చైనా అంటే అమెరికాకు అంత భయమా.. అందుకే భారత్‌ని టార్గెట్ చేసిందా..
రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో భారతదేశం - అమెరికా మధ్య ఉన్న ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తుందనే ఆరోపణలతో అమెరికా.. భారతదేశం, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి విదితమే. అయితే చర్యలు తీసుకునే విషయంలో మాత్రం యుఎస్ భారత్ నే టార్గెట్ చేస్తోంది.రష్యా నుండి చమురు కొనుగోలు చేయడాన్ని ఆపాలన్న డిమాండ్‌తో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రభుత్వానికి వరుసగా హెచ్చరికలు జారీ చేశారు.అయితే భారతదేశం వెనక్కి తగ్గకపోవడంతో ట్రంప్ సర్కారు ఏకంగా 50 శాతం అదనపు సుంకాలను విధించింది.
ఇదే సమయంలో చైనా కూడా రష్యా నుంచి మరింతగా చమురు కొనుగోలు చేస్తుంటే దానిపై ఎటువంటి సుంకాలు విధించడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాపై పలువురు నిపుణులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా దీనిపై అమెరికా విదేశాంగ శాఖ క్లారిటీ ఇచ్చింది. చైనాపై ఆంక్షలు విధిస్తే ప్రపంచ చమురు ధరలు ఒక్కసారిగా పైకి దూసుకెళ్లే ప్రమాదం ఉండటంతో, ఆ దేశంపై చర్యలు తీసుకోవటం తాత్కాలికంగా తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది.

అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇటీవల ఫాక్స్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ఎంతో పెద్ద మొత్తంలో Russian Oil ని దిగుమతి చేసుకున్నా దానిపై సుంకాలు ఎందుకు విధించలేదో కారణాలు వివరించారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. చైనా.. రష్యా చమురు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తోంది. ఆ చమురు చైనాలో శుద్ధి అయి తిరిగి యూరప్‌కు లేదా అంతర్జాతీయ మార్కెట్‌లకు చేరుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో చైనాపై ఆంక్షలు విధిస్తే ప్రపంచ ఇంధన ధరలు ఒక్కసారిగా పైకి వెళ్లే ప్రమాదం ఉంది. ఆ సరఫరా ఒక్కసారిగా ఆగిపోతే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు కొరత పెరుగుతుంది. ధరలు భారీగా పెరిగే అవకాశముందని తెలిపారు.
చైనాలో తీవ్రమైన జల విద్యుత్ సంక్షోభం, డేంజర్ జోన్‌లో భారత్ ఈశాన్య రాష్ట్రాలు
భారతదేశం కూడా రష్యా చమురును భారీగా దిగుమతి చేసుకుంటోంది.అయితే దానిని శుధ్ధి చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయకుండా దాని స్వప్రయోజనాలకే వాడుకుంటోందని తెలిపారు.ఈ చమురు ద్వారా దేశీయ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలనే ప్రయత్నం చేస్తోందన్నారు. అలాగే రష్యా చమురును శుధ్ధి చేసి తిరిగి ఆదేశానికే ఎగుమతి చేస్తోంది. దీని ద్వారా మాస్కోకు డబ్బు తరలివెళుతోందని తెలిపారు.ఈ నేపథ్యంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం అమెరికాకు చికాకు కలిగించే అంశంగా మారుతోందన్నారు.
భారతదేశానికి భారీ ఇంధన అవసరాలు ఉన్నాయి. చమురు, బొగ్గు, గ్యాస్ వంటి వనరులను కొనుగోలు చేయడం వారి ఆర్థిక అవసరాల వల్లనే జరుగుతోంది. రష్యా చమురు ఇంకా మార్కెట్‌లో చౌకగా లభిస్తున్నందున... ఆ అవకాశాన్ని భారత్ ఉపయోగించుకుంటోందని ఆయన అన్నారు.ఇది రష్యా యుద్ధ యత్నాలను నిలబెట్టడానికి కూడా చెల్లే సహాయం అవుతోందన్నారు. ఇదిలా ఉంటే భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేయడాన్ని ఆపకుంటే, తదుపరి దశలో సుంకాల పెంపు అంశం పరిశీలిస్తామని అన్నారు.


Click it and Unblock the Notifications