Hydropower Shock in China : చైనాలో నిర్మాణం జరుపుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మక జలవిద్యుత్ ప్రాజెక్ట్ మెగా డ్యామ్ ఇప్పుడు తీవ్ర సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతోంది. టిబెట్‌లో నిర్మిస్తున్న 167 బిలియన్ డాలర్ల విలువైన యార్లాంగ్ త్సాంగ్పో మెగా డ్యామ్ ఇప్పుడు తీవ్ర నీటి కొరత సమస్యను ఎదుర్కుంటోంది. బ్లూమ్‌బెర్గ్ తాజా నివేదిక ప్రకారం.. ఈ ఏడాది వర్షాలు కువరకపోవడం వల్ల ఇక్కడ జలవిద్యుత్ ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది.
జనవరి నుండి జూలై 2025 మధ్య కాలంలొ చైనా జలవిద్యుత్ ఉత్పత్తి 27.8 టెరావాట్ గంటల వరకు తగ్గింది. ఈ తగ్గుదల బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గిన స్థాయికే సమానం.థర్మల్ పవర్ స్టేషన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి 1.3 శాతం తగ్గగా సిమెంట్ ఉత్పత్తిలో 4.5 శాతం తగ్గుదల కనిపించింది. ఇక ఉక్కు తయారీలో 3.1 శాతం తగ్గుదల నమోదయింది. దీనిర్థం ఏమిటంటే.. ఫ్యాక్టరీలు కొనసాగుతున్నప్పటికీ బొగ్గు వినియోగం మొత్తం పడిపోయింది.
ఇది కార్బన్ ఉద్గారాల పరంగా కొంత ఊరటకలిగిస్తున్నప్పటికీ లవిద్యుత్‌లో నిరంతరంగా ఉత్పత్తి తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవంగా చెప్పాలంటే.. ఈ డ్యామ్ పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ ప్లాంట్‌గా నిలవనుంది. గత నాలుగేళ్లలో చైనా జల విద్యుత్ సామర్థ్యాన్ని మూడో వంతు వరకు పెంచుకుంటూ వచ్చింది. అయితే 2025లో ఇప్పటివరకు విద్యుత్ ఉత్పత్తి గరిష్ఠంగా 11 శాతం మాత్రమే పెరిగింది. ఇదే ఏడాదిలో 27.8 టెరావాట్టు-గంటల ఉత్పత్తి కోత జరిగింది.

చైనాలోని యాంగ్జీ బేసిన్ ప్రాంతం ప్రపంచ మొత్త జలవిద్యుత్‌కు 20 శాతం వంతు అందిస్తుంది. అయితే జూలై నెలలో అక్కడ వర్షపాతం సాధారణం కంటే 25 శాతం తక్కువగా నమోదైంది. ఇక గత 6 సంవత్సరాలలో 4 సంవత్సరాలు కరువు లాంటి పరిస్థితులు కనిపించాయి. ఇదే విధంగా నీటి ప్రవాహం తగ్గిపోతే.. ఆ ఆనకట్టలన్నీ పనిలేకుండా నిలిచి పోతాయి. ఫలితంగా చైనా మళ్లీ బొగ్గువైపు మొగ్గుచూపాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది.ఒకవేళ వాతావరణ పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి వస్తే ఈ సమస్య సేదతీరవచ్చు.
ఈ పరిస్థితులకు చైనా తీసుకున్న కాలుష్య నియంత్రణ చర్యలు కూడా ఒక కారణంగా మారాయని నిపుణులు చెబుతున్నారు. 2013 తర్వాత దాని ప్రభుత్వాలు PM2.5 ( ధూళి / కాలుష్య కణాలు) తగ్గించేందుకు గట్టి చర్యలు తీసుకున్నాయి. ఈ కాలుష్య కణాలు సూర్యరశ్మిని తిరిగి ప్రతిబింబించి వర్షం ఏర్పడేందుకు కారకాలుగా పనిచేస్తాయి. అయితే అవి తగ్గిపోవడంతో వర్షపాతం కూడా తగ్గినట్టు పరిశోధనలు సూచిస్తున్నాయి.
వాతావరణం మరింత వేడెక్కితే, వేసవిలో చైనీయులు ఎయిర్-కండిషనర్‌లను ఎక్కువగా వాడతారు. అప్పుడు జలవిద్యుత్ పనిచేయకపోతే, బొగ్గు విద్యుత్ ప్లాంట్లను మరింత నడపాల్సి వస్తుంది. దీని వల్ల కలిగే కార్బన్ ఉద్గారాల ప్రభావం చైనాలోనే కాక, భారతదేశం సహా మొత్తం పరిసర ప్రాంతాల వర్షాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
భారతపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఈ డ్యామ్ యార్లంగ్ త్సాంగ్పో నది మీద నిర్మించబడుతోంది. అదే నది భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత బ్రహ్మపుత్ర నదిగా మారుతుంది. కాబట్టి అక్కడ వర్షాలు పడకపోతే లేదా చైనా నీటిని నిలుపుకొని పంపిణీను నియంత్రిస్తే..భారత్‌పై దీని ప్రభావం అనేక విధాలుగా పడుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో సిమెంట్, వ్యవసాయ కార‍్యకలాపాలకు బ్రహ్మపుత్ర నది ముఖ్యమైన వనరు. ఒక వేళ చైనా కనుక నీటిని నిలిపివేస్తే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో సాగునీటి కొరత ఏర్పడుతుంది.
చేపల ఉత్పత్తి, జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. ఒకవేళ పెద్ద మొత్తంలో నీటిని ఆనకట్ట నుండి విడుదల చేస్తే.. బ్రహ్మపుత్ర లోయను ఆ వరద ముంచెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతి సంవత్సరం అస్సాంలో సంభవిస్తున్న వరదలు లక్షల మందిని ప్రభావితం చేస్తున్నాయి. ఇక అరుణాచల్, సిక్కిం తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున హైడ్రో ప్రాజెక్టులను కేంద్రం ప్రోత్సహిస్తోంది. అందువల్ల మోదీ సర్కారు బొగ్గు + సౌర + పవన శక్తి లాంటి మిశ్రమానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
పొరుగుదేశంలో జల విద్యుత్ తగ్గిపోతే.. చైనా మళ్ళీ బొగ్గుపై ఆధారపడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఉద్గారాలు పెరగడానికి దారితీస్తుంది. అప్పుడది గ్లోబల్ వార్మింగ్ గా మారిపోతుంది. దీని వల్ల మన దేశంలో రుతుపవనాల తత్వం మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
More From GoodReturns

మళ్లీ టారిఫ్ బాదుడు మొదలు పెట్టిన ట్రంప్.. ఇరాన్‌తో పాటు చైనా అంతు కూడా చూస్తామని సంచలన ప్రకటన..

హార్ముజ్ జలసంధిపై నీ పెత్తనమేంది.. అమెరికాపై విరుచుకుపడిన చైనా.. కారణం ఏంటంటే..

మెంతికూరపై హాట్ డిబేట్..భారత్ వర్సెస్ అమెరికా రేట్లతో పోల్చిన మహిళ..నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications