మొబైల్ ప్రియులకు గుడ్‌న్యూస్: షావోమి నుంచి కొత్త బ్రాండ్: లాంచ్ డేట్ ఎఫ్పుడంటే
ముంబై: కొనుగోలుదారులకు ప్రముఖ మొబైల్ కంపెనీ షావోమి గుడ్‌న్యూస్ వినిపించింది. కొత్త మొబైల్ బ్రాండ్లు, హ్యాండ్ బ్యాండ్‌లను ఆవిష్కరించబోతోంది. దీనికి ముహూర్తాన్ని ఖాయం చేసింది. మొబైల్ హ్యాండ్‌సెట్, హ్యాండ్‌బ్యాండ్‌లను మార్కెట్‌లో విడుదల చేయడానికి ఏకంగా ఓ మెగా ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ మెగా ఈవెంట్‌ను సోమవారం ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఈవెంట్ సందర్భంగా ఎంఐ బ్యాండ్ 6 (Mi Band 6)ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
గత ఏడాది జులైలో ఎంఐ బ్యాండ్ 5 (Mi Band 5) రకం హ్యాండ్‌బ్యాండ్ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా షావోమి సంస్థ యాజమాన్యం దాన్ని మరింత అప్‌గ్రేడ్ చేస్తూ ఎంఐ బ్యాండ్ 6ను కొనుగోలుదారులకు అందుబాటులోకి తీసుకుని రానుంది. ఎంఐ బ్యాండ్ 5 కంటే అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్ ఇది. ఈ నెల 29వ తేదీన సాయంత్రం 7:30 గంటలకు ఆయా మొబైల్ హ్యాండ్‌సెట్లతో పాటు ఎంఐ బ్యాండ్ 6ను లాంఛనంగా దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు షావోమి సంస్థ తెలిపింది.

లేటెస్ట్ వెర్షన్‌తో కూడిన ఫిట్‌నెస్ ట్రాకర్, మాగ్నెటిక్ ఛార్జర్‌ను కలిగి ఉండటం ఎంఐ బ్యాండ్ 6 ప్రత్యేకత. నల్లరంగు కేస్ కామన్‌గా ఉన్నప్పటికీ.. స్ట్రాప్స్ డిఫరెంట్ కలర్స్‌లో లభిస్తాయి. ఎంఐ బ్యాండ్ 5 కంటే డిస్‌ప్లే ఇంకాస్త అధికంగా ఉంటుంది. దీన్ని చేతికి ధరించినప్పుడు.. ఆక్సిజన్ లెవెల్స్, స్టెప్స్ కౌంటర్ వంటివి సౌకర్యాలు ఇందులో ఉంటాయి. ఎంఐ 11 ప్రొ, ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ మిక్స్‌లను అదే రోజు ఆవిష్కరిస్తామని షావోమి ప్రొడక్ట్ మార్కెటింగ్ అండ్ గ్లోబల్ స్పోక్స్ పర్సన్ అబి గో తెలిపారు.


Click it and Unblock the Notifications