స్టాక్ మార్కెట్స్‌లో చీకటి వారం: మహా పతనం: వణికిన ఇన్వెస్టర్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్‌ ఈ వారం ఇన్వెస్టర్లను వణికించింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా పతనమైంది. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలు కనిష్ఠ స్థాయికి పతనం అయ్యాయి. రెండు సంవత్సరాల తరువాత మళ్లీ ఆ స్థాయిలో మార్కెట్స్ నేలకూలాయి. మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చనే ఆందోళనను ఇన్వెస్టర్లలో రేకెత్తింపజేశాయి.

 రెండేళ్ల తరువాత..

రెండేళ్ల తరువాత..

ఈ సోమవారం నుంచి శుక్రవారం వరకు స్టాక్ మార్కెట్స్ ఏ స్థాయిలో క్షీణించాయో తెలిసిన విషయమే. ఈ అయిదు రోజుల వ్యవధిలో 2,943.02 పాయింట్లను నష్టపోయింది. నిఫ్టీ పతనం 908.3 పాయింట్లుగా నమోదైంది. సోమవారం 54,303.44 పాయింట్లతో ఆరంభమైన సెన్సెక్స్.. శుక్రవారం సాయంత్రానికి 51,360.42 పాయింట్లకు పడిపోయింది.

స్మాల్ క్యాప్స్..

స్మాల్ క్యాప్స్..

కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సంవత్సరం 2020 మేలో కనిష్ఠ స్థాయిలో మార్కెట్స్ పతనం అయ్యాయి. ఇప్పుడు మళ్లీ అదే తరహా వాతావరణం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ఈ వారం కనిపించింది. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో స్మాల్ క్యాప్ 6.6 శాతం మేర నష్టపోయాయి. సద్భావ్ ఇంజినీరింగ్, మాస్టెక్, కేబీసీ గ్లోబల్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ నెట్‌వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పెద్ద ఎత్తున నష్టపోయాయి.

మిడ్ క్యాప్స్..

మిడ్ క్యాప్స్..

బీఎస్ఈ మిడ్ క్యాప్‌ 5.3 శాతం మేర నష్టపోయింది. ఈ కేటగిరీలో ఆర్బీఎల్ బ్యాంక్, ఆయిల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, కెనరా బ్యాంక్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, క్రిసిల్, వోడాఫోన్ ఐడియా నష్టపోయాయి. ఏకంగా 10 నుంచి 28 శాతం మేర నష్టాన్ని మూటగట్టుకున్నాయి.

లార్జ్ క్యాప్స్..

లార్జ్ క్యాప్స్..

బీఎస్ఈ లార్జ్ క్యాప్‌ సైతం 5.6 శాతం మేర నష్టపోయింది. ఇందులో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, హిండాల్కో ఇండస్ట్రీస్, టెక్ మహీంద్ర, వేదాంత, విప్రో, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎస్బీఐ కార్డ్ అండ్ పేమెంట్స్ సర్వీసెస్, అదాని టోటల్ గ్యాస్ కంపెనీల షేర్లు 10 నుంచి 14 శాతం నష్టపోయాయి.

అన్ని సెగ్మెంట్స్ అంతే..

అన్ని సెగ్మెంట్స్ అంతే..

దాదాపు అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్ల పరిస్థితీ ఇంతే. వారం మొత్తం లాభాల మాట అనేదే లేకుండా పోయింది. వచ్చేవారంపై ఇన్వెస్టర్లు ఆశలు పెట్టుకున్నారు గానీ.. సీక్వెన్స్ చూస్తోంటే పరిస్థితులు సానుకూలంగా కనిపించట్లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఆటోమొబైల్స్, ఫైనాన్సియల్ సర్వీసెస్.. ఇలా అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లన్నీ రెడ్ జోన్‌లో ట్రేడ్ అయ్యాయి.

ఎఫ్ఎంసీజీ సహా..

ఎఫ్ఎంసీజీ సహా..

కన్జ్యూమర్ డ్యూరబల్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెగ్మెంట్స్‌పైనా ప్రభావం పడింది. వాటి షేర్లు రెండు శాతం మేర నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంకింగ్ షేర్లు మాత్రమే కొంతమేర ఫర్వాలేదనిపించుకున్నాయంతే. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, ఏసియన్ పెయింట్స్, టెక్ మహీంద్ర, భారతి ఎయిర్‌టెల్ వంటి కంపెనీల షేర్లు నష్టపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+