COVID 19: శాలరీ లేకుండానే.. కఠిన సమయంలో విప్రో కఠిన నిర్ణయాలు తప్పవా?
కరోనా వైరస్ కారణంగా ఐటీ రంగం కూడా కుదేలవుతోంది. సాఫ్టువేర్ రంగంలో కూడా ఉద్యోగాలపై భారీగానే ప్రభావం పడుతోంది. కరోనా వల్ల ఐటీ దిగ్గజాలకు చెందిన క్లయింట్స్ తమ వ్యాపారాలు తగ్గిపోవడంతో ఖర్చులు తగ్గించుకుంటాయి. ఈ ప్రభావం ఈ రంగంపై ఉంటుంది. ఇప్పటికే చాలామంది బెంచ్‌కు పరిమితమయ్యారు. ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాలు లేకపోవడంతో పాటు ఉన్న ఉద్యోగులు కూడా ఆందోళన చెందే పరిస్థితి ఉంది.

హైరింగ్ నెమ్మది, శాలరీ హైక్, ప్రమోషన్లపై ప్రభావం
సమాచారం మేరకు విప్రో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 12,000 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగంలోకి తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోను అంతేమందినితీసుకోవాలని భావించింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ హైరింగ్ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. కొత్త ఉద్యోగాలకు సంబంధించి విప్రో ప్రాసెస్ నెమ్మదించనున్నట్లు తెలుస్తోంది. అలాగే శాలరీ హైక్స్, ప్రమోషన్లపై ప్రభావం పడుతోంది.

4,500 తగ్గిన హెడ్ కౌంట్
2019-20 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆన్-బోర్డింగ్ నెమ్మదించడంతో హెడ్ కౌంట్ 4,500 తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్ నాటికి కంపెనీలో 187,318 ఉద్యోగులు ఉండగా, సంవత్సరం చివరి నాటికి ఇది 182,886కు తగ్గింది.

వినియోగ రేటు పెరిగింది
ప్రస్తుతమున్న వనరులనే వినియోగించుకోవడం, క్వార్టర్ 4లో నియామక ప్రక్రియ నెమ్మదించిందని చెబుతున్నారు. దీని వల్ల వినియోగ రేటు పెరిగిందట. థర్డ్ క్వార్టర్‌లో వినియోగ రేటు 70.2 శాతంగా ఉంటే, మార్చి క్వార్టర్‌లో ఇది 73.4 శాతంగా ఉంది. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని వినియోగించుకోవడం, పరిస్థితిని అంచనా వేయడంపై దృష్టి సారించింది.

వీటిపై ప్రభావం
గత ఏడాది 12,000 మంది ఫ్రెషర్స్‌ను విప్రో తీసుకుంది. ఈ ఏడాది కూడా అంతేమందిని తీసుకోవాలని భావించింది. కానీ కరోనా కారణంగా ఈ ఆలోచనను పక్కన పెట్టేసింది. కంపెనీ ఉద్యోగులకు వేతనాల హైక్స్ లేకపోవడం, ప్రమోషన్ల వాయిదాలపై కూడా ప్రభావం పడుతోంది.

ఉద్యోగులను సెలవులపై వెళ్లమని అడిగే అవకాశం
విప్రో క్వార్టర్ 4లో లాభాలు దాదాపు 6 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం 93 శాతం మంది విప్రో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరబ్ గోవిల్ అన్నారు. అంతకుముందు క్వార్టర్‌తో పోలిస్తే ఈ క్వార్టర్‌లో వినియోగ రేటు 3 శాతం పెరిగినట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది ఉద్యోగులను సెలవులపై వెళ్లమని అడిగే అవకాశముందని చెబుతున్నారు. వేతనం లేని సెలవులపై పంపించే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు

కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చు
ఉద్యోగులు సెలవులపై వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుందని, ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి అని, తాము కఠినమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉండవచ్చునని కూడా గోవిల్ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ మాటేమిటి?
గత ఆర్థిక సంవత్సరంలో పన్నెండువేల మందిని ఫ్రెషర్స్‌ను తీసుకున్నారు. ఈ ఏడాది కూడా అంతేమందిని తీసుకుందామని భావించినప్పటికీ కరోనా దెబ్బకొట్టింది. కరోనా కారణంగా 14 మిలియన్ డాలర్ల నుండి 16 మిలియన్ డాలర్ల మేరకు ప్రభావం పడింది.


Click it and Unblock the Notifications