వర్క్ ఫ్రమ్ హోంపై సర్వే షాకింగ్, 99.8% మందికి సమర్థత లేదు: ఎంతమందికి ఏం లోపమంటే?

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ముఖ్యంగా సాఫ్టువేర్ రంగంలోని సంస్థలు ఇంటి నుండి పని చేయిస్తున్నాయి. అయితే వారిలో కేవలం 0.2 శాతం మంది మాత్రమే అత్యధిక ఉత్పాదకతను ప్రదర్శిస్తున్నారని స్వికీ మైండ్ మ్యాచ్ పరిశోధనలో వెల్లడైంది.

వర్క్ ఫ్రమ్ హోమ్ సామర్థ్యం లేదు

వర్క్ ఫ్రమ్ హోమ్ సామర్థ్యం లేదు

వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో 99.8 శాతం మందికి సామర్థ్యం లేదని ఈ స్రవేలో తేలింది. ఇందుకు వివిధ కారణాలు ఉన్నాయి. కేవలం ఆఫీస్ వర్క్‌కు అలవాటుపడి స్వతహాగా చేయలేకపోవడం కూడా ఇందులో ఉన్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి కనీసం వందలో ఒక్కరు కూడా ఇంటి వద్ద నుండి సమర్థవంతంగా పని చేయలేరని తాజా సర్వే వెల్లడించింది.

వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రబుల్‌కు ఇవే కారణాలు..

వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రబుల్‌కు ఇవే కారణాలు..

వర్క్ ఫ్రమ్ హోమ్‌లో సామర్థ్యం లేకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. 1. నేర్చుకునే విషయంలో ముందుండకపోవడంతో 95 శాతం మంది, కమ్యూనికేషన్ స్కిల్స్ లోపించడంతో 65 శాతం మంది, ప్రణాళిక, అమలు లోపించడంతో 61 శాతం మంది ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి 99.8 శాతం మంది ఇబ్బందులు పడుతున్నారు.

బలహీనత గుర్తించేందుకు ఉపయోగపడింది

బలహీనత గుర్తించేందుకు ఉపయోగపడింది

వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉద్యోగి బలం, బలహీనతలను గుర్తించడం చాలా కీలకమని సర్వే అభిప్రాయపడింది. ఉద్యోగుల ఉత్పాదకత స్థాయిని పెంచేందుకు వారి వ్యక్తిత్వాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని, వర్క్ కేటాయించాలని సూచించింది. ఆయా వ్యక్తుల ధోరణి, సామర్థ్యాన్ని బట్టి కంపెనీలు తమ ఉత్పాదకతను పెంచుకునేందుకు ప్రణాళికలు రచించుకోవాలని అభిప్రాయపడింది.

ఈ సర్వే ప్రకారం...

ఈ సర్వే ప్రకారం...

- 99.8 శాతం మంది ఉద్యోగులు కనీసం ఏదో ఒక అంశంలో అసమర్థంగా ఉన్నారు.

- 16.97% ఉద్యోగులకు సవాళ్లను ఛేదించడమంటే ఆసక్తి. వారు అత్యంత క్లిష్టమైన సవాళ్ళను సైతం సులువుగా చేయగలరు. కొత్త సవాళ్లు అప్పగిస్తే కొద్దిపాటి సాయంతో పనిని చక్కబెట్టగలరు.

- మరో 17% ఉద్యోగులు ఓసారి స్పష్టమైన ఆదేశాలు ఇస్తే పనిని చక్కబెట్టగలరు. వారు పనిని పూర్తి చేయాలంటే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి.

దేనికైనా సిద్ధంగా ఉండాలి

దేనికైనా సిద్ధంగా ఉండాలి

- ఐటీ సిబ్బందికి ఇచ్చే పనులు లాజిక్‌కు సంబంధించినవి ఉంటాయి. కాబట్టి చిన్న ప్రాజెక్టులైనా, పెద్ద ప్రాజెక్టులైనా వారితో సన్నిహితంగా ఉండి తరుచూ చర్చించాల్సిందేనని సర్వే అభిప్రాయపడింది.

- ఐటీ సిబ్బంది లాజిక్‌తో ముందుకు వెళ్తారు. పైస్థాయి వారు అడిగే ఏ చిన్న ప్రశ్నకైనా, ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం ఇచ్చేలా ఉండాలి.

- 12.7% సిబ్బంది సామాజిక సంప్రదింపులతో పని చక్కబెడుతుంటారు. వీరితో ఇంటి నుంచే పనిచేయించడం సవాల్ అని సర్వేలో వెల్లడైంది. వీరితో వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి వర్చువల్ కమ్యూనికేషన్ తప్పనిసరి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+