For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేటీఎమ్ ద్వారా రూపాయికే బంగారం

దీంతో ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారానే బంగారం కొనడం, అమ్మడం వంటి సేవలను వాలెట్ యూజ‌ర్లంతా పొందేలా ఏర్పాటు చేసింది. ఈ సేవల్లో భాగంగా అతి తక్కువ ధర ఒక్క రూపాయికే బంగారం కొనుగోలుచేసుకోవచ్చని పేటీఎమ్‌

|

గ‌త న‌వంబ‌రులో మోదీ పెద్ద నోట్లను మార్చినప్ప‌టి నుంచి డిజిట‌ల్ చెల్లింపుల‌కు ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఆ దిశ‌లో ప్ర‌భుత్వం ఎంతో కృషి చేసింది. న‌గ‌దు ర‌హిత చెల్లింపుల వ్య‌వ‌స్థ‌లో బ్యాంకులు ఎన్నో యాప్‌లు తీసుకొచ్చాయి. ప్ర‌భుత్వం భీమ్ యాప్‌, యూపీఐ చెల్లింపు ప‌ద్ద‌తిని ప్ర‌వేశ‌పెట్టింది. యూపీఐలో సుల‌భ‌త‌ర ప‌ద్ద‌తిని ఎంతో మంది ఆప‌రేట‌ర్లు ఉప‌యోగించుకుంటున్నారు. పాత రూ.500, రూ.1000 నోట్ల ర‌ద్దు త‌ర్వాత మొబైల్ ఇంట‌ర్నెట్ ద్వారా వాలెట్ల ప్రభంజ‌నం అంతా ఇంతా కాదు. అందులో పేటీఎమ్ అన్నింటికంటే ముందంజ‌లో ఉన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అప్పుడు చెల్లింపుల్లో స‌రికొత్త రికార్డుల‌ను సృష్టించిన పేటీఎమ్ ఇప్పుడు మ‌రో స‌రికొత్త ప్ర‌యోగం చేస్తోంది. బంగారం కొనుగోలును సులువు చేసేందుకు వెబ్‌సైట్లో స‌రికొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఆ వివ‌రాలు గుడ్‌రిట‌ర్న్స్ పాఠ‌కుల కోసం..

 వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా

వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా

  1. మొద‌ట పేటీఎమ్ యూజ‌ర్ ఐడీ,పాస్‌వర్డ్‌తో వెబ్‌సైట్లో లాగిన్ కావాలి.

  2. త‌ర్వాత గోల్డ్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
  3. త‌ర్వాత బంగారం పేజీకి వెళ్లిన త‌ర్వాత త‌గిన వివ‌రాలు న‌మోదు చేయాలి.

  4. బంగారాన్ని గ్రాముల్లో కానీ రూపాయ‌ల్లో కానీ ఎంట‌ర్ చేయాలి.
కొనుగోలు ఇలా...

కొనుగోలు ఇలా...

  • 24 క్యారెట్ల స్వ‌చ్చ‌త గ‌ల బంగారాన్ని ఒక రూపాయి నుంచి మొద‌లుకొని ఎంతైనా కొనుగోలు చేసేందుకు అవ‌కాశం ఉంది.

  • మ‌న‌కు కావాల్సిన ప‌రిమాణాన్ని గ్రాముల్లో కానీ లేదా ఎన్ని రూపాయ‌ల‌కు కొనాల‌నుకుంటున్నారో అక్క‌డ పేర్కొనాలి.

  • త‌ర్వాత కూప‌న్ కోడ్ అప్లై చేయాలి.

  • దీని త‌ర్వాత అది పేమెంట్ పేజీకి వెళ్తుంది.

  • చెల్లింపుల‌ను వాలెట్ ద్వారా లేదా నెట్‌బ్యాకింగ్ లేదా కార్డుల ద్వారా చేయ‌వ‌చ్చు.

అక్ష‌య త్రితీయ‌-బంగారం

అక్ష‌య త్రితీయ‌-బంగారం

నోట్ల రద్దు తర్వాత చెల్లింపుల ప్రపంచంలో పేటీఎమ్ ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న‌ది. ఇప్పటికే అన్ని రకాల డిజిటల్ సర్వీసులు అందిస్తున్న పేటీఎమ్‌ మరో కొత్తరకం సర్వీసులతో మన ముందుకు వచ్చింది. మ‌న దేశ ప్ర‌జ‌ల‌కు అక్షయ త్రితీయ పండుగ‌తో ఎంతో అనుబంధం ఉండ‌టంతో, ఎంఎంటీసీ-పీఏఎంపీతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న పేటీఎమ్ 'డిజిటల్ గోల్డ్' ను లాంచ్ చేసింది.

ఒక్క రూపాయికే బంగారం

ఒక్క రూపాయికే బంగారం

దీంతో ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారానే బంగారం కొనడం, అమ్మడం వంటి సేవలను వాలెట్ యూజ‌ర్లంతా పొందేలా ఏర్పాటు చేసింది. ఈ సేవల్లో భాగంగా అతి తక్కువ ధర ఒక్క రూపాయికే బంగారం కొనుగోలుచేసుకోవచ్చని పేటీఎమ్‌ పేర్కొంది. తమ పేటీఎమ్ మొబైల్ వాలెట్స్ ను వాడుకుంటూనే వినియోగదారులు 24 క్యారెట్ల 999.9 స్వచ్ఛత బంగారాన్ని ఆన్ లైన్ లో కొనుగోలు చేయొచ్చ‌ని వెల్ల‌డించింది.

ఇంటి వ‌ద్ద‌కే గోల్డ్ కాయిన్ల డెలివ‌రీ

ఇంటి వ‌ద్ద‌కే గోల్డ్ కాయిన్ల డెలివ‌రీ

ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎంఎంటీసీ-పీఏఎంపీలోనూ బంగారాన్ని ఐదేళ్ల పాటు భ‌ద్ర‌ప‌రుచుకోవచ్చని పేర్కొంది. నాణేల రూపంలోనూ కస్టమర్ల అభ్యర్థన మేరకు ఇళ్ల వద్దకు గోల్డ్ ను డెలివరీ చేస్తామని పేర్కొంది. ఎంఎంటీసీ-పీఏఎంపీకి తిరిగి ఆన్ లైన్ లోనూ ఈ గోల్డ్ ను అమ్ముకునే అవ‌కాశం ఉండ‌టం ఇక్క‌డ గ‌మ‌నార్హం.

4 ర‌కాల బంగారు నాణేలు

4 ర‌కాల బంగారు నాణేలు

రూ. 2 ల‌క్ష‌ల‌కు మించి బంగారం కొనుగోలు చేయాలంటే పాన్ వివ‌రాలు ఇవ్వాలి. బంగారం కొనుగోలు స‌మ‌యంలో మీరు పేరు, న‌మోదిత మొబైల్ నంబ‌రు, పిన్ కోడ్ వంటివి నింపాలి. బంగారు నాణేలకు మేకింగ్ చార్జీలు అద‌నం. మార్కెట్ ధ‌ర‌ల ఆధారంగా ప్ర‌తి రోజూ బంగారం ధ‌ర‌ల‌ను నిర్ణ‌యిస్తారు. ప్ర‌స్తుతం 1,2,5,10 గ్రాముల ప‌రిమాణాల్లో బంగారు నాణేలు అందుబాటులో ఉన్నాయి.

 పేటీఎమ్ సీఈవో మాట‌

పేటీఎమ్ సీఈవో మాట‌

బంగారానికి భారతీయుల పెట్టుబడుల సాధనంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని, బంగారంలో డిజిటల్ గా పెట్టుబడులు పెట్టడానికి తాము సులభతరంగా సేవలందిస్తామని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. మార్కెట్ ఆధారిత ధరలతోనే ఇంటర్నేషనల్ క్వాలిటీ బంగారాన్ని అమ్మడానికి, కొనడానికి కస్టమర్లకు అవకాశముంటుందన్నారు. ఒక్క రూపాయికి కూడా బంగారం కొనుక్కునే అవకాశం వినియోగదారులకు కల్పిస్తామని విజయ్ శేఖర్ చెప్పారు. 20వేల వరకు బంగారం కొనుగోళ్లకు ఎలాంటి కేవైసీ వివరాలను ఇవ్వాల్సిన ప‌నిలేదు.

Read more about: paytm gold wallet బంగారం
English summary

పేటీఎమ్ ద్వారా రూపాయికే బంగారం | On Akshaya Tritiya Buy gold for one rupee through paytm

Akshaya Tritiya is considered one of the most auspicious days in India to buy gold. On this today, lakhs of people will want to invest in gold and hence, the demand for gold, particularly in the form bars, coins and jewellery rises during this period. However, no matter how treasurable, gold is an expensive commodity.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X