యస్ బ్యాంకులో సమూల మార్పులు తీసుకురావాలని అడ్మినిస్ట్రేటర్ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. ఇందులో భాగంగా కార్పోరేట్ రుణాలను విక్రయించే అవకాశం ఉందని చెప్పారు. బ్యాంకును కార్పోరేట్ రుణ వ్యాపారం నుండి రిటైల్ లోన్ వ్యాపారం వైపు మళ్లిస్తామన్నారు. ఆర్బీఐ హామీ ఇచ్చాక యస్ బ్యాంకు ఏటీఎంల వద్ద క్యూ తగ్గిందని చెప్పారు.
సౌదీ అరేబియా-రష్యా క్రూడాయిల్ యుద్ధం

యస్ బ్యాంకుపై ప్రజలకు ఊరట కల్పించింది ఇవే
యస్ బ్యాంకుపై ప్రజలకు నమ్మకం తగ్గలేదని చెప్పారు ప్రశాంత్ కుమార్. ఎస్బీఐ 49 శాతం పెట్టుబడులు పెట్టడమే మొదట నమ్మకాన్ని పెంచిందని చెప్పారు. అదే సమయంలో బ్యాంకు రిసొల్యూషన్ ప్రక్రియ వేగవంతమైందన్నారు. ఆ తర్వాత ఆర్బీఐ మద్దతు, ఎస్బీఐ అండ వల్ల ప్రజలకు ఊరట కల్పించిందన్నారు. బ్యాంకు మూలధన సేకరణ ప్రణాళికలు సిద్ధం కావడం కూడా ప్రజల్లో విశ్వాసం నింపిందన్నారు.

మార్చి 14న క్వార్టర్ ఫలితాలు
మార్చి 14వ తేదీన బ్యాంకు క్వార్టర్ ఫలితాలు వెల్లడిస్తామని ప్రశాంత్ చెప్పారు. డిపాజిట్లను విత్ డ్రా చేసుకునే కస్టమర్ల అవసరాలు తీర్చడం ప్రస్తుతం తమ ముందు ఉన్న కర్తవ్యమన్నారు.

రిటైల్ ఇన్వెస్టర్లు బలయ్యారా?
మరోవైపు, యస్ బ్యాంకు నుండి పెద్దలు ముందే తప్పుకుని, రిటైల్ ఇన్వెస్టర్లను బలి చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. వాల్యూ హంటింగ్ పేరుతో షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు పెద్ద ఎత్తున విక్రయించారని తెలుస్తోంది. ఎస్బీఐ జోక్యంతో డిపాజిటర్లకు ఊరట దక్కింది. కానీ ఈ బ్యాంకు షేర్‌లో ఇన్వెస్ట్ చేసిన రిటైల్ ఇన్వెస్టర్ మాత్రం కోలుకునే పరిస్థితి లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

త్వరలో బోర్డు..
బ్యాంకుకు పూర్తిస్థాయి బోర్డును ఏర్పాటు చేసేందుకు ఆర్బీఐ కసరత్తు చేస్తోంది. బోర్డు ఏర్పడగానే రిటైల్ బ్యాంకుగా మార్చే అంశం బోర్డు ముందుకు రానుంది. ఇప్పటికే ఉన్న కార్పోరేట్ రుణాల విభాగం ఇక నుండి కేవలం గతంలో ఇచ్చిన రుణాల వసూలుకు మాత్రమే పరిమితమవుతుంది. కొత్త రుణాలు ఉండవు. భవిష్యత్తులో బ్యాంకు ఆశ్తుల్లో డెబ్బై శాతం వరకు రిటైల్ రుణాలు ఉంటాయి. ప్రస్తుతం ఇవి 35 శాతం వరకు మాత్రమే ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications