల ఖ‌ర్చులు(ఎల్‌టీఏ)

6. విహార యాత్ర‌ల ఖ‌ర్చులు(ఎల్‌టీఏ)

మీకు వ‌చ్చే వేత‌నంలో ప‌న్ను మిన‌హాయించే వాటిలో ఎల్‌టీసీ కూడా ఉంటుంది. ఎల్‌టీసీ బ్లాక్ ఇయ‌ర్ ప్ర‌తి ఏటా చూసుకోవాలి. ఇప్పుడు ఎల్‌టీసీ బ్లాక్ ఇయ‌ర్ 2014-17 మ‌ధ్య ఉంది. నాలుగేళ్ల‌లో రెండుసార్లు ఎల్‌టీఏ లేదా ఎల్‌టీసీ మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. యాజ‌మాన్యం ఇచ్చిన ఎల్‌టీఏ ఖ‌ర్చుల మేర‌కు ప‌న్ను మిన‌హాయింపుల‌ను క్లెయిం చేయ‌వ‌చ్చు.

7. వైద్య ఖ‌ర్చులు

7. వైద్య ఖ‌ర్చులు

చిన్న రోగం వ‌చ్చినా భ‌య‌ప‌డే రోజులివి. ఆసుప‌త్రికెళితే ర‌క‌ర‌కాల ప‌రీక్ష‌లు, మందులు రాసి బిల్లును చూస్తేనే ద‌డ పుట్టిస్తున్నారు డాక్ట‌ర్లు. కాబ‌ట్టి వైద్య ఖ‌ర్చులు సైతం నిత్య జీవితంలో భాగ‌మైపోయాయి. దీన్నుంచి సాంత్వ‌న పొందేందుకు ఆరోగ్య బీమా, లేదా ముంద‌స్తు వైద్య ప‌రీక్ష‌ల‌కు సంబంధించి అయ్యే ఖ‌ర్చుల‌ను సైతం ప‌న్ను మిన‌హాయింపు కింద చూపించుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తిస్తంఓది. ఈ విధంగా దాదాపు రూ.60 వేల వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు అవ‌కాశం ఉంది.

8. జీవిత బీమా

8. జీవిత బీమా

ఎవ‌రైనా జీవితంలో ఆర్థిక ప్ర‌ణాళిక‌లో మొద‌ట ప్రాముఖ్య‌త ఇవ్వాల్సింది జీవిత బీమా కోస‌మే. త‌క్కువ ప్రీమియంలోనే, ఎక్కువ రిస్క్ క‌వ‌రేజీ అందించే పాల‌సీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వివిధ సౌక‌ర్యాల, అనుకూల‌త‌ల కార‌ణంగా చాలా మంది ఎల్ఐసీ పాల‌సీల‌ను తీసుకునేందుకు ఆస‌క్తి చూపుతారు. ఏ కంపెనీ అయినా ట‌ర్మ్ ఇన్సూరెన్స్ క‌చ్చితంగా తీసుకోవాల‌ని బీమా నిపుణులు సూచిస్తుంటారు. ఇవి పెట్టుబ‌డి కోణంలో కాకుండా రిస్క్ క‌వ‌రేజీ క‌ల్పించేందుకు ప‌నికొస్తాయి. జీవిత బీమా సైతం ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం కింద ప‌న్ను మినహాయంపు కోసం అర్హ‌త క‌లిగి ఉంది. సెక్ష‌న్ 80సీ కింద క‌ట్టే ప్రీమియంకు సంబంధించి గ‌రిష్టంగా రూ.1.50 లక్ష వ‌ర‌కూ మిన‌హాయింపును కోర‌వ‌చ్చు.

 ప‌న్ను ఆదాకు ప‌లు మార్గాలు

ప‌న్ను ఆదాకు ప‌లు మార్గాలు

ప‌న్ను ఆదా పెట్టుబ‌డులు

9. ఈపీఎఫ్‌

చాలా కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు పీఎఫ్‌ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నాయి. మీ సంస్థ ఇదిర‌కే మీకు పీఎఫ్ రూపంలో డ‌బ్బు జ‌మ చేస్తుంటే మీకు ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాతి జీవితం కోసం ఒక పెట్టుబ‌డి ఉన్న‌ట్లే. పీఎఫ్ రూపంలో వేత‌నంలో మిన‌హాయించ‌బ‌డే డ‌బ్బును 80 సీ కింద మిన‌హాయింపుల రూపంలో చూపించుకోవ‌చ్చు. అంతే కాకుండా పీఎఫ్ వ‌డ్డీ, మెచ్యూరిటీ సొమ్ముకు సైతం ప‌న్ను నుంచి మిన‌హాయింపు ఉంద‌ని గుర్తుంచుకోండి

10. పీపీఎఫ్‌

10. పీపీఎఫ్‌

ఈపీఎఫ్ కాకుండా త‌క్కువ రిస్క్ తీసుకుంటూ దీర్ఘ‌కాల పొదుపు చేయాల‌నుకునే వారికి పీపీఎఫ్ మ‌రో మార్గం. ప‌దిహేనేళ్ల పాటు మీ పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించ‌వచ్చు. ఇది ఒక సంప్రదాయ పెట్టుబ‌డి మార్గం. దాదాపు 8% వ‌డ్డీ వ‌స్తూ ఉంటుంది. గరిష్టంగా ఏడాదికి రూ.1.50 ల‌క్ష వ‌ర‌కూ పెట్టుబ‌డి పెట్టొచ్చు. పీఎఫ్ లో లాగే దీనిపై వ‌చ్చే వ‌డ్డీ, మెచ్యూరిటీ సొమ్ముకు సైతం ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి.

11. సుక‌న్య స‌మృద్ది యోజ‌న‌

11. సుక‌న్య స‌మృద్ది యోజ‌న‌

కూతురు పేరిట డ‌బ్బు పొదుపు చేసేందుకు ఉప‌యోగ‌ప‌డేది సుక‌న్య స‌మృద్ది యోజ‌న‌. అమ్మాయిల ఉన్న‌త చ‌దువు, వివాహ సంద‌ర్భంలో అవ‌స‌ర‌మైన డ‌బ్బును ఈ ప‌థ‌కం ద్వారా స‌మ‌కూర్చుకోవ‌చ్చు. పీపీఎఫ్‌; ఈపీఎఫ్ పెట్టుబ‌డుల‌తో పోలిస్తే ఈ ప‌థ‌కంలో రాబ‌డి కాస్త ఎక్కువే అని చెప్ప‌వ‌చ్చు. త‌పాలా కార్యాల‌యాలు, బ్యాంకుల్లో సుక‌న్య స‌మృద్ది ఖాతాను తెర‌వొచ్చు.

12. ఎన్‌పీఎస్‌

12. ఎన్‌పీఎస్‌

త‌పాలా శాఖ ఆఫర్ చేసే పొదుపు ప‌థ‌కాల్లో ఎన్‌పీఎస్ ఒక మంచి పొదుపు ప‌థ‌కం. ఎటువంటి రిస్క్ లేకుండా మంచి రాబ‌డినిచ్చే వాటిలో ఇది ఒక‌టి. దీని కోసం మీరు వెచ్చించే సొమ్ముకు 80 సీ కింద ప‌న్న మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

 13. 5 ఏళ్ల పోస్టాఫీసు కాల‌ప‌రిమితి డిపాజిట్లు

13. 5 ఏళ్ల పోస్టాఫీసు కాల‌ప‌రిమితి డిపాజిట్లు

5 ఏళ్ల పోస్టాఫీసు డిపాజిట్ల‌ను ఏ పోస్టాఫీసు శాఖ‌లోనైనా తెర‌వొచ్చు. ఇవి ఇత‌ర ఫిక్స్‌డ్ డిపాజిట్ల లానే ప‌నిచేస్తాయి. అయితే 5 ఏళ్ల క‌చ్చిత‌మైన లాక్ ఇన్ పీరియ‌డ్ ఉండ‌దు. పెట్టుబ‌డికి రెండింత‌ల రాబ‌డితో పాటు, ప‌న్ను మిన‌హాయింపు సౌక‌ర్యం ఉండ‌టం వీటి ప్ర‌త్యేక‌త‌.

Read more about: tax tax savings taxes income tax
English summary

ప‌న్ను మిన‌హాయింపు ల‌భించే 10 ఉత్త‌మ మార్గాలు | 10 best tax saving options in the year 2016-17

we are at the ending of tax returns stage for the year 2016-17. some may put good options for tax savings. some may failed because of not having proper tax plan. At least for next year you have to plan from now on wards. Fot that here we are giving 10 best tax saving options in India
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X