Budget 2021: ఆదాయపు పన్నులో మార్పులు ఉంటాయా?
న్యూఢిల్లీ: మార్చి చివరి వారం నుండి కరోనా-లాక్ డౌన్ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఎన్నో దేశాల వృద్ధి రేటు దశాబ్దాలు, శతాబ్దాల కనిష్టానికి చేరుకుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో బడ్జెట్ తయారీ కసరత్తు సాగుతోంది. గత బడ్జెట్‌లో నిర్మలమ్మ కీలక నిర్ణయాలు వెల్లడించారు. గత ఏడాది మందగనం, ఈసారి కరోనా కారణంగా లోటు భారీగా ఉంటుంది. జీడీపీతో రుణ నిష్పత్తి 85 శాతం నుండి 95 శాతంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఆరోగ్యానికి ఎక్కువ కేటాయింపులు
కరోనా నేపథ్యంలో ఆరోగ్యం, రక్షణపై ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా వచ్చే బడ్జెట్‌లో వీటి కోసం ఎక్కువగా కేటాయింపులు చేసే అవకాశం ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటును జీడీపీలో 3 శాతానికి తీసుకు రావాలని, 2024-25 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణాలను 40 శాతానికి తీసుకు రావాలని FY20 బడ్జెట్‌లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జీడీపీలో 5 శాతానికి పెంచాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ఆదాయపు పన్ను మినహాయింపులో తగ్గింపు!
లోటును జీడీపీలో 5 శాతంగా ఉంచడానికి కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపులో గణనీయమైన తగ్గింపు, కార్పోరేట్ ట్యాక్స్‌లపై ఒకసారి, ఒక ఏడాది సర్‌చార్జ్ (అయితే ఇది 2019 సెప్టెంబర్‌లో నిర్మలమ్మ కంపెనీ ట్యాక్స్ కట్ రేటు విశ్వసనీయతను దెబ్బతీస్తుంది), అన్ని మంత్రిత్వ శాఖల్లో ప్రభుత్వ ఫీజులు, యూజర్ ఛార్జీలు పెంచడానికి క్రమబద్ధమైన ప్రయత్నం, తద్వారా జీడీపీ నిష్పత్తిలో పన్నేతర ఆదాయం తగ్గింపు ధోరణికి చెక్ పెట్టడం, మిగులు ప్రభుత్వ భూముల అమ్మకం ఉన్నాయి.

దిగుమతి సుంకం..
దిగుమతి సుంకం రేట్లు పెంచకూడదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎగుమతుల డిమాండ్ నుండి మనం లబ్ధి పొందాలనుకుంటే, జాతీయ, అంతర్జాతీయ చైన్‌లో ఎక్కువగా పాల్గొనడంతో పాటు దిగుమతి సుంకం రేట్లను 2017 సవరించాలని అంటున్నారు.


Click it and Unblock the Notifications