కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడింది. ఒక్క ఎగుమతి రంగంలోనే 1.5 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపడితే ప్రమాదం తగ్గుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (FIEO) పేర్కొంది. ఎక్స్‌పోర్ట్ రంగంలో 50 శాతం ఆర్డర్లు రద్దయినట్లు చెబుతున్నారు.

రూ.30,000 కోట్లు ఇవ్వండి
కరోనా దెబ్బతో ఎగుమతి వాణిజ్య రంగం కూడా భారీగానే దెబ్బతిన్నది. సగానికి పైగా ఆర్డర్స్ రద్దయ్యాయని FIEO ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యం అనిశ్చితిలోకి జారుకోవడంతో భారత ఎగుమతి రంగంలో 1.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంతేకాదు ఈ రంగ కంపెనీల మొండి బకాయిలు(NPA) పెరుగుతాయని పేర్కొంది. వెంటనే ఈ రంగానికి ప్యాకేజీ ప్రకటించాలని ప్రెసిడెంట్ శరద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

సమతూకం అవసరం
జీవితం, జీవనోపాధికి మధ్య సమతూకం అవసరమని, ఏదో ఒకదానినే ఎంచుకుంటే దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రస్తుతం భారత ఎగుమతిదారుల చేతుల్లో కొద్దిపాటి ఆర్డర్స్ మాత్రమే ఉన్నాయని, కనీస కార్మిక శక్తితో ప్లాంట్లలో ఉత్పత్తికి అనుమతి లేకుంటే వారికి కోలుకోలేని నష్టం ఉంటుందని, ఇలాంటి సంక్షోభం సమయంలో వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు, హస్తకళాకృతులు, ఇంజనీరింగ్ రంగాల ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోతారన్నారు.

చైనా చేజిక్కించుకునే ప్రయత్నాలు
చైనాలో ప్లాంట్లలో తిరిగి ఉత్పత్తి ప్రారంభమైందని, కాబట్టి మనకు రావాల్సిన ఆర్డర్స్‌ను చైనా చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్‌పోర్ట్ రంగంలోని వారికి వడ్డీలేని నిర్వహణ మూలధన రుణాలను రూపొందించాలని కోరారు. మార్చి నుంచి మే నెల వరకు ఈపీఎఫ్, ఈఎస్ఐసీ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. ప్రీ, పోస్ట్ షిప్‌మెంట్ క్రెడిట్‌కు మూడు నెలల నుండి ఆరు నెలల పొడిగింపు కల్పించాలన్నారు.

వడ్డీలేని రుణాలతో..
కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌పోర్ట్ రంగానికి రూ.30,000 కోట్ల రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించాలని FIEO కోరింది. వీటిని వడ్డీలేని నిర్వహణ మూలధన రుణాలుగా ఇవ్వాలని సూచించింది. వడ్డీలేని రుణాల వల్ల ప్రభుత్వానికి కేవలం రూ.1,974 కోట్ల భారం మాత్రమే పడుతుందని, కానీ ఈ రంగానికి క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఉద్యోగాలు పోకూడదంటే, ఈ రంగం కుదేలు కాకుండా ఉండాలంటే ఏదైనా చేయాలని ప్రధాని మోడీని కోరారు.

6 నెలల శాలరీ, వేతనాలు, రెంట్, ఛార్జీలకు సమానం
వడ్డీలేని వర్కింగ్ కేపిటల్ లోన్ ద్వారా ఆరు నెలల గ్రాస్ శాలరీ, వేతనాలు, రెంట్, విద్యుత్ ఛార్జీలను కవర్ చేయగలవని తెలిపింది. బ్యాంకులో క్లీన్ రికార్డ్ ఉన్నవారికి ఎలాంటి అదనపు పేపర్ వర్క్, ఇతర ఇబ్బందులు లేకుండా రుణాలు ఇవ్వాలని కోరింది. తిరిగి చెల్లింపులు చేసే సమయాన్ని 6 నెలల తర్వాత ప్రారంభమయ్యేలా చూడాలని, ఇది 18 నెలల వాయిదాలకు సమానంగా ఉండాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి లేఖ రాసింది FIEO.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications