అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో టెలికం దిగ్గజం వొడాఫోన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. భారత ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.20,000 కోట్ల పన్ను వివాదంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో తాము విజయం సాధించినట్లు వొడాఫోన్ శుక్రవారం ప్రకటించింది. బకాయిలు రూ.12,000 కోట్లు, రూ.7,900 కోట్ల పెనాల్టీ చెల్లింపులపై ఉపశమనం లభించినట్లు వొడాఫోన్ తెలిపింది. ఎయిర్ వేవ్స్, లైసెన్స్ ఫీజులకు సంబంధించి వివాదం తలెత్తింది. దీంతో వొడాఫోన్ 2016లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది.
వొడాఫోన్ పైన భారత్ మోపిన పన్నుభారాలు భారత్-నెదర్లాండ్స్ మధ్య కుదిరిన పెట్టుబడి ఒప్పందానికి విరుద్ధమని ట్రైబ్యునల్ రూలింగ్ ఇచ్చినట్లు వొడాఫోన్ తెలిపింది. ఇప్పటికే నష్టాలతో ఈ టెలికం సంస్థకు ఇది మరో ఊరట. ఎందుకంటే ఇటీవల వొడాఫోన్-ఐడియా (వీఐ)కి సుప్రీం కోర్టులో ఏజీఆర్ బకాయిలపై స్వల్ప ఊరట లభించింది. బకాయిలను పదేళ్లలో చెల్లించాలని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇప్పుడు రూ.20,000 కోట్ల పన్ను వివాదంలో విజయం సాధించినట్లు తెలిపింది.

కాగా, అంతర్జాతీయ న్యాయస్థానంలో వొడాఫోన్ విజయం సాధించినట్లు వెల్లడించడంతో వొడాఫోన్ ఐడియా షేర్లు లాభపడ్డాయి. నిన్నటి వరకు భారీగా నష్టాలను చవిచూసిన ఈ షేర్ ధర ఈ రోజు 12 శాతం లాభపడి రూ.10.20 వద్ద ముగిసింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications